• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • GANESH CHATURTHI 2020 AARTI BEING PERFORMED AT THE SHRI SIDDHIVINAYAK TEMPLE IN MUMBAI ON GANESH CHATURTHI NK

Ganesh Chaturthi 2020: ముంబైలో సిద్ధి వినాయకుడికి హారతి... వీడియో...

Ganesh Chaturthi 2020: ముంబైలో సిద్ధి వినాయకుడికి హారతి... వీడియో...

ముంబైలో సిద్ధి వినాయకుడికి హారతి... వీడియో... (credit - twitter - ANI)

Vinayaka Chavithi 2020: దేశవ్యాప్తంగా వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు ప్రజలు. మరి ముంబైలో హారతి కార్యక్రమాన్ని వీడియోలో చూద్దాం.

  • Share this:
    gaGanesh Chaturthi 2020: ఈ ప్రపంచంలో గణేశ్ చతుర్థిని అత్యంత అద్భుతంగా జరిపేది ముంబైలో అని మనకు తెలుసు. ఈ సంవత్సరం కరోనా వైరస్ ఉన్నందు వల్ల అక్కడ కూడా కొన్ని కండీషన్లు ఉన్నాయి. అయినప్పటికీ... వీలైనంతవరకూ పండుగను జరుపుతున్నారు. పూజలు, హారతుల్ని తప్పనిసరిగా ఇస్తున్నారు. ముఖ్యంగా ముంబైలోని ప్రపంచ ప్రసిద్ధ సిద్ధి వినాయక ఆలయంలో... ఏకదంతుడికి హారతి ఇవ్వడం కనులారా చూసి తరించే సందర్భం. కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ అక్కడి పూజారులు... స్వామి వారికి హారతులు ఇచ్చారు. ఆ దృశ్యాన్ని అందరూ చూసేలా... ఓ వీడియో రిలీజైంది. నిమిషం 14 సెకండ్ల ఆ వీడియోని మీరు కూడా చూడండి. గణనాథుడి ఆశీస్సులు పొందండి అంటున్నారు పూజారులు.


    ఈ సంవత్సరం వినాయక చవితి... ఆగస్ట్ 21న రాత్రి 11.02కి మొదలైంది. ఇది... ఆగస్ట్ 22న రాత్రి 7.57కి ముగిస్తుంది. పూజ సమయం వరకూ... వినాయక విగ్రహానికి పైన కవర్ వేసి ఉంచుతారు. వినాయక విగ్రహం తూర్పు లేదా పడమరవైపు చూస్తున్నట్లుగా ప్రతిష్టిస్తారు. వినాయకుడికి ఇష్టమైన కుడుములు తయారు చేసి... నైవేద్యంగా సమర్పించి... తర్వాత భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. విఘ్నాలను తొలగించే వినాయకుడు... మంచిని తెస్తాడనీ, బాధల్ని దూరం చేస్తాడని ప్రతీతి.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు