Home /News /trending /

FORMER BIHAR CM LALU YADAV SLIPS INTO SEMI COMA CREATININE LEVEL CROSSES 7 HEALTH UPDATE PAH

Lalu Prasad Yadav: ‘నా భర్త కోసం ప్రార్థించండి..’.. కోమాలోకి వెళ్లిన లాలూ ప్రసాద్ యాదవ్..

లాలు ప్రసాద్ యాదవ్ (ఫైల్)

లాలు ప్రసాద్ యాదవ్ (ఫైల్)

Bihar: బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింతగా విషమించింది. పాట్నా ఆసుపత్రి నుంచి బుధవారం రాత్రి విమానంలో ఢిల్లీకి తరలించారు. ప్రస్తుతం ఆయన కోమాలోకి వెళ్లారు.

బీహార్ (Bihar) మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత దిగజారింది. ఈ నేపథ్యంలో.. ఆయన సతీమణి, మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి మాట్లాడుతూ.. ఆయన ఆరోగ్యం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన కోసం ప్రార్థించండి. ఆయన అతి త్వరలో ఇంటికి తిరిగి వస్తారని అన్నారు. పాట్నా ఆసుపత్రి నుండి విమానంలో తరలించబడిన తరువాత, లాలూ యాదవ్ బుధవారం రాత్రి ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో చేరారు.  కాగా, లాలు యాదవ్ తన ఇంట్లో  పడిపోయిన తర్వాత..  ఫ్యాక్చర్ అయిన విషయం తెలిసిందే.  ఆ తర్వాత.. ఆయన మరింత దిగజారింది.

ఎయిమ్స్ వైద్యులకు లాలూజీ (Lalu prasad yadav)  వైద్య చరిత్ర తెలుసు. అందుకే, ఆయనను అక్కడ చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కాగా, లాలు ప్రసాద్ యాదవ్ తన ఇంట్లో  మెట్లపై నుండి పడిపోయారు.  ప్రస్తుతం అతని శరీర కదలిక చాలా తక్కువగా ఉందని  తేజస్వి యాదవ్ అన్నారు.  ఈ నేపథ్యంలో..  తేజస్వి యాదవ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra modi) ఫోన్ చేసి నాయకుడి ఆరోగ్య స్థితిని తెలుసుకున్నారు.

రెండు రోజుల క్రితం, కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ, పలువురు ఇతర నాయకులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అంతకుముందు రోజు, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అనారోగ్యంతో బాధపడుతున్న బీహార్ మాజీ సీఎంను కలిసేందుకు ఢిల్లీ విమానాశ్రయంలో వేచి ఉన్నారు.

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav)ఆరోగ్య ప‌రిస్థితి మరింత విష‌మించింది.

చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన ఇటీవల ఇంట్లో జారిపడి పడటంతో ఆస్పత్రిలో చేరారు. బుధవారం నాటికి పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆయనను హెలికాప్టర్ ద్వారా ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే సింగపూర్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయిస్తామని లాలూ తనయుడు, బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వీయాద్ చెప్పారు. సీఎం నితీశ్ కుమార్ ఇవాళ లాలూను పరామర్శించారు.

లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌ను పాట్నా నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు ఈ సాయంత్రం త‌ర‌లించే అవ‌కాశం ఉంది. గ‌త వారం లాలూ త‌న ఇంట్లోనే మెట్లు ఎక్కుతుండ‌గా జారి ప‌డ్డారు. దీంతో ఆయ‌న‌ను హుటాహుటిన చికిత్స నిమిత్తం పాట్నాలోని పారాస్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. లాలూ భుజం, వెన్నెముక‌కు తీవ్ర గాయ‌మైన‌ట్లు డాక్ట‌ర్లు నిర్ధారించారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Bihar, Lalu Prasad Yadav

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు