Home /News /trending /

FOOD DELIVERY APPS LIKE ZOMATO AND SWIGGY OFTEN COME WITH A SIDE OF CONTROVERSY AND HERE IS THE BEHIND STORIES GH SSR

Food delivery platforms: వివాదాల్లో చిక్కుకుంటున్న ఫుడ్ డెలివరీ సంస్థలు.. డెలివరీ సిబ్బందితో పాటు యాజమాన్యాలకూ తప్పని తలనొప్పి..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఫుడ్ డెలివరీ సంస్థలు తమ వ్యాపారాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటున్నాయి. స్విగ్గీ, జొమాటో వంటి పెద్ద కంపెనీలు పట్టణాలతో పాటు ద్వితీయ స్థాయి నగరాలకూ తమ సేవలను విస్తరించాయి. దీంతో సంస్థల పరిధి పెరగడంతో పాటు వివాదాలు కూడా ఎక్కువగానే చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల జొమాటో డెలివరీ బాయ్ తనపై...

ఇంకా చదవండి ...
ఫుడ్ డెలివరీ సంస్థలు తమ వ్యాపారాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటున్నాయి. స్విగ్గీ, జొమాటో వంటి పెద్ద కంపెనీలు పట్టణాలతో పాటు ద్వితీయ స్థాయి నగరాలకూ తమ సేవలను విస్తరించాయి. దీంతో సంస్థల పరిధి పెరగడంతో పాటు వివాదాలు కూడా ఎక్కువగానే చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల జొమాటో డెలివరీ బాయ్ తనపై దాడి చేశాడంటూ బెంగళూరుకు చెందని ఒక యువతి హల్‌ చల్ చేసింది. కానీ పోలీసుల దర్యాప్తులో ఇదంతా నిజం కాదని తేలింది. ఆమే తనపై దాడి చేసిందని బాధితుడు చెప్పాడు. ఆమె అబద్దపు ప్రచారం వల్ల తన ఉద్యోగం పోయిందని బాధితుడు వాపోయాడు. ఫుడ్ డెలివరీ సంస్థలకు ఇలాంటివి కొత్తేం కాదు. గతంలో ఎన్నోసార్లు డెలివరీ సిబ్బందికి, స్విగ్గీ, జొమాటో సంస్థల కస్టమర్లకు గొడవలు జరిగాయి. ఇవి కొన్నిసార్లు పెద్ద వివాదాలకు దారి తీశాయి. వాటిల్లో కొన్నింటిని పరిశీలిద్దాం.

* 2019 ఏప్రిల్‌లో బెంగళూరుకు చెందిన ఒక డెలివరీ బాయ్.. ఫుడ్ ఆర్డర్ చేసిన మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళకు స్విగ్గీ క్షమాపణ చెబుతూ, రూ.200 విలువచేసే కూపన్‌ను పంపించింది. ఈ ఘటనపై మళ్లీ వివాదం చెలరేగింది. దీంతో స్వీగ్గీ బాధితురాలికి ఫేస్‌బుక్‌లో క్షమాపణలు చెప్పింది. నిందితులపై చర్యలు తీసుకుంటామని సంస్థ హామీ ఇచ్చింది.

* 2019 ఫిబ్రవరిలో చెన్నైకి చెందిన ఒక వ్యక్తి స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. అతడికి డెలివరీ చేసిన ఆర్డర్‌లో రక్తంతో ఉన్న బ్యాండ్ ఎయిడ్ కనిపించింది. దీనిపై బాధితుడు స్విగ్గీకి ఫిర్యాదు చేసినా స్పందించలేదు. ఈ విషయం మీడియా ద్వారా వైరల్ కావడంతో స్విగ్గీ దిగివచ్చింది. ఇలాంటివి మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఫుడ్ డెలివరీ చేసిన రెస్టారెంట్‌ను తమ సర్వీస్ జాబితా నుంచి తొలగించడంతో పాటు బాధితుడికి క్షమాపణలు చెప్పింది.

* 2018 డిసెంబర్‌లో ఒక జొమాటో డెలివరీ బాయ్.. కస్టమర్ల ఆర్డర్ల నుంచి పదార్థాలను దొంగచాటుగా తింటున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీనిపై విచారణ జరిపిన సంస్థ.. మదురైకి చెందిన సదరు ఉద్యోగిని విధుల నుంచి తొలగించింది. ఫుడ్ పార్సిళ్లలో ఆహార పదార్థాలు తక్కువగా ఉన్నట్టు అనుమానం వస్తే తమకు ఫిర్యాదు చేయాలని జొమాటో కస్టమర్లను కోరింది. అయితే ఆ తర్వాత సదరు ఉద్యోగి క్యాన్సిల్ అయిన ఆర్టర్ తింటున్నట్లుగా తేలింది.

