కొందరికి చలికాలం (Winter Season) అంటే చాలా ఇష్టం. చలిని, పొగమంచులోని ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు ఎంతగానో ఆసక్తి చూపుతుంటారు. వింటర్లో మంచు కురిసే చోట్లకు కొంత మంది పర్యాటకులు (Tourists) వెళుతుంటారు. అక్కడ తెల్లని మంచులో విహరిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. మరి కొన్ని చోట్ల అయితే ఉష్టోగ్రతలు మరీ చల్లగా ఉంటాయి. చూస్తూండగానే గడ్డకట్టుకుపోయేంతలా వాతావరణం ఉంటుంది. అలాంటి ఓ చోట సబ్బు బుడగ పేలి పోయేలోపే గడ్డకట్టి మంచి స్పటికం(Ice Crystal)లా మారిపోయింది. దీనికి సంబంధించిన వీడియో (Video) ఒకటి నెట్లో ప్రత్యక్షమై వైరల్ అవుతోంది. హై క్వాలిటీ కెమేరాలో రికార్డు చేసిన ఈ దృశ్యం ఇప్పుడు అందరినీ కట్టిపడేస్తోంది. ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
కెమెరాలో టైమ్ ల్యాప్స్ ఆప్షన్ని ఉపయోగించి ఈ అద్భుతమైన దృశ్యాన్ని చిత్రీకరించారు. దీనిలో సబ్బు బుడగ మంచు స్ఫటికాలుగా ఎలా రూపాంతరం చెందుతుందో దశల వారీగా కనిపిస్తుంది. ముందు సబ్బు బుడగను మంచు ఉపరితలంపై ఉంచారు. బహిరంగ ప్రదేశంలో, చల్లని ప్రాంతంలో అది మెల్లగా ఎలా తన రూపాన్ని మార్చుకుంటోందో స్పష్టంగా వీడియోలో చూడవచ్చు.
* కామెంట్లు, షేర్లతో వైరల్
సాధారణంగా మనం సబ్బు నురగలోని బుడగ ఎలా గడ్డ కడుతుంది? అనే దృశ్యాన్ని ఎప్పుడూ చూడం. అది మన కళ్లకు కనిపించని సూక్ష్మమైన విషయం. మనం ఎప్పుడూ చూడని ఓ విషయాన్ని చూసే అవకాశం వస్తే వదలం. అందుకే buitengebieden అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ అయిన ఈ వీడియోకి నెటిజన్లు ఫిదా అయిపోయారు. షేర్లు, కామెంట్లతో వైరల్ చేశారు. అందుకే ఈ సబ్బు బుడగ వీడియో నిమిషాల్లో ఫేమస్ అయిపోయింది. దీన్ని నెట్లో షేర్ చేసిన కొంచెం సమయంలోనే ఇది వైరల్ అయింది. ఈ చిన్న ఎనిమిది సెకన్ల వీడియో 5.6 మిలియన్లకు పైగా వ్యూస్‌ని సొంతం చేసుకుంది. ఇంకా దీనిపై నెటిజన్లు ఇప్పటికీ కామెంట్ల వర్షం కురిపిస్తూనే ఉన్నారు.
Freezing of soap bubble.. ❄️ pic.twitter.com/zV03WKhbjt
— Buitengebieden (@buitengebieden) November 21, 2022
ఈ వీడియో చూసిన వారిలో కొందరు తమ కామెంట్లను రాసుకొచ్చారు. దీనిపై తమ వివరణలు, భావాలను వాటి ద్వారా పంచుకున్నారు. “లోపల చిన్న నీటి స్ఫటికాలు. ప్రకృతి మాత తన అద్భుతమైన సంపదను మనకు అందించింది. ఇంద్ర ధనుస్సులు, బ్లూ లాగూన్స్, పచ్చని అడవులు.. లాంటి వాటిని రక్షించడమే మన పని.’ అని ఒక వ్యక్తి కామెంట్ రాశారు.
‘ఇది క్రిస్టలైజేషన్కు సంబంధించినది. పరమాణువులు తమకు తాము అనుకూలమైన దిశల నుంచి ఒకదాని వెంట ఒకటి అమరుతాయి. రసాయన మూలకాలకు సంబంధించిన ఇంటర్నల్ ఎనర్జీ ఇక్కడ కీలకంగా పని చేస్తుంది. మీరు ఇక్కడ చూస్తున్న దాన్ని డెన్డ్రిటిక్ గ్రోత్ అంటారు’ అని దీని వెనుక ఉన్న సైన్స్‌ను వివరించారు ఒక నెటిజన్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Trending video, Viral Video, WINTER