టిక్ టాక్‌లో #FrozenHoneyChallenge బాగా ట్రెండ్ అవుతోంది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ గడ్డకట్టిన తేనెను పాప్సికల్ ఐస్ క్రీం మాదిరిగా తింటున్నారు. ఆ తరువాత ఇతరులకు ఛాలెంజ్ విసురుతున్నారు. ఎక్కడ మొదలైందో తెలియదు కానీ.. ఈ ట్రెండ్ యంగ్ జనరేషన్లో పాపులర్‌గా మారింది. అయితే ఎక్కువ మోతాదులో ఇలా తేనెను తీసుకోవడం సరికాదు అంటున్నారు నిపుణులు.
తేనెను డీప్ ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల అందులోని చక్కెర అణువులు ఒకదానికి ఒకటి అతుక్కొని పోయి చిన్న చిన్న క్రిస్టల్స్‌గా మారుతుంది. ఇదే తేనెను గట్టిగా మార్చుతుంది. ఈ ట్రెండ్‌ను ఎవరు, ఎప్పుడు ప్రారంభించారో ఎవరికీ తెలియకపోయినా ప్రతి ఒక్కరూ ఇందులో తమదైన ప్రత్యేకతను చూపుతూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. కొందరు ఇందులో కార్న్ సిరప్, మరికొందరు వేరే తరహా చక్కెరలను చేరుస్తున్నారు. అయితే ఈ ట్రెండ్ అందరికీ నచ్చింది అని చెప్పలేం.. కొందరు దీనిపై నెగెటివ్ కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇప్పుడే వస్తా.. ఈ ట్రెండ్ ఫాలో అయ్యాక నా కడుపు పాడైంది అని ఒకరు కామెంట్ చేస్తే.. నేను అనారోగ్యం పాలయ్యాను అంటూ మరొకరు కామెంట్ చేశారు.
— TikTok Malaysia Official (@tiktokmy) July 28, 2021
ఫ్రీజ్ చేసిన తేనెను తినొచ్చా?
ప్రాసెస్ చేయని తేనెను సాధారణంగా తీసుకున్నా కొందరికి పడదు. ఇలా ఫ్రీజ్ చేసి తినడం అసలే మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ తేనెలోని బ్యాక్టీరియా నరాల సంబంధిత, జీర్ణ సంబంధిత సమస్యలను కలిగిస్తాయట. అందుకే తేనెను కేవలం చాలా తక్కువ మోతాదులో గది ఉష్ణోగ్రత వద్ద మాత్రమే తీసుకోవాలట.
ఆయుర్వేదంలో కూడా తేనెను ఉపయోగిస్తారు. అయితే తేనెను ఎక్కువగా తీసుకోవడం వల్ల వాత దోషం పెరుగుతుంది అని ఆయుర్వేదం కూడా చెబుతుంది. ఇలాంటి వారికి కడుపు ఉబ్బరం, మల బద్దకం, మోకాళ్ల నొప్పులు వంటివి వస్తాయి. మరికొందరికి తేనెను ఎక్కువగా తీసుకుంటే తలనొప్పి, విరేచనాలు కూడా ఎదురవ్వచ్చు. అంతేకాదు.. ఇలా ఫ్రీజ్ అయిన తేనెను తీసుకోవడం వల్ల పళ్లు కూడా పాడవుతాయట.
డాక్టర్ల సలహా మేరకు రోజుకి ఒక టీస్పూన్ నుంచి టేబుల్ స్పూన్ వరకు మాత్రమే తేనె తీసుకోవచ్చు. ఇలా ఫ్రీజ్ చేసిన తేనెను తీసుకుంటే అది టేబుల్ స్పూన్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ సంబంధిత సమస్యలకు కారణమవుతుంది. అంతే కాదు.. రక్తపోటు, డయాబెటిస్, కొలెస్ట్రాల్, ఊబకాయం, ఇన్సులిన్ సెన్సిటివిటీ వంటివన్నీ పెంచుతుందట. ప్రాసెస్ చేయడం వల్ల అది మరింత హానిని కలిగిస్తుంది. అందుకే ఏ ట్రెండ్‌ను అయినా గుడ్డిగా పాటించకుండా అది మన ఆరోగ్యానికి మంచిదా? లేదా? అని తెలుసుకొని పాటించడం మంచిది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.