హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

New Law: పిల్లల ఫోటోల్ని పేరెంట్స్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదు.. కొత్త చట్టం!

New Law: పిల్లల ఫోటోల్ని పేరెంట్స్‌ సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదు.. కొత్త చట్టం!

 (Credits: Reuters)

(Credits: Reuters)

New Law: పిల్లల అనుమతి లేకుండా తల్లిదండ్రులు సైతం వారి ఫోటోలను ఇంటర్నెట్‌లో పోస్ట్ చేయకుండా కొత్త చట్టాన్ని ఫ్రాన్స్ ప్రభుత్వం ఆమోదించింది. ఆన్‌లైన్‌లో పిల్లల ప్రైవసీని కాపాడటమే ఈ చట్టం లక్ష్యమని ఆ దేశ ఎంపీలు చెబుతున్నారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఈ రోజుల్లో సోషల్ మీడియా (Social Media) వినియోగం ఎప్పటికప్పుడు పెరుగుతోంది. చిన్నా, పెద్దా అనే తేడాలు లేకుండా అందరూ ఫోటోల (Photos)ను ఇలాంటి పోర్టల్స్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ఫోటోలు, వీడియోలను షేర్ చేయడం మన దగ్గర సాధారణ విషయం. అయితే ఇది పిల్లల ప్రైవసీకి భంగం కలిగిస్తుంది అంటున్నారు ఫ్రాన్స్ చట్టసభల ప్రతినిధులు. అందుకే పిల్లల అనుమతి లేకుండా తల్లిదండ్రులు సైతం వారి ఫోటోలను ఇంటర్నెట్‌లో పోస్ట్ చేయకుండా కొత్త చట్టాన్ని ఫ్రాన్స్ ప్రభుత్వం ఆమోదించింది. ఆన్‌లైన్‌లో పిల్లల ప్రైవసీని కాపాడటమే ఈ చట్టం లక్ష్యమని ఆ దేశ ఎంపీలు చెబుతున్నారు. కొత్త చట్టం ఆవశ్యకతను, ప్రయోజనాలను కొందరు నిపుణులు ప్రశంసించగా, మరికొందరు మాత్రం కొత్త చట్టం వల్ల ప్రయోజనం లేదని వాదనలు వినిపించారు.

ఈ చట్టానికి ఫ్రెంచ్ జాతీయ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఈ ప్రపోజల్‌ను ఎంపీ బ్రూనో స్టూడర్ ప్రెజెంట్‌ చేశారు. 13 ఏళ్ల వయసున్న పిల్లలకు సంబంధించిన ఫోటోలు యావరేజ్‌గా 1,300 ఇంటర్నెట్‌లో సర్క్యులేట్‌ అవుతున్నాయని స్టూడర్ చెప్పారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం, పిల్లల ఇమేజ్‌పై వారి తల్లిదండ్రులకు సంపూర్ణ హక్కు లేదని యువతకు బోధించడం ఈ చట్టం లక్ష్యమని పేర్కొన్నారు. 2022 సెప్టెంబర్‌లో ఏర్పాటు చేసిన పిల్లల హక్కుల ప్రతినిధి బృందంలో స్ట్రూడర్ సభ్యుడు.

ఇది కూడా చదవండి : 10 రోజులే గడువు.. వెంటనే పాన్, ఆధార్ లింక్ చేసుకోండిలా..

* ఫోటోలు దుర్వినియోగం

ఇంటర్నెట్‌లో అప్‌లోడ్‌ చేసే పిల్లల ఫోటోలను ఛైల్డ్‌ పోర్నోగ్రఫీ ఫోరమ్‌లలో దుర్వినియోగం చేయవచ్చని, లేదా పాఠశాలల్లో తోటివారు ఏడిపించేందుకు కారణం అవ్వొచ్చని స్టూడర్‌ పేర్కొన్నారు. ఛైల్డ్‌ పోర్నోగ్రఫీ ఫోరమ్‌లలో ఎక్స్ఛేంజ్‌ అయిన దాదాపు 50 శాతం ఫోటోలను మొదట వారి తల్లిదండ్రులే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని చెప్పారు. బిల్లులోని మొదటి రెండు ఆర్టికల్‌లు తల్లిదండ్రుల అధికారం, బాధ్యతలను రక్షించడం లక్ష్యంగా రూపొందించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ఇమేజ్‌ రైట్స్‌ని దుర్వినియోగం చేసే విపరీతమైన సందర్భాల్లో ఫ్యామిలీ జడ్జ్‌ తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవచ్చు.

పిల్లలను భయపెట్టడానికి లేదా చిలిపిగా చేయడానికి ఉద్దేశించి చేసే పనులు పెద్దలపై పిల్లలకు అపనమ్మకాన్ని కలిగిస్తాయని క్లినికల్ సైకాలజిస్ట్ వెనెస్సా లాలో హెచ్చరించారు. కొత్త చట్టం పిల్లల ప్రైవసీని రక్షించడానికి, వారి గౌరవాన్ని ఆన్‌లైన్‌లో కాపాడటానికి ఒక ముందడుగు లాంటిదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి చట్టాల ఆవశ్యకత ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు.

* చట్టంపై కొత్త వాదన

ది పేరెంటింగ్‌ అండ్‌ డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ అబ్జర్వేటరీ(L’Observatoire de la Parentalité et de l’Éducation Numérique) డైరెక్టర్, వ్యవస్థాపకుడు థామస్ రోహ్మెర్ మాట్లాడుతూ.. కొత్తగా తీసుకొచ్చిన చట్టం ఇమేజ్‌ రైట్స్‌ గురించి మాట్లాడుతుందని చెప్పారు. కానీ పిల్లల గౌరవం గురించి కాదన్నారు. పేరెంట్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు తమ బిడ్డ ముఖంపై ఒక చెంచా క్రీమ్‌ను విసిరి జీవనోపాధి పొందడాన్ని అగౌరవం కిందకు వస్తుందని రోహ్మెర్ ఉదహరించారు.

First published:

Tags: France, Social Media, Tech news, VIRAL NEWS

ఉత్తమ కథలు