Tamil Nadu: 1500 కేజీల స్వీట్లు స్వాహా చేశారట.. తమిళనాడు మాజీ మంత్రిపై సంచలన ఆరోపణలు

అన్నాడీఎంకే నేత కేటీ రాజేంద్ర బాలాజీపై తమిళనాడు ప్రస్తుత పాడిపరిశ్రమల (డెయిరీ) మంత్రి ఎస్​ఎం నాసర్ తీవ్ర ఆరోపణలు చేశారు. అన్నాడీఎంకే హయాంలో మంత్రిగా ఉంటూ ప్రభుత్వ పాల ఉత్పత్తి సంస్థ ‘ఆవిన్’​ తయారు చేసిన 1500 కిలోల స్వీట్లు స్వాహా చేశారని విమర్శించారు.

అన్నాడీఎంకే నేత కేటీ రాజేంద్ర బాలాజీపై తమిళనాడు ప్రస్తుత పాడిపరిశ్రమల (డెయిరీ) మంత్రి ఎస్​ఎం నాసర్ తీవ్ర ఆరోపణలు చేశారు. అన్నాడీఎంకే హయాంలో మంత్రిగా ఉంటూ ప్రభుత్వ పాల ఉత్పత్తి సంస్థ ‘ఆవిన్’​ తయారు చేసిన 1500 కిలోల స్వీట్లు స్వాహా చేశారని విమర్శించారు.

  • Share this:
అన్నాడీఎంకే నేత కేటీ రాజేంద్ర బాలాజీపై తమిళనాడు ప్రస్తుత పాడిపరిశ్రమల (డెయిరీ) మంత్రి ఎస్​ఎం నాసర్ తీవ్ర ఆరోపణలు చేశారు. అన్నాడీఎంకే హయాంలో మంత్రిగా ఉంటూ ప్రభుత్వ పాల ఉత్పత్తి సంస్థ ‘ఆవిన్’​ తయారు చేసిన 1500 కిలోల స్వీట్లు స్వాహా చేశారని విమర్శించారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, ప్రభుత్వం త్వరలోనే విచారణకు ఆదేశిస్తుందని నాసర్ చెప్పారు. “గత సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా బాలాజీ 1.5 టన్నుల స్వీట్లు తీసుకున్నారు. అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు మా వద్ద ఉన్నాయి. ఆయన అప్పుడు స్వీట్లు ఇంటికి తీసుకెళ్లి.. ఆ తర్వాత పంపిణీ చేశారు” అని మంత్రి నాసర్ అన్నారు. డీఎంకే హయాంలో బాలాజీ పాడిపరిశ్రమ మంత్రిగా పని చేశారు.

“మా వద్ద అన్ని సరైన ఆధారాలు ఉన్నాయి. తయారీ ప్రాంతం నుంచి ఆయన స్వీట్లు తీసుకొని వెళ్లారు. అందుకు ఎలాంటి డబ్బు చెల్లించలేదు. పూర్తిస్థాయి విచారణ జరిపాక తగిన చర్యలు తీసుకుంటాం” అని పాత్రికేయుల సమావేశంలో నాసర్ చెప్పారు. అంతకు ముందు ఆయన తమిళనాడు కో-ఆపరేటివ్​ పాల ఉత్పత్తిదారుల సమాఖ్య (టీఎన్​సీఎంపీఎఫ్​)కు చెందిన మాన్యుఫాక్చరింగ్​ యూనిట్​ను సందర్శించారు. టీఎన్​సీఎంపీఎఫ్​కు చెందిన ప్రముఖ బ్రాండ్ పేరే ఆవిన్​. ఈ సమాఖ్యను కూడా ఎక్కువగా ఆవిన్ అనే అంటారు. అంతగా తమిళనాడులో ఈ బ్రాండ్​ పాపులర్ అయింది.

కాగా ఆ డెయిరీ యూనిట్​లో ఉద్యోగ నియామకాల్లోనూ అవకతవకలు జరిగాయని నాసర్ ఆరోపించారు. మధ్యవర్తుల ప్రమేయంతో కొందరు ఉద్యోగాలు పొందారని పేర్కొన్నారు. “టీఎన్​సీఎంపీఎఫ్​లో ఉద్యోగ నియామకాల్లోనూ అక్రమాలు జరిగాయి. బ్రోకర్లు, మధ్యవర్తుల ద్వారా కొందరు ఉద్యోగాలు పొందారు. ఈ విషయంపై కూడా పూర్తి విచారణ చేస్తాం. తగిన చర్యలు తీసుకుంటాం” అని నాసర్ పేర్కొన్నారు.





కాగా గత సంవత్సరం ఆగస్టులో మధురైలోని యూనిట్​కు చెందిన ఆవిన్ పాల విషయంలో అవకతవకలు బయటపడ్డాయి. మధురై ప్లాంట్​కు కల్తీపాలను పంపిణీ చేశారన్న ఆరోపణలతో ఐదుగురు కార్యదర్శులు, ముగ్గురు ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు. మొత్తంగా అప్పట్లో దాదాపు రూ.65లక్షల విలువైన అవకతవకలు జరిగాయని తేలింది. దీంతో అప్పట్లో ఆవిన్​ సంస్థలో తీవ్ర కలకలం రేగింది. తనిఖీలు, విచారణలు ముమ్మరంగా జరిగాయి. క్రమంగా అది సద్దుమణిగింది. అయితే ఇప్పుడు డీఎంకే అధికారంలోకి రావడంతో మళ్లీ పాల డెయిరీ విషయంపై దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. అయితే ఏకంగా అప్పటి మంత్రిపైనే ఆరోపణలు రావడం సంచలనంగా మారింది.

ఇది క్లిక్ చేసి చూడండి
Published by:Krishna Adithya
First published: