హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral : శ్వేతా సీక్రెట్ల నుంచి నగ్న ఫోజుల వరకు..వైరల్ అయిన జూమ్ వీడియో కాల్స్ ఇవే..

Viral : శ్వేతా సీక్రెట్ల నుంచి నగ్న ఫోజుల వరకు..వైరల్ అయిన జూమ్ వీడియో కాల్స్ ఇవే..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Viral : వీడియో కాల్ నడుస్తున్నప్పుడు వ్యక్తిగత విషయాలు పంచుకోవడం, నగ్నంగా కనిపించడం లాంటి సంఘటనలు జరిగాయి. కెమెరా ఆఫ్ చేశారనుకొని లేదా మ్యూట్ లో ఉందనుకొని ఇబ్బందికర పరిస్థితుల్లో ఇరుక్కొని చాలా మంది అడ్డంగా దొరికారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇంకా చదవండి ...

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. శుభ్రతకు ప్రాధాన్యతనివ్వడం, మాస్కులు, శానిటైజర్ల వాడకం ఇలా ఒకటేమిటి ఎన్నో కీలక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా వర్కింగ్ కల్చర్ పూర్తిగా మారిపోయింది. చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం ఆప్షన్ ఇవ్వడమే కాకుండా మీటింగ్‌లను వీడియో కాల్స్ రూపంలో నిర్వహిస్తున్నాయి. ఇందుకోసం ఎక్కువగా జూమ్ వీడియో యాప్ ను ఉపయోగిస్తున్నాయి. కొన్నిసార్లు ఈ జూమ్ వీడియో సమావేశాలు బెడిసికొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీడియో కాల్ నడుస్తున్నప్పుడు వ్యక్తిగత విషయాలు పంచుకోవడం, నగ్నంగా కనిపించడం లాంటి సంఘటనలు జరిగాయి. కెమెరా ఆఫ్ చేశారనుకొని లేదా మ్యూట్ లో ఉందనుకొని ఇబ్బందికర పరిస్థితుల్లో ఇరుక్కొని చాలా మంది అడ్డంగా దొరికారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్లకు నవ్వులు తెప్పించాయి. ఇలా బెడిసికొట్టిన జూమ్ కాల్స్ లో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం.

కెమెరా ముందు చొక్కా లేకుండా..

కెమెరా ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే నవ్వులపాలు కావాల్సి వస్తుంది. బ్రెజిల్ అధ్యక్షుడు జేర్ బోల్సోనారోతో జూమ్ కాల్ లో సమావేశం జరుగుతున్న సమయంలో ఓ వ్యాపార వేత్త అర్ధనగ్నంగా కనిపించిన సంఘటన వైరల్ అయింది. ఇది కోవిడ్ లాక్ డౌన్ ప్రారంభమైన కొత్తలో జరిగింది. వీడియో కాల్ మధ్యలో స్నానం చేయడానికి వెళ్లిన అతడు కెమెరాను ఆఫ్ చేయడం మర్చిపోయాడు. ఇంకేముంది సమావేశం మధ్యలో ఉండగా చొక్కా లేకుండా తన దివ్య స్వరూపాన్ని అందరూ చూసేశారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేసింది.

ముద్దుపెట్టడానికి ప్రయత్నించిన ప్రొఫెసర్ భార్య..

వీడియో కాల్ రన్నింగ్ లో ఉండగా.. ఓ మహిళ పాఠాలు చెబుతున్న తన భర్తకు ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించింది. ఈ వీడియో కూడా ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. జూమ్ వీడియో కాల్ లో సీరియస్ గా ఒక ప్రొఫెసర్ మాట్లాడుతుండగా.. అకస్మాత్తుగా ఆ గదిలోకి అతడి భార్య వచ్చేసి ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించింది. వెంటనే అతడు తేరుకొని 'కెమెరా ఆన్ లో ఉంది.. ఎంటి ఇలా ప్రవర్తిస్తున్నావ్' అంటూ కోపగించుకుంటాడు. అప్పుడు కూడా ఆమె చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది.

శ్వేత రహస్యాలు..

గతేడాది విపరీతంగా వైరల్ అయిన వీడియోల్లో శ్వేత సీక్రెట్స్ వీడియో కూడా ఉంటుంది. 2020లో జూమ్ ఫెయిల్యూర్స్ లో అత్యంత ముఖ్యమైన వీడియో ఇది. వీడియో క్లిప్ లో శ్వేత అనే అమ్మాయి సెక్స్ అడిక్ట్ అయిన తన స్నేహితుడి గురించి వ్యక్తిగత రహస్యాలను బహిర్గతపరుస్తూ మాట్లాడింది. ఆ సమయంలో ఆమె తన మైక్రోఫోన్ ను మ్యూట్ చేయకపోవడం గమనార్హం. దీంతో సోషల్ మీడియాలో ఇది విపరీతంగా వైరల్ అయింది. అసభ్యకరమైన పదాలను ఉపయోగిస్తూ మాట్లాడుతూ అందరి నోళ్లలో మెదిలింది.

డ్రైవ్ చేస్తూ వర్చువల్ మీటింగ్..

వీడియో సమావేశాలు జరుగుతున్నప్పుడు ఎలాంటి అంతరాయం ఉండని గదిలో కూర్చొని ఉండాలి. కానీ అమెరికాలోని ఓహియో స్టేట్ సెనేటర్ మాత్రం.. అధికారులతో వర్చువల్ సమావేశం జరుగుతున్నప్పుడు డ్రైవింగ్ చేస్తూ దొరికిపోయాడు. అంతేకాకుండా ఇంట్లోనే ఉన్నట్లు ఫిల్టర్లను ఉపయోగించేందుకు ప్రయత్నించాడు. అయితే సీట్ బెల్టు పెట్టుకోవాలని అలర్టు రావడంతో దొరికిపోయాడు. దీంతో సెనేటర్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇలాంటి సమావేశాలు లీగల్ ఇష్యూలను తీసుకొచ్చాయి. ఇలాంటి వాటి వల్ల పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. ప్రాణాంతకం కూడా కావచ్చు.

అన్ మ్యూట్ చేయడం మర్చిపోయాడు..

బ్రిటీష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తో వర్చువల్ ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు మరో ఘటన జరిగింది. రాబర్ట్ పెస్టన్ అనే సీనియర్ జర్నలిస్ట్.. ప్రశ్న అడిగే ముందు అన్ మ్యూట్ చేయడం మర్చిపోయాడు. దీంతో అన్ మ్యూట్ చేయాలని ప్రధానే అతడికి సిగ్నల్ ఇచ్చారు. రాబర్ట్ అన్ మ్యూట్ చేసేలోపే ప్రధాని తర్వాతి ప్రశ్నకు వెళ్లిపోయారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Trending news, VIRAL NEWS

ఉత్తమ కథలు