హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Heart Touching Letter: కంటతడి పెట్టిస్తున్న 4 ఏళ్ల చిన్నారి లేఖ.. పెంపుడు కుక్క చనిపోవడంతో దేవుడికి ఉత్తరం..

Heart Touching Letter: కంటతడి పెట్టిస్తున్న 4 ఏళ్ల చిన్నారి లేఖ.. పెంపుడు కుక్క చనిపోవడంతో దేవుడికి ఉత్తరం..

అమెరికన్ పాపులర్ వెబ్సైట్ కోరా(Quora)లోని 'హీరోస్ అండ్ దెయిర్ స్టోరీస్' (Heroes and Their Stories) పేజీలో పోస్ట్ చేయబడ్డ ఈ లేఖ వైరల్ గా మారింది. తన తండ్రి సహాయంతో మెరెడిత్ (Meredith) అనే 4 ఏళ్ల ప్రీ-స్కూలర్ దేవుని(God)కి రాసిన ఈ హృదయ విదారక లేఖను చూసి నెటిజన్లు కన్నీటిపర్యంతమవుతున్నారు.

ఇంకా చదవండి ...

  ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే ఇళ్లంతా కలకలలాడుతుంది. అందువల్ల, రోజురోజుకు పెంపుడు జంతువులపై ప్రజలకు ప్రేమ పెరుగుతోంది. ముఖ్యంగా నగరాలు, పట్టణాలలో వీటి పెంపకం విస్తరిస్తోంది. పెంపుడు కుక్క (Pet Dog)లను కూడా తమ తోటి కుటుంబ సభ్యుల్లాగే భావిస్తున్నారు. వాటికి ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా తట్టుకోలేక వాటి వైద్యం కోసం లక్షలు వెచ్చించడానికి కూడా వెనుకాడటం లేదు. ఇక, అమితంగా ఇష్టపడి పెంచుకున్న కుక్క చనిపోతే తమ కుటుంబ సభ్యున్ని కోల్పోయామని భావిస్తు భావోద్వేగానికి గురవుతున్నారు. తాజాగా, 4 ఏళ్ల బాలిక తన పెంపుడు కుక్క మరణించడం(Dog's Demise)తో తీవ్ర భావోద్వేగానికి లోనై దేవునికి ఒక లేఖ రాసింది.

  ప్రస్తుతం, అమెరికన్ (American) పాపులర్ వెబ్సైట్ కోరా(Quora)లోని 'హీరోస్ అండ్ దెయిర్ స్టోరీస్' (Heroes and Their Stories) పేజీలో పోస్ట్ చేయబడ్డ ఈ లేఖ వైరల్ గా మారింది. తన తండ్రి (Father )సహాయంతో మెరెడిత్(Meredith) అనే 4 ఏళ్ల ప్రీ-స్కూలర్ దేవుని(God)కి రాసిన ఈ హృదయ విదారక లేఖను చూసి నెటిజన్లు కన్నీటిపర్యంతమవుతున్నారు.

  అబ్బే (Abbey) అని పిలువబడే ఆ పెంపుడు కుక్క స్వర్గానికి చేరుకోవాలని, దాని ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తున్నారు. ఇంతలా అందర్నీ కన్నీరు పెట్టిస్తున్న ఆ లేఖలో చిన్నారి ఏమి రాసిందో ఓసారి చూద్దాం.. "ప్రియమైన దేవుడా, మీరు నా కుక్కను జాగ్రత్తగా చూసుకుంటారా? నా కుక్క నిన్న మరణించింది. అది మీతో స్వర్గంలో ఉంది. నేను దాన్ని చాలా మిస్ అవుతున్నాను. అది అనారోగ్యంతో చనిపోయినప్పటికీ, మీరు నా కుక్కను హక్కున చేర్చుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. మీరు నా కుక్కతో సంతోషంగా ఆడుకుంటారని నమ్ముతున్నాను. దానికి ఈత కొట్టడం, ఆటలాడటం అంటే చాలా ఇష్టం. నేను నా కుక్క చిత్రాన్ని కూడా ఈ లేఖ ద్వారా మీకు పంపుతున్నాను. కాబట్టి, మీరు నా కుక్కను త్వరగా గుర్తుపట్టవచ్చు. ప్రతి రోజూ నాతో ఆడుకునే కుక్క ఇప్పుడు లేకపోవడాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను” అంటూ భావోద్వేగంతో కూడిన లేఖ రాసింది.

  నెటిజన్లను కంటతడి పెట్టిస్తున్న చిన్నారి లేఖ..

  కాగా, తాను రాసిన ఆ లేఖను పోస్ట్ చేయమని తన తండ్రిని కోరింది. అంతేకాక, ఆ లేఖ స్వర్గానికి వెళ్ళడానికి చాలా స్టాంపులు (stamps) అవసరం పడతాయని గ్రహించి అనేక స్టాంపులను అతికించింది. కాగా, తెలిసీ తెలియని వయసులో ఆ చిన్నారి రాసిన ఈ లేఖను చూసని అనేక మంది నెటిజన్లు చలించిపోయి, ఆ చిన్నారికి తిరిగి లేఖ రాస్తున్నారు. తాను లేఖ పోస్ట్ చేసిన కొద్ది రోజులకే ఆ చిన్నారి ఒక నెటిజన్ నుంచి ప్యాకేజీని అందుకుంది. ఆ ప్యాకేజీలో మిస్టర్ రోజర్స్(Mr. Rogers) రాసిన- 'వెన్ ఎ పెట్ డైస్' (When a Pet Dies) అనే పుస్తకాన్ని పంపించారు ఆ నెటిజన్. స్వయంగా తన చేతివ్రాతలో రాసిన నోట్‌లో అబ్బే సురక్షితంగా స్వర్గానికి వచ్చాడని ఆ నెటిజన్ పేర్కొన్నాడు. చిన్నారి అద్భుతమైన కథపై అతడు స్పందిస్తూ, "నేను మీ లేఖను చదివినప్పుడు నా కళ్ళలో నీళ్లు తిరగాయి. ఇలాంటి యజమాని కలిగి ఉండటం అబ్బే అదృష్టంగా భావిస్తున్నా. మీ అద్భుతమైన కుటుంబాన్ని ఆ దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. " అని పేర్కొన్నాడు.

  First published:

  Tags: Dog, Social Media, Trending, Viral, VIRAL NEWS

  ఉత్తమ కథలు