* 2017 జూన్‌లో బెంగళూరులోని ఒక ప్రైవేటు సంస్థకు చెందిన HR మేనేజర్‌పై స్విగ్గీ డెలివరీ బాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డెలివరీ ఆలస్యమైనందుకు తనను దూషించాడని స్విగ్గీ ఉద్యోగి ఫిర్యాదులో పేర్కొన్నాడు. మేనేజర్ కన్నడిగులను చులకన చేసి మాట్లాడని, మీరంతా సోమరిపోతులు అని తిట్టాడని తెలిపాడు. దీనిపై కన్నడ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

* 2019 ఫిబ్రవరిలో చెన్నైకి చెందిన ఒక వ్యక్తి స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఆర్డర్‌ను డెలివరీ సిబ్బంది పికప్ చేసుకున్నారని, మరో 12 నిమిషాల్లో డెలివరీ అవుతుందని నోటిఫికేషన్ వచ్చింది. ఎంతసేపటికీ డెలివరీ బాయ్ రాకపోవడంతో కస్టమర్ కేర్‌ను ఆశ్రయించాడు. చెన్నైలో చేసిన ఆర్డర్ రాజస్థాన్‌లో బుకింగ్ అయిందని సిబ్బంది చెప్పడంతో.. అతడు షాక్ అయ్యాడు. టెక్నికల్ సమస్యల వల్ల ఇలా జరిగిందని స్విగ్గీ వివరణ ఇచ్చింది.

* 2020 అక్టోబరులో గూగుల్.. స్విగ్గీ, జొమాటోలకు నోటీసులు జారీ చేసింది. అప్పుడు జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రమోషనల్ డిస్కౌంట్ క్యాంపెయిన్‌ను ఈ సంస్థలు నిర్వహిస్తున్నాయని గూగుల్ ఆరోపించింది. ఐపీఎల్‌లో ప్రెడిక్షన్ల ఆధారంగా కస్టమర్లకు స్విగ్గీ, జొమాటో డిస్కౌంట్లు ఇస్తున్నాయని గూగుల్ తెలిపింది. ఇది ప్లే స్టోర్ నియమాల ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంది.

* 2018 ఆగస్టులో దిల్లీకి చెందిన ఒక మహిళకు జొమాటో నుంచి చేసిన ఆర్డర్లో చనిపోయిన ఈగ కనిపించింది. ఈ విషయంపై కస్టమర్ కేర్‌తో మాట్లాడిన తరువాత ఆమె షాక్ అయ్యింది. ఆర్డర్‌లో ఎక్స్‌ట్రా టాపింగ్ అడగడంతో ఇలా జరిగి ఉండవచ్చని కస్టమర్ కేర్ సిబ్బంది సమాధానం ఇచ్చారు.

* 2020 జూన్‌లో కోల్‌కతాలోని జొమాటో ఫుడ్ డెలివరీ ఉద్యోగులు తమ కంపెనీ టీషర్టులు చింపి దహనం చేశారు. అప్పట్లో చైనా సైనికులు లద్దాఖ్‌లో 20 మంది భారత సైనికులను హతమార్చారు. దీంతో జొమాటో కంపెనీలో చైనా పెట్టుబడులు ఉన్నాయని సంస్థ ఉద్యోగులు ఆరోపించారు. జొమాటోలో ఫుడ్ ఆర్డర్లు ఇవ్వద్దని ప్రజలను కోరారు. చాలామంది సిబ్బంది జొమాటోలో ఉద్యోగాలను సైతం వదులుకున్నారు.

* 2020 మార్చిలో బెంగళూరుకు చెందిన జగదీశ్ అనే 25 ఏళ్ల జొమాటో డెలివరీ బాయ్‌పై ఒక రెస్టారెంట్ సిబ్బంది దాడి చేశారు. బుకింగ్ అయిన ఆర్డర్‌ను తీసుకెళ్లేందుకు 20 నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు రెస్టారెంట్ నిర్వాహకులు దాడి చేశారు. ఈ ప్రమాదంలో జగదీశ్ వెన్నెముక విరిగిపోయింది.

ఫుడ్ డెలివరీ సంస్థలు ఇతర ఉద్యోగులతో పోలిస్తే డెలివరీ సిబ్బందికి విలువ ఇవ్వట్లేదని న్యూస్ 18 సంస్థ 2018లో నిర్వహించిన అధ్యయనంలో తేలింది. వారికి కంపెనీలు మద్దతు ఇవ్వట్లేదు. నిర్ణీత సమయంలో ఆర్డర్లు డెలివరీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఫలితంగా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో పాటు వీరు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఈ నివేదిక పేర్కొంది.
First published:

Tags: Swiggy, Zomato

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు