హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Fourth wave Effect: మరోసారి పంజా విసురుతున్న కరోనా.. మాస్కులు తప్పనిసరి చేస్తూ కీలక ఉత్తర్వులు.. ఫోర్త్ వేవ్ కారణమా..?

Fourth wave Effect: మరోసారి పంజా విసురుతున్న కరోనా.. మాస్కులు తప్పనిసరి చేస్తూ కీలక ఉత్తర్వులు.. ఫోర్త్ వేవ్ కారణమా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Corona Virus: దేశంలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. ఇప్పటికే దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయా ప్రభుత్వాలను అలెర్ట్ చేసింది.

UP Makes Masks Mandatory in THESE Districts:  కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. దీని ప్రభావానికి ఇప్పటికే ప్రపంచ మంతా విలవిల్లాడుతుంది. థర్డ్ వేవ్ అనంతరం కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటంతో పాటు మరణాల సంఖ్య కూడా తగ్గుతు వచ్చింది. దీంతో మెజారిటీ రాష్ట్రాలు కరోనా ఆంక్షలను నామమాత్రం అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలో... గత కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య మరోసారి పెరుగుతు వస్తుంది. అదే విధంగా, మరణాల సంఖ్య పెరగటం రాష్ట్రాలను ఒకింత కలవర పెడుతుంది. ఇక ఫోర్త్ వేవ్ ముప్పు తప్పదని ఇప్పటికే పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ క్రమంలో యోగి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు నమోదు దృష్ట్యా, గౌతమ్ బుద్ నగర్, ఘజియాబాద్, హాపూర్, మీరట్, బులంద్‌షహర్, బాగ్‌పట్ మరియు లక్నోలో బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్‌లు ధరించడం తప్పనిసరి” అని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఇంతలో, గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో 24 గంటల్లో 65 తాజా కోవిడ్ -19 కేసులు నమోదవడంతో ఉత్తరప్రదేశ్ అంతటా ఆరోగ్య అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. సోమవారం 65 కొత్త కేసుల్లో 19 మంది విద్యార్థులు ఉన్నారు.

ప్రస్తుతం, జిల్లాలో 332 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు దాదాపు 15%కి పెరిగింది. ప్రతిరోజూ దాదాపు 1000 పరీక్షలు నిర్వహించబడుతున్నాయి. ఫిబ్రవరిలో మూడవ వేవ్‌లో ప్రభుత్వ ల్యాబ్‌లలో సానుకూలత రేటు 2.13% మరియు ప్రైవేట్ ల్యాబ్‌లలో 17% ఉందని గత మూడు నెలల డేటా చూపించింది. ఇక పాజిటీవీటి రేటు కూడా క్రమంగా పెరుగుతుంది. యూపీలోని.. గౌతమ్ బంధ్, ఘజియాబాద్, హపూర్, మీరట్, బులంద్ షార్, బఘ్ పట్, లక్నో లలో మాస్కు తప్పనిసరి చేస్తు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

గడిచిన 24 గంటలలో కరోనా కొత్త కేసులు రెండు వేల మార్క్ ను దాటాయి. అదే విధంగా పాజీటీవిటీ రేటుకూడా క్రమంగా పెరుగుతుంది. ఆదివారం ఒక్కసారిగా కరోనా కేసులు అధిక సంఖ్యలో నమోదయ్యాయి. దేశంలో గత 24 గంటలలో 2,183 కోత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి బారిన పడి 214 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 4,30,44, 280 కి చేరింది.

ప్రస్తుతం దేశంలో.. 11, 542 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గత 24 గంటలలో కరోనా నుంచి 1985 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో.. 186, 54,94,355 మంది వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. అదే విధంగా, 2,66,459 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. గత 24 గంటలలో 2,61, 440 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టారు.

First published:

Tags: Compulsory mask, Corona casess, Corona virus, Covid -19 pandemic, India, Uttar pradesh

ఉత్తమ కథలు