హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Office Rule: ఇదెక్కడి రూల్ రా మామ.. ఆఫీస్‌కు ఒక్క నిమిషం లేట్ అయితే దబిడి దిబిడే..

Office Rule: ఇదెక్కడి రూల్ రా మామ.. ఆఫీస్‌కు ఒక్క నిమిషం లేట్ అయితే దబిడి దిబిడే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Office Rule: ఒక కంపెనీ బాస్ అత్యంత కఠినమైన రూల్ తీసుకొచ్చాడు. ఈ రూల్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది.

సాధారణంగా ఉద్యోగులు (Employees) ఆఫీసులకు సకాలం (On Time)లో రావాలని ప్రతి కంపెనీ రూల్ పెడుతుంది. లేదంటే లేట్-కమర్స్ (Late-comers)కి ఎంతో కొంత ఫైన్ విధించడమో లేక ఎంత లేటుగా వస్తే అంత సేపు ఆఫీస్‌లో ఉండాలని ఆదేశించడమో చేస్తుంది. అయితే ఒక కంపెనీ బాస్ మాత్రం అత్యంత కఠినమైన రూల్ తీసుకొచ్చాడు. ఈ రూల్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఒక ట్విట్టర్ యూజర్ ఈ ఆఫీస్ రూల్‌కు సంబంధించి ఒక ఫొటో పోస్ట్ చేశారు. అందులో "కొత్త ఆఫీస్ రూల్: మీరు వర్క్‌కి ఆలస్యంగా వచ్చిన ప్రతి నిమిషానికి సాయంత్రం 6 గంటల తర్వాత 10 నిమిషాలు అదనంగా పని చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు, మీరు 10.02కి ఆఫీస్‌కు చేరుకుంటే, మీరు సాయంత్రం 6.20 గంటల వరకు అదనంగా 20 నిమిషాలు పని చేయాల్సి ఉంటుంది." అని కనిపించింది. దీన్ని చూసిన నెటిజన్లు "బాబోయ్, ఇదేం క్రూరమైన రూల్" అని మండిపడుతున్నారు.

ఒక్క నిమిషం నిమిషానికి 10 నిమిషాల వర్క్ చేయించడం అనేది చాలా అన్యాయమని, ఇంత కఠినమైన పనిష్మెంట్ మరెక్కడా ఉండదని చాలా మంది నెటిజన్లు ఈ బాస్‌ను ఏకిపారేస్తున్నారు. ఈ రూల్ ప్రకారం, ఒకవేళ ఉద్యోగి పది నిమిషాలు ఆలస్యంగా వస్తే అతడు సుమారు గంట పాటు పని చేయాల్సి ఉంటుంది. అంటే ఈ కంపెనీ 50 నిమిషాలు ఉచితంగా ఓవర్‌టైమ్‌ పని చేయించుకుంటుంది.

ఈ రూల్ గురించి ట్విట్టర్‌లో పంచుకుంటూ జోరో సహ వ్యవస్థాపకుడు అభిషేక్ అస్థానా చాలా అసహనం వ్యక్తం చేశారు. "కొంతమంది వ్యాపార యజమానులు రాక్షసులుగా ప్రవర్తిస్తారు. లాభాలను కోరుకోవడం మంచిదే... కానీ ఉద్యోగులపై ఈ తరహా అపనమ్మకం ఉంటే దీర్ఘకాలంలో వారి కంపెనీ నామరూపాల్లేకుండా కనుమరుగవుతుంది." అని అభిషేక్ పేర్కొన్నారు.

కొంతమంది ట్విట్టర్ యూజర్లు ఈ ఆఫీస్ పాలసీని క్రూరమైనదిగా అభివర్ణిస్తున్నారు. భారతీయ కంపెనీలలో అధిక అట్రిషన్ రేటుకు ఇలాంటి రూల్సే కారణమని పేర్కొంటున్నారు. అయితే ఈ రూల్ తీసుకొచ్చిన కంపెనీ పేరేంటి? ఇది ఎక్కడ ఉంది? అనే వివరాలు మాత్రం తెలియరాలేదు. అయితే ఇలాంటి క్రూరమైన కంపెనీలు చాలానే ఉన్నాయని కొందరు ఉద్యోగులు తమ అనుభవాలను పంచుకుంటున్నారు.

"గత సంవత్సరం వరకు నేను ఓ ఆఫీసులో పని చేశాను. అక్కడ వారు పిగ్గీ బ్యాంక్ స్టార్ట్ చేశారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా.. ఉద్యోగి రూ.100 లేట్ ఫీజుగా ఆ పిగ్గీ బ్యాంక్‌లో వేయాల్సి ఉంటుంది. వారికి ఉద్యోగులపై ఉన్న నమ్మకమిది." అని ఒక యూజర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ రూల్‌ ప్రకారం ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయినా లేదా ఏదో ఒక పని పడి పది నిమిషాలు ఆలస్యంగా వస్తే రూ.1000 కోల్పోవాల్సిందే. ఇందుకు బదులు ఆ రోజు ఆఫీసుకు వెళ్లకపోవడమే నయం అని కొందరు రిప్లైలు కూడా ఇచ్చారు.

అయితే ఆఫీసు తెచ్చిన ఈ రూల్‌కు కొందరు వత్తాసు పలుకుతుండటం గమనార్హం. "స్కూల్‌లో 8 గంటలకల్లా ఉండాలంటే అక్కడ ఉండాల్సిందే. చిన్నప్పటి నుంచి ఈ పంక్చువాలిటీ మనందరం పాటిస్తున్నాం, కదా! మరి ఆఫీసులకు రావడానికి ఇబ్బంది ఏంటీ? ఆఫీస్ యాజమాన్యాలు కూడా ఆశించేది ఇదే" అని ఒకరు కామెంట్ చేశారు.

ఒక్క ఉద్యోగి ఆలస్యంగా వచ్చినా పనిభారం పెరుగుతుంది. ఇది మేనేజర్‌కు కూడా వర్తిస్తుందని ఇంకొందరు యాజమాన్యాలకే తమ సపోర్ట్ తెలిపారు. మరికొందరు మాత్రం ఫన్నీగా కామెంట్లు చేశారు. "ఆఫీస్ పెట్టిన రూల్ ప్రకారం, ఒక నిమిషం తొందరగా వస్తే పది నిమిషాలు ముందుగానే వెళ్లొచ్చా. అయితే నేను 10 నిమిషాలు ముందుగా వచ్చి గంట ముందే ఆఫీస్ నుంచి వెళ్లిపోతా" అని ఈ నిబంధన ఎంత అన్యాయంగా ఉందో ఒక యూజర్ అర్థమయ్యేలా చెప్పారు.

First published:

Tags: VIRAL NEWS, Work from office

ఉత్తమ కథలు