• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • GANESH CHATURTHI 2020 AMAZING GANPATI BAPPA COMES TO WOMANS HOME IN GUISE OF A CHILLI JUST IN TIME FOR FESTIVAL NK

Ganesh Chaturthi 2020: అద్భుతం... పచ్చిమిర్చి రూపంలో వినాయకుడు

Ganesh Chaturthi 2020: అద్భుతం... పచ్చిమిర్చి రూపంలో వినాయకుడు

అద్భుతం... పచ్చిమిర్చి రూపంలో వినాయకుడు (credit - twitter)

Vinayaka Chavithi 2020: వినాయక చవితి నాడు ఆ కుటుంబాన్ని విఘ్నేశ్వరుడు కరుణించాడు. పచ్చిమిర్చి రూపంలో ఆ ఇంటికి వచ్చాడు.

  • Share this:
    Ganesh Chaturthi 2020: వినాయక చవితిని ప్రపంచ వ్యాప్తంగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. చవితి నాడు... ఆ గణనాథుడు... తన తల్లి పార్వతితో కలిసి... కైలాసం నుంచి భూమికి వస్తాడు. ప్రజలు భక్తితో పెట్టే నైవేద్యాన్ని స్వీకరించి... వరాలు కురిపిస్తాడు. ఈ సందర్భంగా... భక్తులు... ఏకదంతుడికి ప్రతిరూపంగా మట్టి గణేశ విగ్రహాల్ని ఇళ్లలో ప్రతిష్టించి... నవరాత్రుల వ్రతాలు, పూజలూ చేస్తారు. ఇలా వినాయకచవితితో... పండుగల సీజన్ మొదలవుతుందని మనకు తెలుసు. ఈ సంవత్సరం ఇవాళ వినాయక చవితి కావడంతో... ఉదయం నుంచే ప్రజలు పండగ చేసుకుంటున్నారు. ఐతే... కరోనా వైరస్ ఉంది కాబట్టి... పూజలు మంటపాల్లో కాకుండా... ఇళ్లలోనే చేసుకుంటున్నారు.

    ఇదే సమయంలో... ఓ మహిళకు పచ్చి మిర్చి రూపంలో గణనాథుడు కనిపించాడు. కూరగాయలు కొనుక్కున్న ఆమె... వాటిని ఇంట్లో సర్దుకుంటుంటే... ఓ పచ్చిమిర్చి అచ్చం వినాయకుడి రూపంలో కనిపించింది. ఆశ్చర్యపోయిన ఆమె... చాలా ఆనందపడింది. ఆ విఘ్నేశ్వరుడే... మిర్చి రూపంలో తమ ఇంటికి వచ్చాడని మురిసిపోయింది. "మనం స్వామి దగ్గరకు వెళ్లలేకపోతే... స్వామే మన దగ్గరకు వస్తారు. ఒక్కోసారి పచ్చిమిర్చి రూపంలో కూడా" అని ఆమె ట్విట్టర్‌లో తెలిపారు. ఆ పచ్చిమిర్చి చూడ్డానికి వినాయకుడి తల, తొండంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది.


    గణనాథుణ్ని పూజించాలంటే... ప్రతిసారీ విగ్రహమే ఉండాల్సిన పనిలేదనీ, పచ్చిమిర్చి రూపంలో కూడా పూజించవచ్చని నెటిజన్లు అంటున్నారు.


    ఈ సంవత్సరం వినాయక చవితి... ఆగస్ట్ 21న రాత్రి 11.02కి మొదలైంది. ఇది... ఆగస్ట్ 22న రాత్రి 7.57కి ముగిస్తుంది. పూజ సమయం వరకూ... వినాయక విగ్రహానికి పైన కవర్ వేసి ఉంచుతారు. వినాయక విగ్రహం తూర్పు లేదా పడమరవైపు చూస్తున్నట్లుగా ప్రతిష్టిస్తారు. వినాయకుడికి ఇష్టమైన కుడుములు తయారు చేసి... నైవేద్యంగా సమర్పించి... తర్వాత భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. విఘ్నాలను తొలగించే వినాయకుడు... మంచిని తెస్తాడనీ, బాధల్ని దూరం చేస్తాడని ప్రతీతి.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు