news18
Updated: November 23, 2020, 8:46 PM IST
image credits Twitter
- News18
- Last Updated:
November 23, 2020, 8:46 PM IST
మనుషులతో స్నేహభావంతో మెలిగే కుక్కలు అత్యంత విశ్వాసం ఉన్న జంతువులుగా పరిగణించబడుతాయి. అందుకే ఎక్కువ మంది తమ ఇళ్లలో ఇతర జంతువుల కంటే కుక్కలను పెంచడానికే ఇష్టపడుతుంటారు. పెంపుడు కుక్కలు యజమానిపై చూపించే విశ్వాసంపై ఇదివరకే ఎన్నో ఘటనలను చూశాం. అయితే మనుషులు కూడా పెంపుడు జంతువులపై అత్యంత నమ్మకాన్ని ప్రదర్శిస్తుంటాయి. అటువంటి సంఘటనే జరిగింది అమెరికాలోని ఫ్లోరిడా నగరంలో. ఒక వృద్ధుడు తన పెంపుడు కుక్కను కాపాడుకోవడానికి ప్రాణాలకు తెగించి మరీ.. కొట్లాడాడు. ఆయన కొట్లాడింది మాములు జంతువు కాదండోయ్...! అత్యంత క్రూరమైన మొసలితో...
వివరాల్లోకి వెళ్తే ఫ్లోరిడాలో నివసించే 74 ఏళ్ల రిచర్డ్ విల్బ్యాంక్స్ అనే వృద్ధుడు గన్నర్ అనే ఒక కుక్కను పెంచుకుంటున్నాడు. అయితే, అనుకోకుండా ఆ కుక్క మొసలి చరలో చిక్కుకుంది. ఆ సమయంలో ఆయన కుర్చీలొ కూర్చొని సేదతీరుతురుతున్నాడు. మొసలి చరలో ఉన్న కుక్క పెద్ద శబ్ధం చేయడంతో రిచర్డ్ వెంటనే తన కుర్చీ లోంచి లేచి గన్నర్ ను రక్షించడానికి నీటి వైపునకు పరిగెత్తాడు. బేబీ మొసలి దవడను తెరిచి పెంపుడు జంతువును కాపాడాడు.
కాగా, ఫ్లోరిడా వైల్డ్‌లైఫ్ ఫెడరేషన్ కు చెందిన నిఘా కెమెరాలు ఈ మొత్తం ఘటనను రికార్డ్ చేశాయి. ఇప్పుడు ఈ వీడియో ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. ఈ వీటియో ట్విట్టర్ వేదికపై వైరల్ అవ్వగా.. పెంపుడు కుక్కను కాపాడటానికి రిచర్డ్ చూపిన ధైర్య సాహసాలను మెచ్చుకుంటూ ఎఫ్డబ్ల్యుఎఫ్, ఎఫ్స్టాప్ ఫౌండేషన్లు ప్రజల్లో అవగాహన పెంచడానికి ఆయన సహాయం తీసుకోనున్నట్లు ప్రకటించాయి.
ఫౌండేషన్ చైర్మన్ విలియం ఫ్రాయిండ్ మాట్లాడుతూ ‘‘వన్యప్రాణులను ఎలా కాపాడాలో ప్రజలు అర్థం చేసుకుంటే, సానుకూల ఫలితాలు వస్తాయి. మొసళ్లు ఉన్న ప్రాంతాల్లో పెంపుడు జంతువుల యజమానులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. ఈ సంఘటనలో- రిచర్డ్, గన్నర్, మొసలి సురక్షితంగా ఉన్నారని తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పెంపుడు కుక్కలను కాపాడే విషయంలో రిచర్డ్ సేవలను వినియోగించుకుంటాం.’’ అని అన్నాడు.
కాగా ట్విట్టర్లో షేర్ అయిన ఈ వీడియో వైరల్ గా మారింది. దీంతో ట్విట్టర్ వేదికగా అనేక మంది ఫాలోవర్లు రిచర్డ్ ధైర్యసాహసాలను మెచ్చుకున్నారు. గన్నర్ ను కాపాడే సందర్భంలోనూ రిచర్డ్ తన నోటిలోని సిగరెట్ ను వదలకపోవడం అందరినీ ఆకట్టుకుంది. అది రిచర్డ్ రాయల్టీకి నిదర్శనమని చాలా మంది ట్విట్టర్ ఫాలోవర్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
తన పెంపుడు కుక్క గన్నర్ కోసం రిచర్డ్ చూపిన ధైర్య సాహసాలను అనేక మంది మెచ్చుకున్నారు. నిజమైన పురుషుడు ఎలా ఉంటాడో రిచర్డ్ నిరూపించాడు అని ఒక మహిళ వ్యాఖ్యానించగా, మరో ట్విట్టర్ వ్యాఖ్యాత తన కుక్కల చిత్రాలను పంచుకుంటూ రిచర్డ్, గన్నర్ ఇద్దరూ సురక్షితంగా ఉండటం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.
Published by:
Srinivas Munigala
First published:
November 23, 2020, 8:46 PM IST