ఆస్ట్రేలియాలో వింత... గత జన్మలో తాను డయానా అంటున్న నాలుగేళ్ల పిల్లాడు...

Australia : చనిపోయిన వాళ్లు తిరిగి పుడతారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉన్నదే. గతంలో కూడా చాలా మందికి సంబంధించి ఇలాంటి చర్చలు జరిగాయి. ఇప్పుడా చిన్నారి విషయంలో ఏం జరుగుతోందో తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: July 18, 2019, 2:13 PM IST
ఆస్ట్రేలియాలో వింత... గత జన్మలో తాను డయానా అంటున్న నాలుగేళ్ల పిల్లాడు...
బిల్లీ, డయానా
  • Share this:
అప్పుడు ఆ చిన్నారి బిల్లీ క్యాంప్‌బెల్ వయసు రెండేళ్లు. ఓ పేపర్‌లో ప్రిన్సెస్ డయానా ఫొటో చూపించి... అది తనే అన్నాడు. పిల్లాణ్ని ఒళ్లో కూర్చోపెట్టుకున్న తండ్రి డేవిడ్ క్యాంప్‌బెల్... ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. రెండేళ్ల తర్వాత... మళ్లీ అలాంటి సందర్భం వచ్చింది. టీవీలో డయానా కనిపించింది. వెంటనే గుర్తుపట్టిన బిల్లీ... అది తనే అన్నాడు. తాను ప్రిన్స్‌గా ఉన్నప్పటి ఫొటోలు అవి అని అమ్మానాన్నకు చెప్పాడు. పేరెంట్స్ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. బిల్లీ తండ్రి... ఆస్ట్రేలియా లోని ఓ టీవీ ఛానెల్‌లో ప్రజెంటర్. డయానా తన కొడుకు రూపంలో మళ్లీ పుట్టిందా అన్న అనుమానం ఆయనకు కలుగుతోంది ఇప్పుడు. ఈ విషయం ఎవరికి చెప్పాలి. చెబితే నమ్మేదెవరు? మొత్తానికి ఇప్పుడు ప్రపంచమంతా తెలుస్తోంది.

అందాల ప్రిన్సెస్ డయానా 1997లో కార్ యాక్సిడెంట్‌లో చనిపోయింది. ఆమె చనిపోయిన 18 ఏళ్ల తర్వాత బిల్లీ పుట్టాడు. తన కొడుక్కి ఈ డయానా ఆలోచనలు ఎలా వచ్చాయో అర్థం కావట్లేదంటున్నాడు డేవిడ్. చిత్రమేంటంటే... డయానా చిన్నప్పటి సంగతులు కూడా ఆ పిల్లాడు చెప్పగలుగుతున్నాడట. అలాంటి విషయాలు తమకే తెలియవనీ, ఇంటర్నెట్‌లో చదివితే... పిల్లాడు చెప్పినవన్నీ నిజమేనని తెలిసిందంటున్నారు ఆ పేరెంట్స్.

తమ కొడుకు విషయంలో ఇలా ఎందుకు జరుగుతోందో అర్థం కావట్లేదంటున్న డేవిడ్ దంపతులు... ఇలాంటి లక్షణాలు ప్రపంచంలో ఇంకెవరికైనా ఉన్నాయా, ఇలా ఎవరైనా గత జన్మల గురించి చెబుతున్నారా అన్న విషయాలు తెలుసుకుంటున్నారు.

First published: July 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>