తమిళనాడులో 15 అడుగుల నాగుపాము... అటవీ అధికారులు ఏం చేశారంటే...

ఆ కోబ్రాను చూడగానే.... అది అంత పొడవు ఉండటంతో అంతా ఆశ్చర్యపోయారు. ఇన్నాళ్లూ అది ఎవరి కంటా పడకుండా ఎలా పెరిగిందో అనుకున్నారు.

news18-telugu
Updated: July 13, 2020, 11:29 AM IST
తమిళనాడులో 15 అడుగుల నాగుపాము... అటవీ అధికారులు ఏం చేశారంటే...
తమిళనాడులో 15 అడుగుల నాగుపాము... అటవీ అధికారులు ఏం చేశారంటే... (credit - twitter - ANI)
  • Share this:
అది తమిళనాడు... కోయంబత్తూర్‌లోని నరసిపురం గ్రామం. సిటీకి కాస్త దూరంగా ఉంటుంది. ఆ గ్రామానికి దగ్గర్లో వెల్లియంగిరి పర్వతాలున్నాయి. దట్టమైన అడవులున్నాయి. అలాంటి చోట... ఓ ఇంటి దగ్గరకు భారీ నాగుపాము వచ్చిందనీ, అది చాలా పొడవుగా ఉందని చెప్పడంతో... అటవీ అధికారులు... దాన్ని ఏమీ చెయ్యొద్దు. మేం వస్తున్నాం అంటూ.. అక్కడకు వెళ్లారు. పొడవు అంటే... ఆ పాము... ఏ ఆరు అడుగులో ఉండి ఉంటుంది అనుకున్నారు అటవీ అధికారులు. కానీ... ఆ ఇంటికి వెళ్లాకుయ ఓ ప్లాస్టిక్ డ్రమ్ వెనక అది దాక్కుంది. ప్రత్యేక పరికరాలతో పామును పట్టుకొని... బయటకు లాగగా... లాగే కొద్దీ అది వస్తూనే ఉంది. ఎంత లాగినా అది ఇంకా ఇంకా ఉంది. "వార్నీ ఇదేంటి" అనుకున్నారు. మొత్తానికి దాన్ని పూర్తిగా లాగి చూస్తే... అది మొత్తం 15 అడుగులు ఉన్నట్లు అర్థమైంది. మొత్తం పామును చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈ చుట్టు పక్కల ఇంత పెద్ద పాము తిరుగుతోందా.. బాబోయ్ అనుకున్నారు.


అటవీ అధికారులు దాన్ని జాగ్రత్తగా బంధించి... దగ్గర్లోని శిరువాణీ అడవుల్లో వదిలేశారు. ఇంత పొడవుగా పెరిగిన ఈ పాముకి చాలా ఎక్కువ విషం ఉంటుందని అధికారులు తెలిపారు.
మే నెలలో ఇలాగే... గోవాలోని ఓ ఇంటిపైకి ఎక్కి ఇరుక్కుపోయిన పామును... ఓ పోలీసులు... ఉత్తి చేతులతోనే పట్టుకొని కాపాడారు. అప్పట్లో అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అటవీ అధికారులు చెయ్యాల్సిన పనిని పోలీసే చేసినట్లైంది.
Published by: Krishna Kumar N
First published: July 13, 2020, 11:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading