Tik Tok Star Charli DAmelio: వినోదం, వాణిజ్యం, టెక్నాలజీ తదితర ఐదు కీలక రంగాల్లో సరిలేరు నీకువ్వరు అన్నట్లు దూసుకుపోతున్న 40 ఏళ్ల లోపు వయస్కులైన 40 మంది ప్రపంచ ప్రభావశీల వ్యక్తుల జాబితాను ఫార్చున్ మ్యాగజైన్ ఇటీవల విడుదల చేసింది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న అత్యంత పిన్న వయస్కురాలు...అమెరికాకు చెందిన టిక్ టాక్ స్టార్ చార్లీ డీఅమెలియో. ఆమె వయస్సు కేవలం 16 సంవత్సరాలు. కేవలం ఒక్క సంవత్సరంలోనే టిక్ టాక్ స్టార్‌గా సెలబ్రిటీ స్టేటస్ సొంతం చేసుకుంది చార్లీ డీఅమెలియో. మీడియా, వినోద రంగాల్లో ఆమె పేరు మార్మోగిపోతోంది. డ్యానర్ అయిన ఆమెకు అమెరికా యువకుల మధ్య మంచి క్రేజ్ ఉంది. ఆమె టిక్ టాక్ వీడియో చూడనిదే లక్షలాది మంది యువతకు రోజు గడవటం లేదు.
ఆమె టిక్ టాక్‌లో పోస్ట్ చేసిన షార్ట్ వీడియో...నిమిషాల్లో వైరల్ అవుతుంది. మిల్లియన్లలో వ్యూస్ వస్తాయి.టిక్ టాక్‌తో ఆమె సంపాదన కూడా అలాగే కోట్లలోనే. టిక్ టాక్‌లో ఆమెకు 8.44 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే టిక్ టాక్ అమెరికా ఆపరేషన్స్‌ను అమెరికన్ కంపెనీకి విక్రయించాలని...లేకుంటే తమ దేశంలో దాన్ని బ్యాన్ చేస్తామంటూ ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ ఆదేశాలపై సంతకాలు చేశారు. చైనా కంపెనీ బైట్ డ్యాన్స్...అమెరికా ఆపరేషన్స్‌ను విక్రయించని పక్షంలో అమెరికాలో టిక్ టాక్ బ్యాన్‌కు గురవుతుంది. అదే పరిస్థితి ఏర్పడితే టిక్ టాక్ స్టార్‌గా అమెరికాలో వెలిగిపోతున్న చార్లీ డీఅమెలియా భవితవ్యం ఏమవుతుందో వేచిచూడాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tiktok