Home /News /trending /

FRUSTRATED CUSTOMER TIES OLA ELECTRIC SCOOTER TO DONKEY PARADES IT AROUND MAHARASHTRA TOWN GOES VIRAL PAH

Viral video: ఓలా ఎలక్ట్రిక్ వెహికిల్ ను గాడిదకు కట్టి ఊరేగించాడు.. కారణం ఏంటంటే..

రోడ్డుపై నిరసన వెరైటీ నిరసన

రోడ్డుపై నిరసన వెరైటీ నిరసన

Maharashtra: ప్రస్తుతం దేశంలో పలు చోట్ల ఎలక్ట్రిక్ వాహనాలలో మంటలు చెలరేగుతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.  తాజాగా, ఒక కస్టమర్ ఎలక్ట్రిక్ బైక్‌ పట్ల వెరైటీగా తన నిరసన తెలిపాడు.

Angry man in Maharashtra ties Ola electric scooter to donkey: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యుడు తన వాహానాన్ని బయటకు తీయలేని పరిస్థితి నెలకొంది. దీంతో కొందరు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో వీటికి డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో.. కొన్ని చోట్ల ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. ఈ మధ్య తరచుగా... కొన్నిచోట్ల ఎలక్ట్రిక్ బైక్‌ల్లో మంటలు చెలరేగిన ఘటనలు వార్తలలో నిలుస్తున్నాయి.

అయితే తాజాగా ఎలక్ట్రిక్ వాహానం కొనుగోలు చేసిన వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. ఆ వ్యక్తి మొదట్లో బాగా పనిచేసిన.. ఆ తర్వాత మోరాయించడం స్టార్ట్ చేసింది. దీంతో మనోడికి చిర్తేత్తు కొచ్చింది. ఇక దీనికి వెరైటీగా నిరసన తెలపాలనుకున్నాడు. తన ఎలక్ట్రిక్ స్కూటర్‌కు గాడిదకు కట్టి.. ఆ కంపెనీని నమ్మవద్దని కోరుతూ వినూత్నంగా నిరసన చేపట్టాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో చోటు చేసుకుంది.






బీడ్ జిల్లాకు చెందిన సచిన్ గిట్టే అనే వ్యక్తి ఓలా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొన్నాడు. ఈ క్రమంలో.. కొద్ది రోజుల తర్వాత వాహనం మొరాయించింది. దీంతో అతడు కంపెనీ కస్టమర్ కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేశాడు. అయితే అక్కడి నుంచి సరైన రెస్పాన్స్ రాలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. దీంతో తన ఎలక్ట్రిక్ స్కూటర్‌కు గాడిదను కట్టి రోడ్డుపై నిరసన తెలియజేశాడు. ఓలా కంపెనీతో జాగ్రత్తగా ఉండండి, ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయకండి అని రాసి ఉంచిన ఫ్లెక్సీలను ప్రదర్శించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాతో వైరల్‌గా మారాయి.

ఇక సచిన్ గిట్టే.. వినియోగదారుల ఫోరమ్‌ను కూడా సంప్రదించి ఈ విషయంపై ఫిర్యాదు చేశాడు. ఓలా కంపెనీ బైక్ రిపేర్ గానీ, రిప్లేస్ గానీ చేయలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఓలా నుంచి వినియోగదారులకు ఎలాంటి సెఫ్టీ లేదని ఆరోపించాడు. దీనిపై వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరాడు. ఇక, సచిన్ గిట్టె.. 2021 సెప్టెంబర్‌లో స్కూటర్‌ను బుక్ చేసుకున్నాడు. అది 2022 మార్చి 24న డెలివరీ చేయబడింది. ప్రస్తుతం ఈ వెరైటీ నిరసన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Electric Vehicles, Maharashtra, Ola e Scooter, Ola Electric Scooter

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు