Home /News /trending /

FREAKY VIDEO SHOWING ROBOT DOG WALKING DOWN STREET IN LIFE LIKE MANNER GETS OVER 12 MILLION VIEWS SK GH

రోడ్డుపై వింత జంతువు సంచారం.. జనాలు షాక్.. వీడియో వైరల్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కెనడాలోని అంటారియోలో ఒక వీధిలో తిరుగుతున్న ఈ రోబో డాగ్‌ను చూసి అక్కడి వ్యక్తులు ఆశ్చర్యపోయారు.

ఇంటర్నెట్లో ఒక వీడియో వైరల్‌గా మారింది. ఎవరూ ఎప్పుడూ చూడనటువంటి ఏలియన్స్ వంటి వింత జంతువు ఒకటి రోడ్లపైకి వచ్చి పరుగులు తీయడంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. కాసేపటి తరువాత అసలు విషయం తెలుసుకుని తేరుకున్నారు. ఎందుకంటే అది ఏలియన్స్, వింత జంతువు కాదు. మనుషులు తయారు చేసిన రోబో డాగ్.

దాని పేరు స్పాట్. గొర్రెల కాపరిగా పనిచేయడంతో పాటు, సామాజిక దూరం పాటించేలా ప్రజలను ఇవి అప్రమత్తం చేస్తాయి. కెనడాలోని అంటారియోలో ఒక వీధిలో తిరుగుతున్న ఈ రోబో డాగ్‌ను చూసి అక్కడి వ్యక్తులు ఆశ్చర్యపోయారు. వారిలో నాథన్ కనసావే అనే వ్యక్తి దీన్ని వీడియో తీసి సమాజిక మాధ్యమాల్లో పెట్టాడు. ఈ రోబో డాగ్‌ను ఆపరేట్ చేస్తున్న వ్యక్తి అనుమతి తీసుకుని కనసావే వీడియో రికార్డ్ చేశాడు. రోబో డాగ్ ఫుట్పాత్ మీద నడుస్తున్నట్టు కనిపిస్తున్న ఈ వీడియో కొన్ని క్షణాల్లోనే వైరల్‌గా మారింది.

“మేము రోడ్డుపై వెళ్తున్నాం. ముందు రోబోను చూసినప్పుడు, అది ఏదో కొత్తరకం జంతువు అనుకుని ఆశ్చర్యపోయాం. తరువాత రోబో వెనుక ఉన్న ఆపరేటర్ను చూశాం...” అని కనసావే హిందుస్తాన్ టైమ్స్ వార్తాసంస్థతో చెప్పాడు. అతడు ఆ వీడియోను ట్విట్టర్లో పంచుకున్నాడు.

చాలా మంది రీట్వీట్ చేయడంతో ఈ పోస్ట్ వైరల్ అయ్యింది. ఈ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి భారీ ఎత్తున స్పందన రావడంతో ప్రస్తుతం కనసావే తన ట్విట్టర్ ప్రొఫైల్‌ను ప్రైవేట్‌గా మార్చుకున్నాడు. ఈ రోబో డాగ్స్‌ను స్పాట్ అని పిలుస్తున్నారు. వీటిని బోస్టన్ డైనమిక్స్ అనే రోబోటిక్స్ సంస్థ రూపొందించింది.
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Information Technology, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు