రియల్ బాహుబలి.. ఏనుగునే భుజాలపై ఎత్తుకెళ్లి.. ప్రాణాలు కాపాడాడు.. వైరల్ వీడియో..

భుజాలపై ఏనుగును ఎత్తుకొని తీసుకెళ్లిన ఫారెస్ట్ గార్డ్

పళనిసామి శరత్‌కుమార్ అనే ఫారెస్ట్ గార్డ్ అక్కడికి చేరుకొని ఏనుగును కాపాడాడు. దాన్ని భుజాలపై ఎక్కించుకొని అడవుల్లో పరుగులు పెట్టాడు. అనంతరం వైద్య చికిత్స అందించి ప్రాణాలు కాపాడాడు.

 • Share this:
  బాహుబలి సినిమా ఎంత హిట్టయిందో అందరికి తెలిసిందే. అందులో ప్రభాస్ తన భుజాలపై శివలింగాన్ని ఎత్తుకొని తీసుకొచ్చే సీన్ హైలైట్. బాహుబలిలో ఎన్నో అద్భుతమైన సీన్స్‌లో అది కూడా ఒకటి. ఐతే అచ్చం అలాంటి దృశ్యమే తమిళనాడులో కనిపించింది. ఓ అటవీశాఖ అధికారి ఏకంగా ఏనుగునే తన భుజాలపై ఎత్తుకొని పరుగులు పెట్టాడు. సాధారణంగా ఏనుగు చాలా పెద్దగా ఉంటుంది. అది కాలి మోపితే మనిషి ప్రాణాలు పోతాయి. కానీ అలాంటి ఏనుగును అతడు భుజాలపై ఎత్తుకొని మోసుకెళ్లాడు. ఫారెస్ట్ అధికారి సుశాంతనంద ట్వీట్ చేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  తమిళనాడులోని మెట్టుపాల్యం అడవుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ గున్ను ఏనుగు తల్లి నుంచి విడిపోయింది. అనంతరం ఆడుకుంటూ వెళ్లి పెద్ద కాల్వలో పడిపోయింది. కాల్వ మొత్తం బురదతో నిండిపోవడంతో.. అందులో కూరుకుపోయి అల్లాడిపోయింది. ఏనుగు ధీన స్థితిని చూసి కొందరు ఫారెస్ట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే పళనిసామి శరత్‌కుమార్ అనే ఫారెస్ట్ గార్డ్ అక్కడికి చేరుకొని ఏనుగును కాపాడాడు. దాన్ని భుజాలపై ఎక్కించుకొని అడవుల్లో పరుగులు పెట్టాడు. అనంతరం వైద్య చికిత్స అందించి ప్రాణాలు కాపాడాడు.  వాస్తవానికి ఈ వీడియో పాతదే. కానీ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మరోసారి వైరల్‌గా మారింది. ఏప్రిల్ 4న పోస్ట్ చేసిన ఏనుగు వీడియోను ఇప్పటి వరకు 8వేల మందికిపైగా వీక్షించారు. ఆ ఫారెస్ట్ గార్డ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. నిజంగా నువ్వు బాహుబలివి అంటూ ఆకాశానికెత్తుతున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published: