Viral Video:బద్ధ శత్రువులు ఒక్కటయ్యారు.. పాముపై సవారీ చేసిన కప్ప..

ఈ వీడియోలో నున్నగా ఉన్న ఓ పాము మీద కప్ప కూర్చొని సవారీ చేస్తుంది. పాము కదిలేసమయంలో కప్ప జారి కిందపడడం.. తిరిగి కప్ప మళ్లీ పాముపైకి ఎక్కడం.. చూడొచ్చు.

news18-telugu
Updated: June 5, 2020, 4:00 PM IST
Viral Video:బద్ధ శత్రువులు ఒక్కటయ్యారు.. పాముపై సవారీ చేసిన కప్ప..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బద్ద శత్రువులు ఒక్కటయ్యారు. ఎవరా బద్ధ శత్రువులు.. ఇంతకీ ఏంటా కథ అనుకుంటారా. అయితే ఇది చదవాల్సిందే. పాము.. కప్ప.. ఈ రెండు బద్ధ శత్రువలన్న సంగతి తెలిసిందే. అలాంటిది ఈ రెండు ఒక్కటయ్యాయి. పాము, కప్ప కలిసి సవారీ చేస్తూ సందడి చేశాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత్ నందా తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. అయితే ఈ వీడియోలో నున్నగా ఉన్న ఓ పాము మీద కప్ప కూర్చొని సవారీ చేస్తుంది. పాము కదిలేసమయంలో కప్ప జారి కిందపడడం.. తిరిగి కప్ప మళ్లీ పాముపైకి ఎక్కడం.. చూడొచ్చు. వాస్తవానికి కప్ప కన్పించేదే ఆలస్యం.. పాములు గుటుక్కున మింగేస్తుటాయి. కానీ ఇది వాస్తవానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

Published by: Narsimha Badhini
First published: June 5, 2020, 4:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading