హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video: తగలబడుతున్న భవనంలో చిక్కుకున్న వృద్ధుడు.. సాహసం చేసి రక్షించిన ముగ్గురు మిత్రులు

Viral Video: తగలబడుతున్న భవనంలో చిక్కుకున్న వృద్ధుడు.. సాహసం చేసి రక్షించిన ముగ్గురు మిత్రులు

మంటల్లో చిక్కుకున్న వృద్దుడిని రక్షించిన ముగ్గురు స్నేహితులు (PC: Video Grab/Twitter)

మంటల్లో చిక్కుకున్న వృద్దుడిని రక్షించిన ముగ్గురు స్నేహితులు (PC: Video Grab/Twitter)

మంటల్లో చిక్కుకున్న శారీరక వికలాంగుడైన వృద్ధుడిని కాపాడటానికి విశ్వ ప్రయత్నం చేశారు రష్యాకు చెందిన ముగ్గురు వ్యక్తులు. వారు చేసిన సాహసం అందరినీ అబ్బురపరుస్తోంది. వారి సాహసాన్ని ఎవరో వీడియో తీయగా అది ఇప్పుడు వైరల్‌ అయింది.

పొరుగువారి ఇల్లు తగలబడుతుంటే (Fire Accident) మనకెందుకులే అనుకునే సమాజం మనది. ఎదుటివారు ఎలా పోయినా ఫర్వాలేదు కానీ.. మనం మాత్రం బాగుండాలని ఎందరో అనుకుంటారు. అయితే అందరూ ఒకేలా ఉండరని నిరూపించింది తాజా ఘటన. మంటల్లో చిక్కుకున్న శారీరక వికలాంగుడైన (Physically Challenged) వృద్ధుడిని కాపాడటానికి విశ్వ ప్రయత్నం చేశారు రష్యాకు (Russia) చెందిన ముగ్గురు వ్యక్తులు. వారు చేసిన సాహసం అందరినీ అబ్బురపరుస్తోంది. వారి సాహసాన్ని ఎవరో వీడియో తీయగా అది ఇప్పుడు వైరల్‌ అయింది.

వివరాల్లోకి వెళ్తే.. ప్రాన్స్‌లోని మోంటెరియో- ఫాల్ట్-యోనో నగరంలోని ఒక పార్కులో (Park) కూర్చున్నారు డోంబెవ్‌ డ్యామ్‌బులాట్‌, ఔలోవ్‌బేవ్‌ ఆస్లా, అహ్మెదోవ్‌ ముహసిన్‌జోన్‌ అనే ముగ్గురు రష్యన్ యువకులు. ఇదే సమయంలో పార్కుకు ఎదురుగా అగ్నికి ఆహుతవుతున్న ఓ భవనం (Building)  వీరికి కనిపించింది. అందులో మూడో అంతస్తు బాల్కనీలో ఓ వృద్ధుడు సాయం కోసం అరుస్తున్నాడు.

అది చూసిన ముగ్గురు రష్యన్ స్నేహితులు వెంటనే స్పందించారు. ఎంతో శిక్షణ పొందిన ఫైర్‌ బ్రిగేడ్‌ తరహాలో చకచకా ఆ భవనంలోకి చేరుకున్నారు. అనంతరం ఆ వృద్ధుడిని ఎంతో ఒడుపుగా బాల్కనీ నుంచి బయటకు తీసుకువచ్చారు. పక్కనున్న అపార్ట్‌మెంట్‌ ద్వారా అతడిని సురక్షితంగా కిందకు తీసుకువచ్చారు.

సాధారణంగా అగ్నిమాపక దళంలో పనిచేసే వ్యక్తులు తమ ప్రాణాలు తెగించి మంటల్లోకి దూకి ప్రజలను రక్షిస్తుంటారు. కానీ ఈ ముగ్గురు యువకులకు ఎటువంటి శిక్షణ లేదు. ఎటువంటి భద్రతా పరికరాలు ఉపయోగించకుండా వృద్ధుడిని రక్షించిన తీరుకు ప్రపంచం హ్యాట్సాప్‌ చెబుతోంది. అయితే ఈ సంఘటన ఇప్పుడు జరిగింది కాదు. ఏప్రిల్‌ 2020లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ అయి వైరల్‌ అవుతోంది.వాస్తవానికి మంటలు లేని ప్రాంతంలోకి రావాలని ఆ వృద్ధుడికి వీరు చెప్పారు. కానీ మంటల కారణంగా నిశ్చేష్టుడైన బాధితుడు ఊపిరి తీసుకునేందుకు కూడా ఇబ్బంది పడ్డాడు. దీంతో డోంబెవ్‌ వేగంగా అతన్ని చేరుకొని ఎంతో జాగ్రత్తగా బయటకు తీసుకువచ్చాడు. ముగ్గురూ కలిసి పక్కన అపార్టుమెంట్‌ నుంచి సురక్షితంగా కిందకు తీసుకువచ్చాడు.

ఆ యువకుల సాహసానికి అక్కడి వారంతా కృతజ్ఞతలు తెలిపారు. సాహసాలు చేయడం, ప్రజలను రక్షించడం తనకు కొత్తేమి కాదని చెప్పాడు అస్లా. ఆ వృద్ధుడి పరిస్థితి చూశాక తనకు భయపడే సమయం కూడా లేదని వివరించారు. డోంబెవ్‌ డ్యామ్‌బులాట్‌, ఔలోవ్‌బేవ్‌ ఆస్లా ఇద్దరు కూడా ఫ్రాన్స్‌లో అనేక సంవత్సరాలుగా జీవిస్తున్నారు. కానీ వారికి ఇంకా పౌరసత్వం లభించలేదట.

Published by:John Kora
First published:

Tags: Fire Accident, Viral Video

ఉత్తమ కథలు