Flying Man : గాల్లో ఎగురుతూ ఇంగ్లీష్ ఛానెల్ దాటిన "ఫ్లైయింగ్ మేన్"

ఐదు టర్బైన్ల సాయంతో... బ్యాక్‌పాక్‌లో కిరోసిన్ నింపుకొని... గంటకు 190 కిలోమీటర్ల వేగంతో ఫ్లైయింగ్ మేన్ ఫ్రాంకీ జపాటా... పది నిమిషాలపాటూ... గాల్లో చక్కర్లు కొట్టాడు.

Krishna Kumar N | news18-telugu
Updated: August 4, 2019, 2:39 PM IST
Flying Man : గాల్లో ఎగురుతూ ఇంగ్లీష్ ఛానెల్ దాటిన
ఫ్లైయింగ్ మేన్ ఫ్రాంకీ జపాటా (Image : REUTERS - Yves Herman)
Krishna Kumar N | news18-telugu
Updated: August 4, 2019, 2:39 PM IST
St Margaret's Bay (UK) : జెట్ పవర్‌తో రయ్యిన దూసుకుపోయే హోవర్ బోర్డ్‌ను కొన్నేళ్లపాటూ కష్టపడి తయారుచేసిన ఫ్రాన్స్ మేన్ ఫ్రాంకీ జపాటా... ఆదివారం రెండో ప్రయత్నంలో ఇంగ్లీష్ ఛానెల్‌ను విజయవంతంగా దాటేశాడు. గత నెల్లో జరిగిన మొదటి ప్రయత్నంలో అతను రీఫ్యూయల్ చేసుకుంటూ... నదిలో పడిపోయాడు. ఫ్రాన్స్‌లోని సంగట్టే నుంచీ ప్రయాణం ప్రారంభించిన జపాటా... 20 నిమిషాలు గాల్లో చక్కర్లు కొట్టి... ఇంగ్లాండ్ దక్షిణ తీర ప్రాంతం డోవర్‌లోని సెయింట్ మార్గరెట్స్ బే చేరుకున్నాడు. ఈ ఫీట్ చేస్తున్నప్పుడు... మూడు హెలికాప్టర్లు ఎస్కార్ట్ చేశాయి. చివరకు అతను మార్గరెట్స్ బేలో దిగగానే... డజన్ల కొద్దీ పర్యాటకులు, జర్నలిస్టులూ అతన్ని కలిసి... ఫీట్‌పై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఫ్లైయింగ్ మేన్ ఫ్రాంకీ జపాటా (Image : Steve Parsons - PA via AP )


ఐదు టర్బైన్ల సాయంతో... బ్యాక్‌పాక్‌లో కిరోసిన్ నింపుకొని... గంటకు 190 కిలోమీటర్ల వేగంతో ఫ్లైయింగ్ మేన్ ఫ్రాంకీ జపాటా... గాల్లో దూసుకెళ్లాడు. ఐతే... అతని దగ్గరున్న కిరోసిన్... 10 నిమిషాలు ప్రయాణించేందుకు మాత్రమే సరిపోతుంది. అతను మాత్రం మొత్తం 35 మీటర్ల దూరాన్ని 20 నిమిషాల్లో చేరుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాడు. అంటే గంటకు యావరేజ్‌గా 140 కిలోమీటర్ల వేగంతో వెళ్లాలి. నీటిపై 50 నుంచీ 65 అడుగుల ఎత్తులో ప్రయాణించాలి. సరిగ్గా టూర్ మధ్యలో ఓ బోటులో కిరోసిన్‌తో రెడీగా ఉన్నారు అతని అనుచరులు. 10 నిమిషాల తర్వాత... ఓవైపు గాల్లో ఎగురుతూనే... తిరిగి కిరోసిన్ నింపుకొని... తన ప్రయాణం సాగించాడు 40 ఏళ్ల జపాటా. ఈ మొత్తం ట్రిప్‌లో రీ-ఫ్యూయల్లింగ్ అనేది కష్టమైన అంశంగా అతను తెలిపాడు.




నెల కిందట ఇలాంటి ప్రయోగమే చేసినప్పుడు... రీ-ఫ్యూయల్లింగ్‌కి ఫ్రెంచ్ అధికారులు అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం జపాటా కష్టాన్ని గుర్తించి... అనుమతి ఇచ్చారు. మూడేళ్లుగా అతను హోవర్‌బోర్డ్‌ను తయారుచేస్తూనే ఉన్నాడు. ఇందుకు ఫ్రాన్స్ ఆర్మీ... అతనికి రూ.10 కోట్లు సాయంగా ఇచ్చింది. మధ్యలో ఓసారి ప్రయాణించేటప్పుడు తేడా వచ్చి... అతని రెండు వేళ్లు టర్బైన్లలో ఇరుక్కొని విరిగిపోయాయి. ఈ ప్రయత్నంలో అతడు హోవర్ బోర్డుపై వేగంగా ప్రయాణించిన వ్యక్తిగా గిన్నీస్ రికార్డ్ సాధించాడు. 2016 ఏప్రిల్‌లో మధ్యధరా సముద్రంపై 2.2 కిలోమీటర్లు ఎగురుతూ అతను ఈ రికార్డ్ నెలకొల్పాడు. ఇప్పుడు ఇంగ్లీష్ ఛానెల్ దాటడంతో... మరో రికార్డ్ అతని సొంతమయ్యేలా ఉంది.
First published: August 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...