Home /News /trending /

FOOD CRISIS NO MORE FOOD AFTER 27 YEARS PREDICTION SCIENTISTS WARN FULL DETAILS HERE GH VB

After 27 Years: అవునా..! ఇది నిజమేనా..? 27 ఏళ్ల తర్వాత ఇలా జరుగుతుందా..? విషయం ఏంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కేవలం 27 ఏళ్లలోనే మోగనున్నాయని తాజాగా ప్రముఖ సైంటిస్టులు (Scientists) చెప్పి అందరినీ నిర్ఘాంతపరిచారు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఆకలితో అల్లాడిపోతారని డూమ్స్‌డే కౌంట్‌డౌన్ (Doomsday Countdown) ప్రకారం హెచ్చరికను జారీ చేశారు శాస్త్రవేత్తలు.

ఇంకా చదవండి ...
భవిష్యత్తులో యావత్ ప్రపంచం ఆహార సంక్షోభం (Food Crisis)తో అల్లాడనుందా? అని అడిగితే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. శీతోష్ణస్థితి సంక్షోభం, వాతావరణ మార్పులు, వరదలు, కరువులు వంటి పరిస్థితులు మన భవిష్యత్తు తరాలపై (Future Generation) తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని అందరూ ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. గత కొన్ని ఏళ్లుగా వాతావరణం విపరీతంగా వేడెక్కుతోంది. మంచుకొండలు కరిగిపోతున్నాయి. అనేక జంతువులు అంతరించిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆహార కొరత ప్రమాదఘంటికలు కేవలం 27 ఏళ్లలోనే మోగనున్నాయని తాజాగా ప్రముఖ సైంటిస్టులు (Scientists) చెప్పి అందరినీ నిర్ఘాంతపరిచారు. కేవలం రెండు దశాబ్దాలలో గుప్పెడు మెతుకులు కూడా దొరకక ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఆకలితో అల్లాడిపోతారని డూమ్స్‌డే కౌంట్‌డౌన్ (Doomsday Countdown) ప్రకారం హెచ్చరికను జారీ చేశారు శాస్త్రవేత్తలు.

USA-Ukraine: ఉక్రెయిన్ కు పెరుగుతున్న మద్దతు.. ‘ఫీనిక్స్ ఘోస్ట్’ డ్రోన్లను అందించనున్న అమెరికా..


ఇప్పటినుంచి కేవలం 27 ఏళ్లలో ఈ భూప్రపంచం పూర్తిగా ఆహార సంక్షోభంలో చిక్కుకుపోతుందని (Completely Run Out Of Food) శాస్త్రవేత్తలు ఇప్పుడు మనల్ని హెచ్చరిస్తున్నారు. అంటే మనమందరం ఆహార సంక్షోభం వైపు వెళ్తున్నామని దీనర్థం. సైంటిస్టులు ఇప్పటికే ప్రపంచ ఉనికి చివరి రోజుని లేదా డూమ్స్‌డే కౌంట్‌డౌన్‌ను ప్రారంభించారు. బులెటిన్ సైన్స్ అండ్ సెక్యూరిటీ బోర్డ్ శాస్త్రవేత్తలు ఈ డూమ్స్‌డే కౌంట్‌డౌన్‌ను అంచనా వేస్తారు. దీని ప్రకారం, కంప్లీట్ ఫుడ్ క్రైసిస్ (Food Crisis)కి ఆదివారం (ఏప్రిల్ 24, 2022) నుంచి సరిగ్గా 27 సంవత్సరాల 251 రోజులు మిగిలి ఉన్నాయని శాస్త్రవేత్తలు వివరించారు.

ప్రస్తుత మానవ అవసరాలను తీర్చడానికి భూమికి రెండు గ్రహాల అవసరం ఉందని సోషియోబయాలజిస్ట్ ఎడ్వర్డ్ విల్సన్ పేర్కొన్నారు. “మానవాళికి ఆహారం అందించడంలో భూమి సామర్థ్యానికి పరిమితులు ఉన్నాయి. గ్రహం మీద ఉన్న ప్రతి ఒక్కరూ శాఖాహారులుగా మారడానికి అంగీకరించినప్పటికీ, ప్రపంచంలోని వ్యవసాయ భూమి ఆ అవసరాన్ని తీర్చేంత సామర్థ్యాన్ని కలిగి లేదు. ప్రపంచ జనాభాకి తిండి పెట్టడం మరింత కష్టంగా మారుతుంది. అప్పటికి, భూ గ్రహం మీద దాదాపు 10 బిలియన్ల మంది అంటే వెయ్యి కోట్ల మంది జనాభా ఉంటారు. 2017లో మనకు అవసరమైన దానితో పోలిస్తే ఆహార డిమాండ్ 70% పెరిగింది." అని ఎడ్వర్డ్ చెప్పుకొచ్చారు.

"భూమి ఎంత మందికి ఆహారం ఇవ్వగలదు అనే పరిమితి గరిష్టంగా 10 బిలియన్లకు సెట్ చేయడం జరిగింది. బయోస్పియర్ (Biosphere) పరిమితులు కూడా ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నాయి. భూమి ఉపరితలం ప్రజలకు ఆహారం అందించే సామర్థ్యం కలిగి లేదు." అని ఎడ్వర్డ్ పేర్కొన్నారు. ప్రతిరోజూ అధిక మొత్తంలో ఆహారం ఎలా వృథా అవుతుందో కూడా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దానితో పాటు, పెరుగుతున్న జనాభా ప్రతి ఒక్కరికీ ప్రతిరోజూ ఉత్పత్తి చేసే ఆహారం కంటే చాలా ఎక్కువ అని తెలిపారు.

Shocking : వీడు మనిషి కాదు..భార్య,మరదలిని చంపి..రోజూ వచ్చి మృతదేహాలను..

విపత్తులపై పుస్తకాలు రాసిన ప్రొఫెసర్ జూలియన్ క్రిబ్ మాట్లాడుతూ... “ఇది ప్రపంచ ఆహార సంక్షోభం.. నేను దాని నుండి బయటపడగలనని నేను అనుకోను. ఇది వాతావరణ మార్పుల కంటే వేగంగా ముంచుకొస్తోంది. “జనాభా, ఆర్థిక వృద్ధిలో పెరిగిన డిమాండ్‌తో కలిపి నీరు, భూమి, శక్తి కొరత ఏర్పడి అది 2050 నాటికి ప్రపంచ ఆహార కొరతను సృష్టిస్తుంది." అని విశ్లేషించారు. మానవులకు ఆహారం అందించాలంటే ఆహారోత్పత్తి రెట్టింపు కావాలని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గత 8,000 సంవత్సరాలలో ఉత్పత్తి చేసిన దానికంటే రాబోయే 40 ఏళ్లలో మనం ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేయవలసి ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఆహార ధరల ద్రవ్యోల్బణానికి కూడా ఇదే కారణమని స్పష్టమవుతోంది. శాస్త్రవేత్తలు వేసిన ఈ అంచనాలు ఇప్పుడు అందరిలో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. మరి ఆహార సంక్షోభం నుంచి ప్రపంచం ఎలా గట్టెక్కుతుందో చూడాలి.
Published by:Veera Babu
First published:

Tags: Countdown, Doomsday, Earth, Food crisis, Scientists

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు