Home /News /trending /

FRUSTRATED BARBER TAKE REVENGE ON WOMAN CUSTOMER VIDEO GOES VIRAL ON SOCIAL MEDIA NK

Video: సెలూన్‌లో యువతుల చిట్‌చాట్... ఒళ్లుమండిన బార్బర్ ఏం చేశాడో తెలుసా?

సెలూన్‌లో యువతుల చిట్‌చాట్... ఒళ్లుమండిన బార్బర్ ఏం చేశాడో తెలుసా? (image credit - twitter)

సెలూన్‌లో యువతుల చిట్‌చాట్... ఒళ్లుమండిన బార్బర్ ఏం చేశాడో తెలుసా? (image credit - twitter)

Viral Video: ఎవరికైనా సహనం అనేది కొంతవరకే ఉంటుంది. పరిస్థితి కంట్రోల్ తప్పితే... అప్పటివరకూ సహనంతో ఉన్నవారు కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ హెయిర్ డ్రెస్సర్ ఏం చేశాడో చూడండి.

    Viral Video: కొన్ని వైరల్ వీడియోలూ చూడగానే నవ్వు తెప్పిస్తాయి... ఆ తర్వాత ఆలోచనలో పడేస్తాయి. ఇది అలాంటిదే. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ అందర్నీ నవ్విస్తోంది. అదే సమయంలో... అలా చెయ్యడం కరెక్టేనా అని ప్రశ్నిస్తోంది కూడా. అసలేమైందంటే... అదో హెయిర్ సెలూన్. అక్కడ చాలా మంది యువతులు, మహిళలూ... హెయిర్ డ్రెస్సింగ్ చేయించుకుంటున్నారు. వాళ్లలో ఎడమవైపున ఓ మహిళ హెయిర్ డ్రెస్సింగ్ చేయించుకుంటుంటే... ఆమెకు కుడివైపున మరో యువతి... ఒళ్లో కుక్కతో కూర్చొని ఉంది. ఆ యువతీ, ఈ మహిళ ఫ్రెండ్స్. వాళ్లిద్దరూ చిట్ చాట్ మాట్లాడుకుంటున్నారు. ఐతే... ఆ మహిళకు హెయిర్ డ్రెస్సర్... హెయిర్ వాషింగ్ చేస్తున్నాడు. ఆమెను కదలకుండా కూర్చోమని చెప్పాడు.

    ఆమె తరచూ కదులుతూనే ఉంది. ఫ్రెండుతో మాట్లాడుతూ... తలను అటూ ఇటూ కదిపేస్తోంది. దాంతో... బార్బర్ పని ముందుకు సాగట్లేదు. హెయిర్ వాషింగ్ సరిగా జరగట్లేదు. అతను హ్యాండ్ షవర్‌తో జుట్టును శుభ్రం చేద్దామని ప్రయత్నిస్తుంటే... ఆమె అస్సలు సహకరించకుండా... తన మాటల్లో మునిగిపోయింది. చిరాకొచ్చిన బార్బర్... హ్యాండ్ షవర్‌తో ఆమె ముఖంపై వాటర్ చల్లేశాడు. దాంతో... ఆమె షాకైంది. ఆమెతోపాటూ... పక్కనున్న మహిళలు కూడా షాకయ్యారు. ఆమె మాస్క్ తడిసిపోయింది.

    ఆ వీడియోను ఇక్కడ చూడండి.


    ఇది కూడా చదవండి: Video: రోడ్డుపై మెరిసే కత్తితో దాడి... యువకుడి హత్యతో హడలెత్తిన ప్రజలు... లైవ్ వీడియో

    ఈ వీడియోను ట్విట్టర్ యూజర్ జామీ నుమన్ షేర్ చేశారు. దీన్ని చూసి నెటిజన్లు నవ్వుతున్నారు. దీన్ని 60 లక్షల మందికి పైగా చూశారు. ఐతే... కామెంట్లు రకరకాలుగా వస్తున్నాయి. కొంత మంది ఆమెకు అలాగే జరగాలి, కస్టమర్లే ఎప్పుడూ కరెక్ట్ అని అనుకోకూడదు అంటుంటే... మరికొంత మంది... అతను ఇంకాసేపు సహనంతో ఉంటే పని అయిపోయేది అంటున్నారు. ఇలా ఫ్రస్ట్రేషన్ చూపిస్తే... మరోసారి ఆ సెలూన్‌కి మహిళలు వస్తారా అని అంటున్నారు. కస్టమర్లలో రకరకాల వాళ్లు ఉంటారు... వారిని అర్థం చేసుకొని మెలిగితేనే... బిజినెస్ ముందుకు సాగుతుంది... సహనంతో ఉండటం చాలా అవసరం అని ఓ యూజర్ అభిప్రాయపడ్డారు.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: VIRAL NEWS, Viral Video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు