పది రోజుల పాటు జరిగే గణేష్ చతుర్థి ఉత్సవాలు బుధవారం నుంచి దేశంలో ప్రారంభమయ్యాయి. ఇక దేశంలో వినాయక చవితి పండగను అతి ఘనంగా నిర్వహించే రాష్ట్రాల్లో ఒకటైన మహారాష్ట్రలోనూ ఈసారి ఉత్సవాలు మరింత ఘనంగా మొదలయ్యాయి. గత రెండేళ్లుగా కరోనా వైరస్(Corona Virus) ఇన్ఫెక్షన్ కారణంగా అనేక ఆంక్షల నీడలో ఈ పండుగను జరుపుకున్నారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ఈ సంవత్సరం గణేష్ విగ్రహాలను(Ganesh Idols) బహిరంగ స్థాయిలో పెద్ద మండపాల్లో ఏర్పాటు చేస్తున్నారు. లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించే మండపాలకు బీమా కూడా కల్పిస్తున్నారు. ఏదైనా నష్టాన్ని భర్తీ చేయడానికి ఈ బీమా పాలసీలు(Insurance Policies) ఉపయోగపడతాయి. ఈ సంవత్సరం ముంబైలోని అత్యంత ధనిక గణేష్ మండపాలలో ఒకటైన గౌర్ సరస్వత్ బ్రాహ్మణ (GSB) సేవా మండల్ మండపానికి గణేష్ చతుర్థి పండుగ కోసం 316.40 కోట్ల రూపాయల బీమా రక్షణ పొందారు.ఈ సేవా మండల్ సెంట్రల్ ముంబైలోని మోంటుగాలో కింగ్స్ సర్కిల్ సమీపంలో 1955లో స్థాపించబడింది. ఇది ఒక సర్కిల్ ద్వారా తీసుకున్న అత్యధిక బీమా రక్షణ అని ఒక వాలంటీర్ పేర్కొన్నారు. బీమా కింద అన్ని ప్రజా బాధ్యతలు, మండలాన్ని సందర్శించే ప్రతి భక్తుడు 10 రోజుల ఉత్సవాలకు కవర్ చేయబడతారని తెలిపారు.
భూకంప ప్రమాదంతో కూడిన రూ. 1 కోటి విలువైన ఫైర్ అండ్ స్పెషల్ రిస్క్ పాలసీని బోర్డు తీసుకుంది. ఇందులో ఫర్నిచర్, ఫిక్చర్‌లు, ఫిట్టింగ్‌లు, కంప్యూటర్‌లు, సిసిటివి, స్కానర్‌లు ఉన్నాయి. తాము అత్యంత క్రమశిక్షణ కలిగిన గణేష్ మండలి అని.. కాబట్టి బప్పా ప్రతి భక్తుడిని సురక్షితంగా ఉంచడం తమ బాధ్యత అని తెలిపారు.
గణపతి బప్పా మోరియా.. ఈద్గా వద్ద వినాయక చవితి వేడుకలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..
16 ఏళ్ల క్రితం వ్యాపారికి దొరికిన డైమండ్ గణేషా.. ప్రతి ఏడాది భక్తితో ప్రతిష్టించి..
బంగారం, వెండి మరియు ఇతర విలువైన వస్తువులకు రూ. 316 కోట్ల బీమా కవరేజ్ రూ. 31.97 కోట్లు, మండపాలు, వాలంటీర్లు, పూజారులు, కుక్‌లు, ఫుట్‌వేర్ స్టాల్స్, కార్మికులు, వాలెట్ పార్కులు, వ్యక్తులు, సెక్యూరిటీ గార్డులకు రూ. 263 కోట్ల వ్యక్తిగత బీమా కవరేజీని చేర్చారు. ఇక గణేశుడి విగ్రహాన్ని అలంకరించడానికి 60 కిలోల కంటే ఎక్కువ బంగారం ఉపయోగించబడుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ganesh Chaturthi 2022