ఛీ.. మా ఊరికి ఆ బూతు పేరు వద్దు.. Fuggingగా మార్చుకున్న గ్రామస్తులు.. ఇంతకూ ఆ పేరు ఏంటంటే..

తెలుగులో అయితే తిక్కవారిపాలెం, బోడిపాలెం అంటూ రకరకాల పేర్లతో ఉన్న గ్రామాలను చూస్తే కొంచెం నవ్వు వస్తుంది. అయితే ఈ పేర్లు వ్యగ్యంగా ఉన్నంతవరకు ఫర్వాలేదు గాని.. అభ్యంతరకరంగా ఉంటేనే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇలాగే ఆస్ట్రియాలో ఏమైందంటే..

news18-telugu
Updated: December 1, 2020, 8:53 PM IST
ఛీ.. మా ఊరికి ఆ బూతు పేరు వద్దు.. Fuggingగా మార్చుకున్న గ్రామస్తులు.. ఇంతకూ ఆ పేరు ఏంటంటే..
Image via AFP/Getty Images.
  • Share this:
గ్రామాలు, నగరాలు, పట్టణాలు.. ప్రదేశం ఏవైనా కొన్నిసార్లు వాటికి పెట్టే పేర్లు భలే గమ్మత్తుగా ఉంటాయి. తెలుగులో అయితే తిక్కవారిపాలెం, బోడిపాలెం అంటూ రకరకాల పేర్లతో ఉన్న గ్రామాలను చూస్తే కొంచెం నవ్వు వస్తుంది. అయితే ఈ పేర్లు వ్యగ్యంగా ఉన్నంతవరకు ఫర్వాలేదు గాని.. అభ్యంతరకరంగా ఉంటేనే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదే ఆంగ్లంలో కొన్నిసార్లు ఈ అభ్యంతరం కొంచెం మితిమీరే ఉంటుంది. దీంతో ఆయా స్థానిక ప్రజలే తమ ప్రదేశాల పేర్లను వేరే విధంగా మార్చాల్సి వస్తుంది. ఆస్ట్రియాలో ఓ గ్రామానికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. పేరు కొంచెం అభ్యంతరకరంగా ఉండేసరికి సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. దీంతో భరించలేక స్థానికులు తమ గ్రామం పేరు మార్చుకున్నారు.

ఫగ్గింగ్ గా మార్చేశారు..

ఆస్ట్రియాలో పశ్చిమ వియన్నాకు 350 కిలోమీటర్లు దూరంలో ఉన్న గ్రామం పేరు 'ఫ**ంగ్'. ఆంగ్లంలో దీనర్థం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అభ్యంతరకరంగా ఉండే ఈ గ్రామం పేరు సైన్ బోర్డులపై చూసి అటుగా వచ్చే వారంతా నవ్వుకుంటున్నారు. అంతేకాకుండా చాలా మంది పర్యాటకులు సైన్ బోర్డుపై ఉన్న గ్రామం పేరును తమ మొబైల్లో ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. కొంతమందైతే ఆ బోర్డులను దొంగిలించేస్తుండటంతో స్థానిక అధికారులు పదే పదే వాటిని మారుస్తున్నారు. దీంతో విసిగి పోయిన స్థానికులు తమ గ్రామం పేరును 'ఫగ్గింగ్'(Fugging) గా మార్చేసుకున్నారు. 2021 జనవరి 1 నూతన సంవత్సరం నుంచి ఈ కొత్త పేరు అమలులోకి వస్తుంది. దీంతో 11వ శతాబ్ధం నుంచి అమలులో ఉన్న ఈ గ్రామం పేరును మార్చినట్లయింది.

ఆమోదించిన మేయర్..
టార్స్ టాఫ్ పట్టణ మున్సిపల్ మేయర్ ఆండ్రియా హోల్జనర్ గ్రామస్థుల విన్నపం మేరకు అభ్యంతరకర పేరున్న ఊరి పేరును మారుస్తున్నట్లు అధికారికంగా ధ్రువీకరించారు. "నేను దీని గురించి చాలా చెప్పాలనుకుంటున్నాను. ఈ గ్రామం గురించి మీడియా పదే పదే ప్రస్తావించింది. ఇది ఉన్మాద చర్యగా అనిపిస్తుంది" అని ఆండ్రియా ఓ స్థానిక పత్రికతో ఇంటర్వ్యూలో అన్నారు. ఫ**ంగ్ గ్రామం టార్స్ టాఫ్ పట్టణ పరిధిలో ఉంది.

పేరు మార్పుపై మిశ్రమ స్పందనలు..
ఆస్ట్రియా దినపత్రిక డై ప్రెస్ ప్రకారం అభ్యంతర పేరుతో పిలిచే ఈ గ్రామంలోని గ్రామస్థులపై చెడు జోకులను కూడా వేస్తున్నారు. అయితే త్వరలో రానున్న ఈ మార్పు గురించి అందరూ సంతోషంగా ఉన్నట్లు అనిపించలేదు. ఈ రోజుల్లో చాలా మందికి సెన్సాఫ్ హ్యూమర్ కరువైందని అభిప్రాయపడ్డారు. ఉచితంగా ప్రచారం లభిస్తుంటే వారు కాదనుకుంటున్నారని, పేరు ఫన్నీగా ఉన్నందుకు ఆనందంగా ఉండాలని మరికొందరు అంటున్నారు. ఆస్ట్రియన్ నవలా రచయిత కర్ట్ పామ్ రాసిన పుస్తకం విడుదలైన తర్వాత ఈ గ్రామాన్ని వార్తల్లో నిలించింది. ఈ పుస్తకం ఆధారంగా బ్యాడ్ ఫ**ంగ్ అనే సినిమా కూడా వచ్చింది.

11వ శతాబ్దం నుంచి..
ఈ గ్రామంలో 1070 నుంచి ప్రజలు నివాసముంటున్నారు. ఫోకో అని పిలువబడే ఆరవ శతాబ్దానికి చెందిన బవేరియన్ నోబుల్ మన్ ఈ ప్రదేశాన్ని స్థాపించాడని స్థానిక కథలు తెలుపుతున్నాయి. ఆయన పేరుమీదుగా ఈ పేరు వచ్చింది. 1825లో ఫ**ంగ్ అనే పేరును మ్యాప్ లో ప్రవేశపెట్టారు. జర్మనీలోని బవేరియాలో సరిహద్దు దాటి పెట్టింగ్ అనే గ్రామం ఉంది.
Published by: Nikhil Kumar S
First published: December 1, 2020, 8:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading