హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

గణపతి బప్పా మోరియా.. ఈద్గా వద్ద వినాయక చవితి వేడుకలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

గణపతి బప్పా మోరియా.. ఈద్గా వద్ద వినాయక చవితి వేడుకలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

గణేష్ విగ్రహలు

గణేష్ విగ్రహలు

Karnataka: హుబ్బళ్లిలోని ఈద్గా మైదానంలో గణేష్ చతుర్థి వేడుకలకు కర్ణాటక హైకోర్టు అనుమతి ఇచ్చింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Karnataka, India

దేశ వ్యాప్తంగా బెంగళూరులోని ఈద్గా వద్ద గణేష్ ఉత్సవాల (Ganesh chavithi) నిర్వహణపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే.  సుప్రీంకోర్టు ధర్మాసనం (Supreme court) బెంగళూరులోని ఈద్గా వద్ద గణేష్ చవితి వేడుకలను నిర్వహించరాదని అత్యవసరంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత.. దీన్ని కర్ణాటక హైకోర్టుకు పంపించింది. ఈ క్రమంలో.. కేసును హైకోర్టుకు తిరిగి పంపిన తర్వాత కర్ణాటకలోని హుబ్బళ్లిలోని ఈద్గా మైదానంలో గణేష్ చతుర్థి వేడుకలను అనుమతించాలా వద్దా అని కర్ణాటక హైకోర్టు అర్ధరాత్రి విచారణ చేపట్టింది.


హుబ్బళ్లిలోని ఈద్గా మైదానంలో (Eidgah Ground) గణేష్ చతుర్థి వేడుకలకు కర్ణాటక హైకోర్టు మంగళవారం రాత్రి అనుమతి ఇచ్చింది. కర్ణాటక రాష్ట్రం తరఫున హాజరైన అడిషనల్ అడ్వకేట్ జనరల్ ధ్యాన్ చిన్నప్ప మాట్లాడుతూ హుబ్బళ్లి ఈద్గా మైదాన్ విషయం బెంగళూరుకు భిన్నమైనదని అన్నారు. సుప్రీంకోర్టు కేసును హైకోర్టుకు తిరిగి పంపడంతో కర్ణాటకలోని హుబ్బళ్లిలోని ఈద్గా మైదానంలో గణేష్ చతుర్థి వేడుకలను అనుమతించాలా వద్దా అని కర్ణాటక హైకోర్టు నిర్ణయించాల్సి వచ్చింది.



ఇదిలా ఉండగా  రేపు దేశ మంతటా వినాయక చవితి (Ganesh chavithi) ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.


ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. కర్ణాటకలోని బెంగళూరులోని ఈద్గా మైదాన్‌లో గణేష్ చతుర్థి వేడుకలు నిర్వహించరాదని సుప్రీంకోర్టు (Supreme court) మంగళవారం అత్యవసర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో రేపు పండుగ నేపథ్యంలో.. తీవ్ర ప్రతిష్టంభన నెలకొంది. హిందువుల పండుగకు పందాలు ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇవ్వాలని రాష్ట్రం పట్టుబట్టిందని, హైకోర్టు కూడా అలా చేయవచ్చని తెలిపింది.


బెంగళూరులోని ఈద్గా మైదాన్‌లో బుధవారం గణేష్ చతుర్థి వేడుకలను నిర్వహించేందుకు కర్ణాటక హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు (ఎస్సీ) మంగళవారం నిలిపివేసింది. ఈ విషయంలో ‘యథాతథ స్థితి’ కొనసాగించాలని ఆదేశించింది. కర్ణాటక హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా కర్ణాటక వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అదే విధంగా.. “200 సంవత్సరాలుగా” అక్కడ అలాంటి ఉత్సవాలు నిర్వహించలేదని పేర్కొంది. ప్రస్తుతం కర్ణాటకలో ఈద్గా మైదానంలో గణేష్ చతుర్థి వేడుకల విషయంలో వివాదం నడుస్తోంది.


Published by:Paresh Inamdar
First published:

Tags: Ganesh Chaturthi​, Highcourt, Karnataka

ఉత్తమ కథలు