Home /News /trending /

FORMER MISS UNIVERSE SUSHMITA SEN SHARES HER EMOTIONS WITH FANS LIVE ON INSTAGRAM SNR

మాజీ విశ్వసుందరి మనసులో మాటలు..వైరాగ్యమా..? వేదాంతమా..!

Photo Credit:Instagram

Photo Credit:Instagram

Sushmita Sen: సుస్మితాసేన్ బాలీవుడ్‌ నటి మాత్రమే కాదు. విశ్వసుందరిగా అందరి మనసులు గెలుచుకున్న పాపులర్‌ పర్సనాలిటీ. గతంలో ఫ్రెండ్‌షిప్‌, లివింగ్‌ రిలేషన్‌షిప్‌ పేరుతో లైఫ్‌ని జాలీగా గడిపిన మాజీ మిస్‌ యూనివర్స్ ఇప్పుడు ప్రేమ, అనుబంధాలు అంటూ సోషల్ మీడియా ఫాలోవర్స్‌తో తన ఎమోషన్స్‌ని షేర్ చేసుకుంటున్నారు. ఆమె షడన్‌గా ఇలా మారడానికి కారణాలేంటి..?

ఇంకా చదవండి ...
మాజీ విశ్వసుందరి..ఇప్పుడెందుకు భావోద్వేగానికిలోనైంది. ఎందుకంతలా ఫీలవుతోంది. అభిమానుల్ని చూసినా, వాళ్లతో మాట్లాడినా ఎక్కడ లేని ప్రేమను చూపిస్తోంది. మీరే నా సర్వస్వం, మీరంటే నాకు ఎంతో ఇష్టం అంటూ ఏదో వైరాగ్యపు మాటలు చెబుతోంది. సుస్మతాసేన్ (Sushmita Sen)పరిచయం చేయనక్కర్లేని సెలబ్రిటీ(Celebrity). 28సంవత్సరాల క్రితమే విశ్వసుందరి9(Miss Universe)గా యావత్‌ ప్రపంచానికి తెలిసిన అందగత్తె. ఆ తర్వాత బాలీవుడ్‌ ఫిల్మ్ ఇండస్ట్రీ(Bollywood film industry)లోకి అడుగుపెట్టి సిల్వర్ స్క్రీన్‌పై ఓ మెరుపు తీగలా మెరిసింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌ అన్న చందంగా మొదట్లో సుస్మతాసేన్‌ లైఫ్‌ సాగిపోయింది. ఆ తర్వాత ఆమె తీసుకున్న నిర్ణయాలతో లైఫ్ అంత బ్యూటిఫుల్‌గా లేదని ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌(Instagram live)లో ఫ్యాన్స్‌, ఫ్రెండ్స్‌తో సుస్మితాసేన్ మాట్లాడిన మాటలు చెప్పకనే చెబుతున్నాయి. తాను చూసిన ఎన్నో సంఘటనలు, ఎంతో మంది వ్యక్తులు, ఎన్నో విషయాలు, మరెన్నో డాక్యుమెంటరీలు ఎంతో మంది ప్రేమ, అభిమానాలు,అవమానాలు తనను ఇన్‌స్పైర్ (Inspire)చేశాయని చెప్పారు సుస్మితాసేన్. నలభై ఐదేళ్ల ఈ మాజీ విశ్వసుందరి కళ్లు చమర్చుతూ ఎంతో భావోగ్వేగాని(Emotions)కి లోనవుతూ ఈవిషయాన్ని తన లైవ్‌ చాట్‌లో షేర్ చేసుకున్నారు. తనతో మాట్లాడుతున్న వాళ్ల ప్రాబ్లమ్స్ చెప్పమని అడుగుతూనే..ప్రేమ, అనుబంధాల గురించి ప్రత్యేకించి మాట్లాడారు సుస్మితాసేన్. బాధ్యతల్ని మర్చిపోకుండా ఎవరి లైఫ్‌ని వాళ్లు చక్కగా డిజైన్ చేసుకోవాలంటూ సలహా ఇచ్చారు మాజీ మిస్‌ యూనివర్స్(Former Miss Universe).

సుస్మితాసేన్‌ మనసులో మాటలు..
విశ్వసుందరిగా అందరి హృదయాలు గెలుచుకున్న సుస్మితాసేన్‌ ఎవరికి జీవిత శాశ్వత భాగస్వామిగా మారలేకపోయారు. కొద్ది రోజుల క్రితం సుస్మితాసేన్‌ రోహ్మన్‌ షాల్‌ అనే ఓ యువకుడితో ఫ్రెండ్‌షిప్ చేశారు. వాళ్లిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి..చివరకు విడదీయరాని బంధం ఏర్పడింది. తనకంటే 15ఏళ్లు చిన్నవాడైన రోహ్మన్‌ షాల్‌తో డేటింగ్‌ చేసిన సుస్మితాసేన్‌ అతడితోనే పార్టీలు, ఫంక్షన్‌లకు అటెండ్‌ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడం, విడిపోవడం కూడా జరిగిపోయింది. దీనికి సుస్మితాసేన్‌ తనదైన స్టైల్లో ఎండ్ కార్డ్ వేశారు. స్నేహితులుగా కలిసిన రోహ్మన్‌ షాల్‌ తాను స్నేహితులుగానే విడిపోయామన్నారు. మా ఇద్దరి మధ్య అనుబంధం ముగిసింది కానీ ప్రేమ అలాగే ఉందంటూ డైరెక్ట్ స్టేట్‌ మెంట్ ఇచ్చారు సుస్మితాసేన్. అంతకు ముందు బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత విక్రమ్‌ భట్‌తో కూడా కొంతకాలం ఇలాంటి స్నేహబంధమే కొనసాగించినట్లుగా ఇండస్ట్రీలో టాక్ ఉంది. రోహ్మన్‌ షాల్‌తో ఉన్న రిలేషన్‌ బ్రేకప్‌ అయిన తర్వాతే సుస్మితాసేన్‌లో ఇంతటి వైరాగ్యం కనిపిస్తోందని ఆమె సోషల్ మీడియా ఫాలోవర్స్‌ అంటున్నారు.


ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే..
జీవితంలో ఎన్నో తీపిగుర్తులు ఉన్నట్లే..చేదుజ్ఞాపకాలు ఉంటాయని వేదాంతం చెప్పుకొచ్చారు మాజీ మిస్‌ యూనివర్స్. 45ఏళ్ల వయసు వచ్చినా.. వివాహం చేసుకోకుండనే ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకున్నారు సుస్మితాసేన్. వాళ్లతో కలిసే ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌లో లీడ్‌ రోల్స్ చేస్తున్నారు మాజీ విశ్వసుందరి. తన లైప్‌లో జరుగుతున్నవి, జరిగిన విషయాలను స్వయంగా తానే ఇన్స్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూనే సుస్మితాసేన్‌ తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు కనిపిస్తోంది.
Published by:Siva Nanduri
First published:

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు