• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • GANESH CHATURTHI 2020 GANESH PUJA HOW AND WHAT TO OFFER TO LORD GANESHA WHILD DOING PUJA ON VINAYAKA CHAVITHI NK

Ganesh Chaturthi 2020: వినాయక చవితి... గణపతికి నైవేద్యం... పూజా విధానం

Ganesh Chaturthi 2020: వినాయక చవితి... గణపతికి నైవేద్యం... పూజా విధానం

Ganesh Chaturthi 2020: వినాయక చవితినాడు గణపతికి నైవేద్యం... పూజా విధానం (credit - twitter)

Vinayaka Chavithi 2020: ఇదివరకు మంటపాలకు వెళ్తే... పూజారులే గణపతి పూజ చేసేవారు. ఈసారి ఇళ్లలోనే పండుగ జరుపుకోవాలి కాబట్టి... నైవేద్యం, పూజా విధానం తెలుసుకుందాం.

  • Share this:
    Ganesh Chaturthi 2020: గణేశ్ చతుర్థి నాడు... ఏ పూజలు ఎలా చెయ్యాలి? నైవేద్యం ఏం సమర్పించాలి... ఇలా ప్రతీ కార్యక్రమానికీ కొన్ని పద్ధతులు, ఆచారాలూ ఉన్నాయి. వాటిని అలాగే పాటిస్తే వ్రత ఫలం ఎక్కువగా లభిస్తుందని పండితులు చెబుతున్నారు. మరి విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా ఏం సమర్పించాలి అనేది చాలా మందికి రకరకాల డౌట్లు ఉంటాయి. ఇప్పుడు నైవేద్య పూజా విధానం తెలుసుకుందాం. మహా గణపతికి... బెల్లం అంటే ఇష్టం. పసుపు వినాయకుడికి... బెల్లం, అరటిపళ్ళు, కొబ్బరికాయను నైవేద్యంగా పెడితే మంచిది. వాటి మీద నీళ్ళు చల్లుతూ "ఓం భూర్భు వస్సువ: తథ్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్‌... సత్యం త్వర్తేన పరిషించామి" అని నైవేద్యం చుట్టూ నీళ్లు తిప్పాలి.

    Ganesh Chaturthi 2020: వినాయక చవితినాడు గణపతికి నైవేద్యం... పూజా విధానం


    అమృతమస్తు పసుపు గణపతి దగ్గర నీళ్లు వదలాలి. "అమృతోపస్తరణమసి" అని నైవేద్యం పైన నీళ్లు చల్లి "శ్రీ మహాగణాధిపతయే నమ: నారికేళ సహిత కదలీఫల సహిత గుడోపహారం నివేదయామి... ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా మధ్యేమధ్యే పానీయం సమర్పయామి" అంటూ 5 సార్లు నైవేద్యాన్ని స్వామికి చేత్తో చూపించాలి.

    "అమృతాపిథానమసి... ఉత్తరాపోశనం సమర్పయామి..... హస్తౌ ప్రక్షాళయామి...పాదౌ ప్రక్షాళయామి...ముఖే శుద్ధాచమ నీయం సమర్పయామి" అంటూ నీళ్లు చల్లాలి.
    శ్రీమహాగణాధిపతయే నమ:... తాంబూలం సమర్పయామి
    శ్రీమహాగణాధిపతయే నమ:... నీరాజనం సమర్పయామి
    హారతి స్వామికి ఇచ్చి కింద పెట్టి "పుష్పార్ఘ్యం సమర్పయామి" అంటూ పువ్వుతో పక్కన నీళ్ళు చల్లి హారతిని కళ్లకు అద్దుకోవాలి.

    "తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి: ప్రచోదయాత్‌ శ్రీమహాగణాధిపతయే నమ: మంత్రపుష్పం సమర్ప యామి" అంటూ పువ్వులు, అక్షితలు, చిల్లర డబ్బులు స్వామి ముందు పెట్టాలి.

    "శ్రీమహాగణాధిపతయే నమ: ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి" అంటూ పువ్వును వినాయకునిపై మెల్లగా వేసి దణ్ణం పెట్టుకోవాలి.

    పువ్వును పసుపు వినాయకుడికి విసురుతూ... "శ్రీమహాగణాధిపతయే నమ: ఛత్రమాచ్చాదయామి... చామరం వీచయామి, నృత్యం దర్శయామి, గీతామాశ్రావయామి, వాద్యం ఘోషయామి... అశ్వానారోహయామి... గజానారోహ యమామి... శకటానారోహయామి... ఆందోళికానారోహయామి" అని పువ్వు దేవుడిమీద వేయాలి.

    "సమస్త రాజోపచార శక్త్యుపచార భక్త్యుపచార పూజాస్సమర్పయామి" అని నీళ్లూ అక్షితలూ పళ్లెంలో వదలాలి.

    "శ్రీ మహాగణపతి దేవతా స్సుప్రీతస్సుప్రసన్నో వరదో భూత్వా వరదో భవతు ఏతత్పలం పరమేశ్వరరార్ప ణమస్తు ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్త్వితి భవంతో బ్రువంతు ఉత్తరే శుభ కర్మణ్యవిఘ్నమస్తు శ్రీమహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి" అని అనాలి.

    ఇప్పుడు... పువ్వులు, అక్షతలు తలపై వేసుకోవాలి.
    "శ్రీ మహాగణధిపతయే నమ: గణపతిం ఉద్వాస యామి" అని పసుపు గణపతిని తూర్పు వైపుకి జరపాలి.

    "శ్రీ మహాగణాధిపతయే నమ: యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయచ" అని అక్షతలు వేసి నమస్కారం చేయాలి. దీంతో పసుపు గణపతి లేదా మహాగణపతి పూజ పూర్తయినట్లవుతుంది.
    Published by:Krishna Kumar N
    First published: