‘కరోనా’ లోన్ తీసుకుని కాస్ట్‌లీ కారు కొనుక్కున్న మేధావి..

కరోనా సమయంలో కేంద్రం ఇచ్చే రుణం కోసం భారీ ఎత్తున దరఖాస్తు చేశాడు.

news18-telugu
Updated: July 29, 2020, 2:41 PM IST
‘కరోనా’ లోన్ తీసుకుని కాస్ట్‌లీ కారు కొనుక్కున్న మేధావి..
లాంబోర్గిని (File: Image;NYPost)
  • Share this:
ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల చాలా ఉద్యోగాలు పోయాయి. చాలా కంపెనీలు కూడా మూతపడే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో ఆయా దేశాలు ఉద్యోగులను, వ్యాపారులను ఆదుకోవడానికి కొత్త కొత్త పథకాలను తీసుకొస్తున్నాయి. భారత ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ పేరుతో వ్యాపారవర్గాల కోసం లోన్లు ప్రకటించింది. అలాగే, అమెరికాలో కూడా కరోనా మహమ్మారి సమయంలో వ్యాపారులను ఆదుకోవడానికి, ఆ వ్యాపారులు తమ వద్ద పనిచేసే ఉద్యోగులకు కొంత ఆర్థిక సాయం లేదా, జీతాలు చెల్లించడానికి రుణాలు అందిస్తున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకున్న ఓ వ్యక్తి భారీ ప్లాన్ వేశాడు. కరోనా సమయంలో కేంద్రం ఇచ్చే రుణం కోసం భారీ ఎత్తున దరఖాస్తు చేశాడు. సుమారు 13 మిలియన్ డాలర్లు దరఖాస్తు చేస్తే.. అతడి కంపెనీ, స్థాయిని బట్టి స్థానిక బ్యాంకులు 3.9 మిలియన్ డాలర్లు అప్రూవ్ చేశాయి. అయితే, ఆ డబ్బులను కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు జీతాలు చెల్లించాల్సిన వ్యాపారి.. వాటితో ఏకంగా లోంబార్గిని కారు కొనుక్కున్నాడు. అందులో ఎంచక్కా బీచ్‌కి వెళ్లి అమ్మాయిలతో ముద్దులు, ముచ్చట్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేశాడు. ఈ ఘటన దక్షిణ ఫ్లోరిడాలో వెలుగుచూసింది. బ్యాంకు వాళ్లకి అనుమానం వచ్చి చెక్ చేయగా... ఈ మేధావి డబ్బులు తీసుకుని కారు కొనుక్కున్నట్టు తేలింది. ఆ వ్యక్తిని అరెస్టు చేసి కారును కూడా సీజ్ చేశారు. మూడునాళ్ల ముచ్చట కూడా తీరకుండానే ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నాడు.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 29, 2020, 2:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading