Fight in flight : విమానంలో(Flight) ఇద్దరు ప్రయాణీకులు దారుణంగా కొట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి కోల్‌కతాకు వస్తున్న విమానంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. క్యాబిన్ క్రూ సేఫ్టీ నిబంధనలు గురించి చెబుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్(Video Viral) గా మారింది. అయితే సాధారణంగా బస్సు, రైలు ప్రయాణ సమయంలో సీటు కోసం గొడవలు జరగడం మనం నిత్యం చూస్తుంటాం. కానీ ఇటీవల ఇలాంటి ఘటనలు విమానాల్లోనూ చోటుచేసుకుంటుండటంతో ప్రయాణికుల మధ్య ఈ పంచాయతీలను తీర్చడం విమాన సిబ్బందికి తలనొప్పిగా మారుతోంది.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఈ నెల 26న బ్యాంకాక్ నుంచి కోల్ కతాకు థాయి స్మైల్ ఎయిర్ వేస్ విమానం బయల్దేరింది. అయితే విమానాం టేకాఫ్ అయిన కొద్దిసేపటికి విమానంలో ఇద్దరి ప్రయాణికుల మధ్య చిన్నపాటి వాగ్వాదం మొదలైంది. వారి మాటలు కొద్ది సమయం తర్వాత గొడవకు దారితీసింది. ఇలా ఇద్దరు మాటకు మాట పెంచుకుంటూ వాదులాడుకుంటున్నారు. ఇద్దర్నీ విమాన సిబ్బంది వారించే ప్రయత్నం చేశారు. అయినా వారి మధ్య గొడవ ఆగలేదు. ఇంతలో ఓ వ్యక్తి తన కళ్లజోడును తీసి ఎదురుగా ఉన్న నల్ల చొక్కా ధరించిన వ్యక్తిని కొట్టడం,అతడికి మద్దతుగా వచ్చిన స్నేహితులు కూడా ఆ ప్రయాణికుడిపై దాడి చేయడం వీడియోలో కనిపిస్తోంది. ఐదుగురు వ్యక్తులు దాడి చేయడంతో అతడు వారి నుంచి రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వీడియోలో కనిపించింది. ప్లీజ్ ఆపండి అని క్యాబిన్ సిబ్బంది అరుస్తున్నా పట్టించుకోకుండా ఆ ప్రయాణికుడిపై పిడిగుద్దులు కురిపించడం కనిపిస్తుంది. ఆ దెబ్బలను అడ్డుకుంటూ, తాను కూడా కొట్టడానికి నల్ల చొక్కా ధరంచిన వ్యక్తి ప్రయత్నించడం కనిపిస్తోంది.
Not many smiles on this @ThaiSmileAirway flight at all ! On a serious note, an aircraft is possibly the worst place ever to get into an altercation with someone. Hope these nincompoops were arrested on arrival and dealt with by the authorities.#AvGeek pic.twitter.com/XCglmjtc9l
— VT-VLO (@Vinamralongani) December 28, 2022
Viral Video: వీడెవడండీ బాబు..సింహంతో ఆడుకుంటున్నాడు..వీడియో వైరల్
ఈ గొడవను ఆపేసేందుకు ఫ్లైట్ అటెండెంట్ ప్రయత్నిస్తుండడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. చివరకు తోటి ప్రయాణికులు, క్యాబిన్ సిబ్బంది జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఇంత జరుగుతున్నా తోటి ప్రయాణికులు చూస్తూ ఉండిపోయారు. మరికొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది వైరల్ అవుతుంది. అయితే ఆ ఘర్షణకు కారణమేంటో ఆ ప్రయాణీకుల వివరాలేంటో తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ప్రాతిపదికగా తీసుకుని సంబంధిత విమాన యాన సంస్థ నుంచి నివేదిక కోరామని బ్యూరొ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్ జుల్ఫికర్ హసన్ తెలిపారు. భారత్ కు సంబంధించి విమాన యాన భద్రతకు ఈ బీసీఏఎస్ బాధ్యత వహిస్తుంది. అయితే ఈ ఘటనపై థాయ్ ఎయిర్‌వేస్ ఎలాంటి ప్రకటనా చేయలేదు.మరోవైపు,విమానంలో ప్రయాణికుడిని కొట్టిన ఐదుగురుని జీవితంలో ఫ్లైట్ ఎక్కకుండా బ్యాన్ చేయాలంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో డిమాండ్లు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Viral Video