news18
Updated: November 16, 2020, 10:23 AM IST
image credits twitter
- News18
- Last Updated:
November 16, 2020, 10:23 AM IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కాబోయే అధ్యక్షుడు జో బిడెన్, కెనడా ప్రధాని ట్రూడో... యూఎస్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా.. వీళ్లంతా భారతీయులకు వివిధ సందర్భాలలో శుభాకాంక్షలు చెప్పిన విషయం తెలిసిందే. గతేడాది వైట్ హౌస్ లోనూ దీపావళి వేడుకలు జరిగాయి. కానీ ఈ ఏడాది ట్రంప్ ఓడిపోవడంతో ఆయన వాటిపై పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ అమెరికాకు చెందిన ఒక కమెడీయన్ మాత్రం.. పైన చెప్పినవారందరి తరఫున భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు. అదేంటి..? ఇంతకీ ఎవరా కమెడీయన్.. వారందని తరఫున అతనెందుకు శుభాకాంక్షలు తెలిపాడు..?
దీపావళి సందర్భంగా చాలా మంది నాయకులు.. ట్విట్టర్ వేదికగా భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. యూఎస్ కొత్త అధ్యక్షుడు జో బిడెన్, కమలా హారిస్ కూడా విషెస్ చెప్పారు. కాగా వీళ్లు మాట్లాడిన మాటలను న్యూయార్క్ కు చెందిన ఒక మిమిక్రీ కళాకారుడు అచ్చు గుద్దినట్టు దించేశాడు. అసలు కండ్లు మూసుకుని వింటే.. స్వయంగా ఆ వ్యక్తులే వచ్చిచెప్పారేమో అన్నట్టుగా అనుకరణ చేశాడు. అతడి పేరు ఫెరాజ్.
దీపావళి సందర్భంగా ఏదైనా కొత్తగా చేయాలనుకున్న ఫెరాజ్.. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కాబోయే అధ్యక్షుడు బిడెన్.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, కెనడా ప్రధాని ట్రూడో, సెనేటర్ బెర్నీ సాండర్స్ ల వాయిస్ లను మిమిక్రీ చేశాడు. వారందరినీ అనుకరిస్తూ.. పలు సందర్భాల్లో వాళ్లు దీపావళి గురించి చెప్పిన మాటలను మిమిక్రీ చేశాడు. కేవలం మాటలే కాదు.. హావభావాలు కూడా అచ్చు అలాగే చేశాడు.వీరందరి వాయిస్ ఇమిటేట్ చేసి వీడియో చేసిన ఫెరాజ్.. ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ట్విట్టర్ లో పెట్టిన కొద్ది సేపటికే ఇది వైరల్ అయింది. దీనిని చూసిన నెటిజన్లు.. అసలు కండ్లు మూసుకుంటే స్వయంగా నిజమైన వ్యక్తులు చెప్పినట్టుగానే ఉందంటూ ఫెరాజ్ ను అభినందిస్తున్నారు. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్, ట్రూడో వాయిస్ అయితే అచ్చు గుద్దినట్టు కుదిరిందని మెచ్చుకుంటున్నారు.
Published by:
Srinivas Munigala
First published:
November 16, 2020, 10:23 AM IST