దూర ప్రాంతాలకు త్వరగా చేరుకోవాలంటే మనకున్న ఏకైక రవాణా సాధనం విమానం. కానీ ధరలు కూడా అందుకు తగ్గట్టుగా ఉంటాయి. విదేశాలలో అయితే విమానాల్లో కల్పించే సౌకర్యాలను వాళ్లు ఫిక్స్ చేసే రేట్లను చూస్తే కళ్లు భైర్లు కమ్మాల్సిందే. ఇదే కారణంతో చాలా మంది వేరే దేశాలనుంచి తమ స్వంత ప్రాంతాలకు వెళ్లినా.. ఏమీ తీసుకుపోరు. అదనపు లగేజీ కింద ధర వాచిపోవాల్సిందే. చాలా మంది ఆ సొమ్ములు కట్టలేక... వారు ఇష్టపడి కొనుగోలు చేసింది కూడా విమానాశ్రయాలలోనే ఉంచేసిన సందర్భాలు కోకొల్లలు. కాగా.. విమానంలో అదనపు లగేజీకి ఎక్కువ చార్జ్ చేస్తారనే కారణంతో నలుగురు వ్యక్తులు 30 కిలోల నారింజ పండ్లు లాగేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
ఈ ఘటన చైనాలో చోటు చేసుకుంది. చైనాలోని యునాన్ ప్రావిన్స్ కు చెందిన నలుగురు వ్యక్తులు తాము ఉండే ప్రాంతం నుంచి మరో చోటుకు బయల్దేరడానికి విమానాశ్రయానికి పయనమయ్యారు. అయితే వారి వెంట 30 కిలోల నారింజలు కూడా ఉన్నాయి. అయితే వాటిని తీసుకెళ్లాలంటే.. లగేజీ అదనపు చార్జీల (300 యువాన్లు.. భారత్ కరెన్సీ ప్రకారం రూ. 3,500 కి పైనే..) కింద విమానాశ్రయ అధికారులు సాంతం లాగేస్తారని వారికి లేటుగా అర్థమైంది. దాంతో వారికొక మహత్తరమైన ఐడియా తట్టింది.
ఆ అదనపు డబ్బును చెల్లించడం వారికిష్టం లేదు. వారికి లగేజీ చార్జీలు కట్టడం కంటే వాటిని తినేయడమే మేలని అనుకున్నారు. దీంతో నలుగురు వ్యక్తులు కలిసి ముప్పై కిలోల నారింజ పండ్లు తిన్నారు. దీనికి గానూ ఆ నలుగురు.. 20 నుంచి 30 నిమిషాల టైం తీసుకున్నారట.
ఇదీ చదవండి.. Money: సంపదతో సంతోషాన్నీ కొనేయచ్చు.. ఎంత డబ్బుంటే అంత సంతోషం.. ఇది కొత్త లెక్క..
తినడమైతే తిన్నారు గానీ.. వారికి తర్వాతే అర్థమైంది అన్ని నారింజలు తింటే జరిగే అనార్థాలేమిటో.. నారింజ పండ్లు తినగానే వారి పూతల భారిన పడ్డారు. ఇందకు సంబంధించిన వార్త చైనాలో వైరల్ గా మారింది. చాలా మంది వారి అమాయకత్వాన్ని చూసి నవ్వాలో.. లేక మూర్ఖత్వాన్ని చూసి ఏడ్వాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు. వేలకు వేలు ఖర్చు పెట్టి ప్రయాణాలు చేసే వ్యక్తులు... 300 యువాన్ల కోసం కక్కుర్తి పడటం గమనార్హం.
Published by:Srinivas Munigala
First published:January 27, 2021, 19:45 IST