photoshoot at funeral: తండ్రి శవం పక్కనే సెక్సీ ఫొటో షూట్ -నువ్వసలు మనిషివేనా?

శవపేటికతో జేన్ పోజులు

ఇంట్లోవాళ్లు చనిపోతే ఎవరైనా ఏడుస్తారు.. కొందరు ఏడవకున్నా లోలోపలే కుమిలిపోతారు.. జ్ఞాపకాల తడి ఆరేదాకా సరిగా నవ్వలేరు కూాడా. అలాంటిది ఈ అమ్మాయి తండ్రి చావును ఓ పబ్లిసిటీ ఈవెంట్ గా మలచుకుంది.. నాన్న శవం పక్కనే సెక్సీ పొజులతో ఫొటోషూట్ చేసింది. చివరికి..

  • Share this:
రూపం, మాట, బంధాలు, బంధుత్వాలు, జీవన విధానాలు, ఆహార, పని సంస్కృతుల్లో తేడాలు ఉండొచ్చేమోగానీ మనిషి జాతికి సంబంధించి కొన్ని ఫీలింగ్స్ యూనివర్సల్. ఓ కొత్త మనిషి భూమ్మీద పురుడుపోసుకోవడం ఏమూలనైనా సంతోషాన్నిస్తుంది.. అదే ఒక మనిషి చావు ఎవరికైనా విషాదాన్ని తలపిస్తుంది. చనిపోయింది మన కుటుంబీకుడైతే ఆ బాధ వర్ణనాతీతం. కానీ ఈ ఫొటోలోని పడతి మాత్రం ఈ సోకాల్డ్ శోకాలకు బద్ధ విరుద్ధం. పక్కవాళ్ల చావు పట్ల ఆమెకంటూ సొంత ఫిలాసఫీ ఉంది. అదే ఇప్పుడామెను చిక్కుల్లోకి నెట్టేసింది..

ఈ ఫొటోల్లోని అమ్మడి పేరు జేన్ రివేరా. వయసు 20.  తండ్రి శవం పక్కనే సెక్సీగా పోజులిస్తూ ఫొటోషూట్ చేసి, వాటిని సోషల్ మీడియలో పోస్ట్ చేసి గ్లోబల్ గా విమర్శలపాలైంది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మియామీ సిటీకి చెందిన ఈ యువతి తండ్రి ఆర్మీలో పనిచేసి చాలా కాలం కిందటే రిటైరయ్యారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ మొన్న సోమవారం కన్నుమూశారాయన. ఉన్నదాంట్లో ఘనంగానే అంత్యక్రియలు జరిపించారు. కానీ తుదివీడ్కోలు ఘట్టంలో జేన్ చేసిన పనినే అందరూ అసహ్యించుకుంటున్నారు. తండ్రి శవం పక్కన సెక్సీగా ఫొటో షూట్ చేసిన నువ్వు అసలు మనిషివేనా? అని నెటిజన్లు జేన్ ను తిట్టిపోస్తున్నారు.

జేన్ రివేరా


జేన్ రివెరా ఇప్పటికే సోషల్ మీడియా స్టార్ గా గుర్తింపు పొందింది. మోడలింగ్, ఫ్యాషన్ దుస్తులు, స్విమ్ సూట్ లో ఫొటోలతో విపరీతమైన క్రేజ్ సంపాదించింది. ఇన్ స్టాగ్రామ్ లో 84వేల మంది, టిక్ టాక్ లో 3లక్షల మంది ఫాలోవర్లున్నారామెకు. తన జీవితానికి సంబంధించి అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు ఫాలోవర్లతో పంచుకునే ఆమె.. ఇలా సడెన్ గా చనిపోయిన తండ్రి శవం పక్కన ఫొటోషూట్ చేయడాన్ని మాత్రం ఫాలోవర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. జేన్ మాత్రం తాను చేసినదాంట్లో తప్పేముందని ఎదురుప్రశ్నిస్తోంది..

సోషల్ స్టార్ జేన్ రివేరా


తండ్రి శవం ముందు ఫొటోషూట్ చిత్రాలను ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ #dadless అనే హ్యాష్‌ట్యాగ్‌‌తో జేన్ ఇలా రాసింది..‘సీతాకోకచిలుక ఎగిరిపోతుంది.. నాన్నా.. నీ ఆత్మకు శాంతి కలగాలి.. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్..’అని సీతాకోకచిలుక ఎగిరిపోతుంది. రెస్ట్ ఇన్ పీస్ నాన్న. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్’’. శవం పక్కనే ఫొటో షూట్ వివాదాస్పదం కావడం, లక్షకొద్దీ కామెంట్లు వస్తుండటంతో తాత్కాలికంగా ఆమె అకౌంట్ ను క్లోజ్ చేసింది. ఆమెను వెంటాడుతూ వెళ్లిన కొందరికి మాత్రం సావధానంగా సమాధానాలు చెబుతోందట.. నాన్నంటే తనకు చాలా ఇష్టమని, మోడలింగ్ లో రాణించాలని ఎప్పుడూ దీవించేవారని, ఆయన లేని లోటును ఫీలవ్వకుండా ఉండేందుకే #dadless కాన్సెప్ట్ తో ఫొటో షూట్ చేశానని జేన్ రివేరా చెబుతోంది. ఆమె వివరణతో మీరు ఏకీభవిస్తారా?
Published by:Madhu Kota
First published: