జగన్ పాలనపై నోరుజారిన వైసీపీ మహిళా నేత

ముఖ్యమంత్రి వైయస్ జగన్ అమలు చేసున్న పథకాలపై విమర్శలు కురిపిస్తున్న చంద్రబాబునాయుడుకి కౌంటర్ ఇవ్వడానికి కిల్లి కృపారాణి ప్రెస్ మీట్ నిర్వహించారు.

news18-telugu
Updated: October 15, 2019, 1:14 PM IST
జగన్ పాలనపై నోరుజారిన వైసీపీ మహిళా నేత
ఈనెల 28న వైసీపీలో చేరనున్న కిల్లి కృపారాణి
  • Share this:
అప్పుడు అప్పుడు సభలలో రాజకీయ నాయకులు నోరుజారడం మాములు విషయమే.ఎదో మాట్లాడాలి అనుకోని ఇంకేదో మాట్లాడతారు. ఆ వీడియోలు కాస్తా వైరల్ అయ్యి పోతాయి . ఇది ఇలా ఉండగా మాజీ కేంద్ర మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ మహిళా నేత కిల్లి కృపారాణి కూడా ఇలానే నోరు జారారు.వివరాల్లోకి వెళ్తే ఈ నెల 21 వ తేదీన శ్రీకాకుళం జిల్లా పర్యటనకు సిద్ధమయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అయితే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ అమలు చేసున్న పథకాలపై విమర్శలు కురిపిస్తున్న చంద్రబాబు నాయుడుకి కౌంటర్ ఇవ్వడానికి కిల్లి కృపారాణి ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో ఆవిడ మాట్లాడుతూ "జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవినీతి రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తున్నారు " అని తడబడ్డారు. అయితే ఎప్పుడు ఎప్పుడు అవకాశం దొరుకుతుంది అని చూస్తున్న తెలుగు తమ్ముళ్లు మరియు జనసైనికులు ఆ వీడియో ని విపరీతంగా వైరల్ చేసి ట్రోలింగ్ మొదలు పెట్టారు

First published: October 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading