news18-telugu
Updated: August 21, 2020, 5:48 PM IST
మట్టితో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేస్తున్న విద్యార్థిని
ఇంటి దగ్గరే మట్టితో ఎకో ఫ్రెండ్లీ గణేశ(Eco Ganesha) విగ్రహాన్ని తయారు చేసుకుని పూజించేందుకు పర్యావరణ ప్రియులు మొగ్గుచూపుతున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని గౌతమి నగర్‌కు చెందిన ఎంబీఏ విద్యార్థిని ఉష శ్రీ తమ ఇంటి దగ్గరే మట్టితో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేశారు. పర్యావరణానికి హాని కలిగించే వినాయకుడి ప్రతిమలకు గుడ్‌బై చెప్పి...పర్యావరణ ప్రియమైన మట్టి వినాయకుడి ప్రతిమలను తయారుచేసుకుని ఇళ్లలో ప్రతిష్టించి పూజలు చేయాలని సూచించారు. పర్యావరణానికి హాని జరుగుతుందని తెలిసినా కృత్రిమ వినాయకుడి విగ్రహాలను కొనుగోలు చేసి పూజించడం సరికాదన్నారు. వినాయకుడి విగ్రహాన్ని సొంతంగా మట్టితో తయారు చేసుకుని పూజిస్తే వచ్చే తృప్తి...కృత్రిమ వినాయకుడి విగ్రహాలను కొనుగోలు చేసుకుని పూజిస్తే రాదని పేర్కొన్నారు.
మట్టితో ఇంటి దగ్గరే వినాయకుడి విగ్రహాన్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఉష శ్రీ చేసి చూపించారు. మరెందకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి.
Published by:
Janardhan V
First published:
August 21, 2020, 5:36 PM IST