చుక్క లిక్కర్ కోసం.. కొండలు, కోనలు దాటుతున్న మందుబాబులు..

మద్యం కోసం కొండలు దాటుతున్న మందుబాబులు

కరోనా తీవ్రత దృష్ట్యా కేరళ రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ అమ్మకాలను నిషేధించింది. అయితే, కొందరు మందుబాబులు మద్యం కోసం పెద్ద సాహసమే చేస్తున్నారు.

  • Share this:
    మొన్నకి మొన్న వైన్ షాపులు తెరిస్తే గంటల తరబడి లైన్లో నిలబడటం చూశాం.. కన్నం పెట్టి మరీ లిక్కర్‌ను ఎత్తుకెళ్లిన దృశ్యాలను చూశాం.. అదే మందు కోసం కొందరు మందుబాబులు నదులు ఈదుతున్నారు.. వాగులు వంకలు దాటుతున్నారు.. కొండలు ఎక్కి దిగుతున్నారు.. అదెక్కడ అని అనుకుంటున్నారా? కర్ణాటక, కేరళ బోర్డర్‌లో. కేరళలో మద్యం అమ్మకాలకు అనుమతి లేదు. కరోనా తీవ్రత దృష్ట్యా ఆ రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ అమ్మకాలను నిషేధించింది. అయితే, కొందరు మందుబాబులు మద్యం కోసం పెద్ద సాహసమే చేస్తున్నారు. కర్ణాటక బోర్డర్‌లో ఉన్న వయనాడ్ జిల్లాకు చెందిన మందుబాబులు.. కొండలు, కోనలు దాటుకుంటూ కర్ణాటకకు వచ్చి మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. రోడ్డు మీదుగా వస్తే పోలీసులు పట్టుకుంటారని, కాబిని నది దాటుకుంటూ మైసూర్ జిల్లాలోని బవాలి గ్రామంలోకి వస్తున్నారు. ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. బవాలి అంటే గబ్బిలం అని అర్థం. కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైన అదే పక్షి.. ఇప్పుడు బవాలి ఊరికి వచ్చేలా చేసింది.

    మోటారు సైకిళ్ల మీద అడవులు దాటుతూ, కొండలు ఎక్కి దిగుతూ మద్యం కొనుక్కొని వెళ్తున్నారు. అయితే, ఈ తీరుపై బవాలి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వ్యాప్తికి అవకాశం ఉంటుందని భయపడుతున్నారు. కొందరు మందుబాబులను తిరిగి వెనక్కి పంపారు. మరికొందరి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మైసూరు జిల్లా యంత్రాంగం భద్రతను మరింత పెంచింది. అయినా, మందుబాబుల సాహసాలు ఆగడం లేదు. కేరళ మద్యానికి అనుమతి ఇస్తే తప్ప మందుబాబులను అదుపు చేయలేమని అంటున్నారు కర్ణాటక ప్రభుత్వాధికారులు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: