• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • FROM PIZZA HUT EMPLOYEE TO MISS INDIA RUNNER UP THIS IS THE JOURNEY OF MANYA SINGH MS GH

Manya Singh: ఒకప్పుడు ఆటో డ్రైవర్ కూతురు.. పిజ్జా హట్ లో ఉద్యోగి.. ఇప్పుడు మిస్ ఇండియా రన్నరప్..

Manya Singh: ఒకప్పుడు ఆటో డ్రైవర్ కూతురు.. పిజ్జా హట్ లో ఉద్యోగి.. ఇప్పుడు మిస్ ఇండియా రన్నరప్..

కుటుంబసభ్యులతో మాన్యా సింగ్ (ఫైల్)

Miss India Runner Up Manya Singh: ‘నేను కన్న కలలను నిజం చేసుకోవడానికి అహర్నిశలు శ్రమించాను. నా రక్తం, చెమట, కన్నీటిని ధారబోశాను. మా నాన్న ఆటో డ్రైవర్. ఆయన చాలీ చాలని సంపాదనతో మా కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. నా చదువు కొనసాగించాలన్నా డబ్బులు లేని పరిస్థితి..’ అంటూ భావేద్వేగానికి లోనైంది మాన్యా.

  • News18
  • Last Updated:
  • Share this:
అందాల పోటీలు అనగానే అది డబ్బున్న వారి వ్యవహారం అనుకుంటారు అంతా.. అందాల పోటీల్లో నిలవాలంటే అందం ఒక్కటే ఉంటే సరిపోదు, అందమైన శరీరాకృతి కోసం మేకప్, దుస్తుల కోసం ఎంతో ఖర్చు చేయాలి. ఇదంతా చాలా ఖర్చుతో కూడుకున్న విషయమని భావిస్తారు చాలా మంది. అందుకే పోటీల్లో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నా ఆర్థిక పరిస్థితులు సహకరించవని తమ ఆశను మనస్సులోనే చంపుకుంటారు.

అయితే, ఉత్తరప్రదేశ్ కి చెందిన మాన్యాసింగ్ మాత్రం అలా అందరిలా ఆలోచించలేదు. తన పేదరికం తన లక్ష్యానికి అడ్డు కారాదని, ఎలాగైనా సరే తాను మిస్ ఇండియా కిరీటం దక్కించుకోవాలని నిర్ణయించుకుంది. ఎట్టకేలకు తాను అనుకున్నది సాధించింది. తాజాగా నిర్వహించిన మిస్ ఇండియా పోటీల్లో రన్నరప్ గా నిలిచింది.

ఫీజు కోసం అమ్మ నగలు అమ్మేసింది...

అయితే మాన్య విజయం సాధారణంగా రాలేదు. తాను ఈ విజయం సాధించేందుకు ఎన్నో కష్టాలు పడింది. తన కష్టాలను వివరిస్తూ..“నా పేదరికం కారణంగా నేను ఎన్నో నిద్ర లేని, తిండి లేని రాత్రులు గడిపాను. కొన్ని కిలోమీటర్ల దూరం నడిచి స్కూల్ కి వెళ్లి చదువుకునేదాన్ని. నేను కన్న కలలను నిజం చేసుకోవడానికి అహర్నిశలు శ్రమించాను. నా రక్తం, చెమట, కన్నీటిని ధారబోశాను. మా నాన్న ఆటో డ్రైవర్. ఆయన చాలీ చాలని సంపాదనతో మా కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. నా చదువు కొనసాగించాలన్నా డబ్బులు లేని పరిస్థితి. నా పరీక్ష ఫీజు కట్టేందుకు అమ్మకు ఉన్న కొద్దిపాటి నగలనూ అమ్ముకోవాల్సి వచ్చింది. నా కోసం నా తల్లిదండ్రులు పడుతున్న కష్టం చూడలేక చిన్న వయసులో నేను కూడా పనిచేయాల్సి వచ్చింది. ఎంతటి కష్టాలు ఉన్పప్పటికీ మిస్ ఇండియా పోటీల్లో నెగ్గాలనే నా కలను సాకారం చేసుకోవాలనుకున్నా” అని చెప్పింది.


View this post on Instagram


A post shared by Manya Singh (@manyasingh993)


ఇంటి నుంచి పారిపోయా...

కాగా, మాన్య సింగ్ తన కల నెరవేర్చుకోవడానికి 14 ఏళ్ళ వయసులోనే రైలెక్కి ముంబైకి పారిపోయింది. మాన్యా తన గతాన్ని గుర్తు చేసుకుంటూ “ముంబైకి వెళ్లగానే నేను చూసిన మొదటి ప్రదేశం పిజ్జా హట్. ఏదో ఒకవిధంగా అక్కడ పార్ట్ టైమ్ ఉద్యోగం, తాత్కాలిక వసతి పొందగలిగాను. రెండు రోజుల తరువాత, నా తల్లిదండ్రులు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. వారు నా కష్టాన్ని చూసి భావోద్వేగానికి లోనయ్యారు. నేను నా లక్ష్యాన్ని చేరుకుంటానని వారికి భరోసా ఇచ్చాను. దాంతో వాళ్లు కూడా నాతో పాటే ముంబైలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. నా లక్ష్యం చేరుకోవడానికి సంపూర్ణ మద్దతుగా నిలిచి, నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించారు. కుటుంబ పోషణకు నా తండ్రి ఆటో నడిపేవాడు. ఆయనకి వచ్చే కొద్ది సంపాదనతో నన్ను అక్కడే మంచి పాఠశాలకు పంపారు. నేను కూడా చదువు కొనసాగిస్తూనే పార్ట్‌టైమ్ పనిచేశాను. తద్వారా నెలకు రూ .15,000 సంపాదించాను. నా కాలేజీ రోజుల్లో పదికి పైగా అందాల పోటీ ఆడిషన్స్ లో పాల్గొన్నాను. ఆ తర్వాత VLCC ఫెమినా మిస్ ఇండియా 2020 పోటీలకి ఎంపికయ్యా. ఈ పోటీల్లో ఫస్ట్- రన్నర్ అప్ గా నిలిచాను. ఎట్టకేలకు నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాను. నా తల్లిదండ్రులు నాకోసం పడ్డ కష్టం, వారు నాకు అందించిన సహకారం వల్లే ఇవాళ నేను ఈ గొప్ప విజయాన్ని సాధించగలిగాను” అని వివరించింది. ఈ పోటీల్లో మన హైదరాబాదీ అమ్మాయి మానసా వారణాసి విన్నర్ గా నిలిచి మిస్ ఇండియా కిరీటం దక్కించుకున్న విషయం తెలిసిందే.
Published by:Srinivas Munigala
First published: