సేంద్రియ వ్యవసాయం చేస్తున్న ధోనీ... ఫామ్‌హౌస్‌లో ట్రాక్టర్ తోలుతూ...

కరోనా కాలాన్ని ధోనీ బాగానే వాడుకుంటున్నాడు. టైమ్ వేస్ట్ చెయ్యకుండా... ఆర్గానిక్ పార్మింగ్ చేస్తున్నాడు.

news18-telugu
Updated: June 28, 2020, 7:00 AM IST
సేంద్రియ వ్యవసాయం చేస్తున్న ధోనీ... ఫామ్‌హౌస్‌లో ట్రాక్టర్ తోలుతూ...
సేంద్రియ వ్యవసాయం చేస్తున్న ధోనీ... ఫామ్‌హౌస్‌లో ట్రాక్టర్ తోలుతూ... (credit - instagram)
  • Share this:
జార్ఖండ్ డైనమైట్ MS ధోనీ... కరోనా లాక్‌డౌన్ కాలాన్ని తన ఫామ్‌హౌస్‌లోనే గడిపేస్తున్నాడు. ఐతే... ఈమధ్య ఈ మిస్టర్ కూల్‌కి ఆర్గానిక్ ఫార్మింగ్ (పురుగు మందులు వాడకుండా సేంద్రియ వ్యవసాయం) చెయ్యాలనే ఆలోచన వచ్చింది. వెంటనే మహీంద్రా కంపెనీకి చెందిన స్వరాజ్ ట్రాక్టర్ కొనేశాడు. ఈ విషయం తెలిసి... మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా... ధోనీకి థాంక్స్ చెప్పారు. ఆ ఎపిసోడ్ అంతా వైరల్ అయ్యింది. ఇక ఇప్పుడు ధోనీ... ఆ ట్రాక్టర్ నడుపుతున్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది. గ్రౌండ్‌లో హెలికాప్టర్ షాట్స్ బాదడమే కాదు... ఫీల్డ్‌లో వ్యవసాయం కూడా చెయ్యగలనని నిరూపిస్తున్నాడు ధోనీ.

కోట్ల ఆస్తి ఉన్న ధోనీ... ఇలా సాధారణ రైతుల్లాగా రెక్కలు ముక్కలు చేసుకోవాల్సిన అవసరం లేదు. తను కోరుకుంటే... ప్రపంచంలోనే ది బెస్ట్ ఆర్గానిక్ ఫుడ్ పొందగలడు. కానీ... ధోనీకి స్వయంగా వ్యవసాయం చెయ్యాలనే కోరిక కలిగింది. అది కూడా ఏ పురుగు మందులూ వాడకుండా పండించాలనే ఉద్దేశంతో సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నాడు. తనే స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ పొలం పనుల్లో బిజీ అయ్యాడు ఈ 38 ఏళ్ల పవర్‌ఫుల్ వికెట్ కీపర్.
 View this post on Instagram
 

Exclusive Video Of Mahi Bhaiya Enjoying Doing Organic Farming !! ❤


A post shared by MS Dhoni Fans Club (@dhoni.bhakt) on

ధోని క్రికెట్ బ్యాట్ పట్టి... ఏడాది దాటింది. 2019 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో... న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో చివరిసారి కనిపించాడు. ఆ తర్వాత మార్చి 29న IPL 2020లో ఆడాల్సి ఉంది. అది కాస్తా కరోనా కారణంగా రెండుసార్లు వాయిదా పడింది. ఇక అది ఎప్పుడు జరుగుతుందో తెలియట్లేదు. ఐతేనేం... ధోనీ తన ఫ్యాన్స్‌ని ఏదో ఒక రకంగా అలరిస్తూనే ఉన్నాడు. నిజానికి ధోనీ... సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండదు. కానీ... ఆయన భార్య సాక్షి మాత్రం... ధోనికి సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కి చూపిస్తూ... టచ్‌లో ఉంచుతోంది.

ఈ వీడియో చివర్లో ధోనీ... ఏక్ రౌండ్ అవుర్... (మరో రౌండ్ వేస్తా) అన్నాడు. జులై 7న ధోనీ 39వ బర్త్ డే జరుపుకోబోతన్నాడు. ఐపీఎల్ 13వ ఎడిషన్‌ను ప్రారంభిస్తే... ధోనీ... చెన్నై సూపర్ కింగ్స్ జట్టును లీడ్ చేస్తాడు. సెప్టెంబర్-నవంబర్ మధ్య ఇది జరగొచ్చనే అంచనాలున్నాయి.
First published: June 28, 2020, 7:00 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading