Home /News /trending /

FUNNY WEDDING VIDEO OF BRIDE AND GROOM QUARREL ON THE STAGE OVER EATING SWEET WHICH GOES VIRAL IN SOCIAL MEDIA SRD

Viral Video : పెళ్లి పీటలపైనే సంసారపు గిల్లికజ్జాలు.. పెళ్లి కొడుకు చిలిపి పనికి తిక్కరేగిన వధువు ..

Photo Credit : Instagram

Photo Credit : Instagram

Viral Video : సరదా కోసం చేస్తున్నారో లేక పబ్లిసిటీ కోసమో తెలియదు కానీ, పెళ్లి కొడుకు లేదా పెళ్లి కూతురు చేసే పనులు అందరిని విస్మయానికి గురి చేస్తున్నాయి. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

    సోషల్ మీడియా (Social Media) ప్రపంచంలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. వైరల్ అయ్యే వీడియోల్లో పెళ్లికి సంబంధిచినవి చాలానే ఉంటాయి. ఇటీవల వెడ్డింగ్ వీడియోలు బాగా వైరల్ (Viral Video అవుతున్నాయి. కొన్ని వీడియోల్లో వధువరుల ఆశ్చర్యపోయే దృశ్యాలు, డ్యాన్సులు ఉంటే.. మరికొన్ని వాటిల్లో పొట్టచెక్కలయ్యే ఫన్నీ సన్నివేశాలుంటాయి. ఇవి వేలాది మంది నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఇక, ఇటీవలి కాలంలో పెళ్లి వేడుకలకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. జనాలు కూడా ఇలాంటి వీడియోలను ఇష్టపడటమే ఇందుకు కారణం. సోషల్ మీడియా ప్రభావమో మరో కారణమో కానీ.. ఈ మధ్య కాలంలో వింత పనులకు పెళ్లి మండపాలు వేదికవుతున్నాయి. తాళి కట్టే సమయంలో వధూవరులు చేసే పనులు వైరల్ అవుతున్నాయి. సరదా కోసం చేస్తున్నారో లేక పబ్లిసిటీ కోసమో తెలియదు కానీ, పెళ్లి కొడుకు లేదా పెళ్లి కూతురు చేసే పనులు అందరిని విస్మయానికి గురి చేస్తున్నాయి. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

    తాజాగా ఓ పెళ్లి మండపంలో వధూవరులు చేసిన పని హాట్ టాపిక్ గా మారింది. సాధారణ జీవితంలో భార్యాభర్తల మధ్య కీచులాటలు మామూలే.. కొన్ని సందర్భాల్లో ఇవి మాంచి కామెడీకి కారణమవుతుంటాయి. అసలు పెళ్లైన ఎన్నాళ్లకు సంసారంలో కీచులాటలు మొదలవుతాయనేది భార్యాభర్తల కెమిస్ట్రీని బట్టి ఉంటుంది.

    ఈ అలకలు, గిల్లికజ్జాలు సాధారణంగా నాలుగు గోడలకే పరిమితమవుతాయి. ఎప్పుడో తప్ప బయటివారి దాకా రావు. కానీ ఓ జంట మాత్రం పెళ్లి వేడుక పూర్తవకమునుపే సంసారపు సరిగమలను ఆలపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వివాహ వేడుకలో ఓ ఫోటో షూట్‌ జరిగింది. ఆ సమయంలో పెళ్లికొడుకేమో పెళ్లి కూతురుకి స్వీట్ తిన్పించాలనుకున్నాడు. పెళ్లి కూతురు వద్దని మొదట వారించింది. అయితే, తగ్గని వరుడు ఈ సారి కూడా స్వీట్ తిన్పించాలకున్నాడు. వధువు మొదట ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.








    View this post on Instagram






    A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)





    కానీ, మనోడు పదే పదే ఆ పని చేయడంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. దీంతో..ఆమె భర్తవైపు తిరిగి అతనికి తొడ పాశం పెట్టింది. వీరిద్దరి గిల్లికజ్జాలు ఇప్పుడు తెగ వైరలవుతున్నాయ్. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఏంటీ.. పెళ్లి వేదికపైనే మొదలెట్టేశారా..? అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Marriage, Trending videos, Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు