Watch Video: వీళ్ల ప్రాంక్ పాడుగానూ.. నవ దంపతులకి ఇలాంటి గిఫ్ట్ ఇస్తారా?.. మరీ కామెడీ అయిపోయారు..

ప్రతీకాత్మక చిత్రం

గత నెలలో పెళ్లి కొడుకు స్నేహితులు పెళ్లి కూతురికి పాల బాటిల్ గిఫ్ట్ ఇవ్వడం, పెళ్లి కూతురు చెల్లెళ్లు పెళ్లి కొడుకుతో కాంట్రాక్ట్ రాయించుకోవడం వంటి వీడియోలెన్నో వైరల్‌ అయ్యాయి. వీటితో పాటు లెహెంగాతో పుషప్స్ చేస్తున్న వధువు, కబడ్డీ ఆడుతున్న వధూవరులు కూడా ఫేమస్ అయ్యారు.

  • Share this:
పెళ్లిలో దంపతుల స్నేహితులు, అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ములు అందరూ కలిసి వారిని ఆటపట్టిస్తుంటారు. అవన్నీ ఉంటేనే పెళ్లి వేడుక ఫన్‌గా సాగుతుంది. కొత్త జంట తమ పెళ్లిని ఎప్పటికీ మర్చిపోకుండా చేస్తుంటాయి ఇలాంటి ఆనందకరమైన సంఘటనలు. తాజాగా పెళ్లి వేడుకలో వరుడి స్నేహితులు చేసిన పని ఒకటి వైరల్‌గా మారుతోంది. హౌజ్ ఆఫ్ బ్రైడ్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ షేర్ చేసిన ఈ వీడియో ఎంతో ఫన్నీగా ఉంది. పెళ్లి కొడుకు స్నేహితులందరూ వరుసగా వేదికపైకి వస్తూ వధూవరులకు రూపాయి నాణేలు బహుమతిగా ఇచ్చారు. అనంతరం వారి కాళ్లు మొక్కి కిందకు వెళ్లారు. దీంతో మొదట షాక్ అయిన వధువు.. వాళ్లు ఏం చేస్తున్నారో అర్థం కాక అలాగే చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత వారు ప్రాంక్ చేస్తున్నారని అర్థమయ్యాక ముసిముసి నవ్వులు నవ్వుతూ వారి చర్యలు చూస్తూ ఉండిపోయింది.

ఈ లైన్ ఎంతకీ ఆగకపోవడంతో ఈ దంపతులు ఇద్దరూ ఆశ్చర్యపోతూ కనిపించారు. ఈ వీడియోకి బ్యాక్ గ్రౌండ్‌లో ‘హమ్ పాగల్ నహీ హై’.. అంటూ హిమేష్ రేష్మియా పాడిన పాటను చేర్చడం విశేషం. ఈ వీడియోకు చక్కటి వ్యూస్ మంచి లైక్స్ కూడా వచ్చాయి. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే వివరాలను ఇన్‌స్టా పేజీ వెల్లడించలేదు. కేవలం "మీ స్నేహితులను ట్యాగ్ చేసి వారి పెళ్లిలోనూ ఇలాగే చేస్తామని చెప్పండి" అని మాత్రమే క్యాప్షన్ రాయడం విశేషం. వధూవరులు మోడ్రన్ దుస్తుల్లో కనిపిస్తున్నారు కాబట్టి ఇది రిసెప్షన్ కి సంబంధించిన వీడియోగా అనిపిస్తోంది.




అయితే చాలామంది ఈ చర్యను చూసి ఆశ్చర్యపోతూ కామెంట్లు చేశారు. ఏంటీ పిచ్చిపనులు.. పిచ్చి గానీ పట్టిందా ఏంటి? అంటూ కామెంట్లు చేశారు. చాలామంది నవ్వే ఎమోజీలు, ఫైర్ ఎమోజీలు పోస్ట్ చేశారు. కొందరు యూజర్లు తమ స్నేహితులను ట్యాగ్ చేసి.. వారి పెళ్లిలో కూడా అలాగే చేస్తామంటూ స్వీట్ వార్నింగ్స్ కూడా ఇచ్చారు. గత నెలలో పెళ్లి కొడుకు స్నేహితులు పెళ్లి కూతురికి పాల బాటిల్ గిఫ్ట్ ఇవ్వడం, పెళ్లి కూతురు చెల్లెళ్లు పెళ్లి కొడుకుతో కాంట్రాక్ట్ రాయించుకోవడం వంటి వీడియోలెన్నో వైరల్‌ అయ్యాయి. వీటితో పాటు లెహెంగాతో పుషప్స్ చేస్తున్న వధువు, కబడ్డీ ఆడుతున్న వధూవరులు కూడా ఫేమస్ అయ్యారు.
Published by:Ashok Kumar Bonepalli
First published: