Home /News /trending /

FRIENDS USE COOL TRICK TO HELP GET BRIDE AND GROOM GET DRUNK IN SECRET GOES VIRAL PAH

Viral video:  ఇదేక్కడి దోస్తాన్ రా అయ్యా.. ఏకంగా స్టేజీపైన కొత్త జంటతో ఆ పని కానిచ్చారు..

కొత్త జంటకు డ్రింక్ తాగిస్తున్న స్నేహితుడు

కొత్త జంటకు డ్రింక్ తాగిస్తున్న స్నేహితుడు

Wedding Video:పెళ్లిలో వేడుకలో వరుడు, వధువు స్నేహితులు కొత్త జంటను సరదాగా ఆటపట్టిస్తుంటారు. కొత్త జంట పెళ్లి తంతు అయ్యేవరకు ఎలాంటి పదార్థాలు తినకూడదని కొందరు భావిస్తారు. కొందరు కూల్ డ్రింక్  తీసుకుంటారు. ఈ క్రమంలో  కొత్త జంట స్నేహితులు చేసిన చిలిపి  పనితో ఆ పెళ్లి కాస్త వైరల్ అయ్యింది.

ఇంకా చదవండి ...
Bride and Groom Get Drunk in Secret: పెళ్లి వేడుకకు సంబంధించి ఎన్ని వీడియోలు వైరల్ అయినా.. వీటికున్న క్రేజ్ ఏమాత్రం తగ్గటం లేదు. నెటిజన్లు ఇలాంటి ఫన్నీ వీడియోలు, చిలిపి పనుల వీడియోలను చూడటానికి తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. వీటిని చూసి ఓ రేంజ్ లో నవ్వుకుంటున్నారు. పెళ్లిని ప్రతి ఒక్కరు గ్రాండ్ గా చేసుకుంటారు. దీనికి బంధువులు, స్నేహితులు, వివిధ కార్యక్రమాలు , డీజేలు నానా హాంగామా ఉంటునే ఉంటాయి.

ఇక పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వేల సంఖ్యలో వైరల్ అవుతున్నాయి. పెళ్లిలో జరిగిన సరదా సన్నివేశాల వలన ఇవి వైరల్ అవుతున్నాయి. కొన్ని చోట్ల.. వీటిని పబ్లిసిటీ కోసమో.. మరేంటో కానీ పెళ్లిలో ఏదో ఒక ఫన్ క్రియేట్ చేసి మరీ వైరల్ చేస్తున్నారు. పెళ్ళిలో వధువు.. వేదికపై బుల్లెట్ బండీమీద, పల్లకిలో, క్రేన్ సహాయంతో వెరైటీగా ఎంట్రీ ఇచ్చిన అనేక పెళ్లి వీడియోలు వైరల్ గా మారాయి. ఇక.. పెళ్లి మండపం మీద వరుడు.. వధువుకు ఇచ్చిన సర్ ప్రైజ్ లు, చేసిన అనేక చిలిపి పనులతో అవి వైరల్ అయ్యాయి.






కొన్ని చోట్ల వరమాల వేసుకునేటప్పులు.. కొత్త జంట ఒకరిపై మరొకరు చిరుకోపాలు చూపించుకున్న సంఘటనలు వైరల్ అయ్యాయి. ఇక మరికొన్ని చోట్ల వేదికమీద వరుడు.. వధువుని కొట్టిన సంఘటనలు, మాజీ ప్రియుడు పెళ్లి మండపానికి ఎంట్రీ ఇవ్వడం ఎన్నో వీడియోలు మనం చూశాం. ప్రస్తుతం ఈ కోవకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారింది.

పెళ్లిలో కొత్త జంటకు బాగా ఆకలేసినట్టుంది. వారి మోహలు వాడిపోయాయి. ఈ క్రమంలో, వారికి ఏదైన తాగడానికి ఇవ్వాలని వరుడి స్నేహితులు ప్లాన్ వేశారు. కానీ వరుడికి మద్యం ఇష్టమో మరేంటో కానీ.. ఒక ఫ్రూటీ బాటిల్ తీసుకుని దానిలో సిరంజితో మద్యాన్ని నింపారు. ఆ ఫ్రూటి బాటిల్ లో సగం వారు తాగేసి.. మిగతా దాంట్లో వైన్ ను కలిపారు. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ అయ్యింది. వరుడి చేత ఫ్రూటీ తాగించారు. మనోడికి కిక్కు ఎక్కింది. ఆతర్వాత.. పెళ్లికూతురితో కూడా దాన్ని తాగించారు. ప్రస్తుతం ఈ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. నిజంగా ఇలాంటి స్నేహితులున్నందుకు మీరు అదృష్టవంతులే అంటూ ఫన్నీగా కామెంట్ లు పెడుతున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Viral Video, Wedding

తదుపరి వార్తలు