• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • FLORIDA MAN CATCHES FISH WITH HUMAN LIKE TEETH PICTURES GO VIRAL SU GH

Fish With Human like Teeth: మానవ దంతాలను పోలిన వింతైన చేప.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

Fish With Human like Teeth: మానవ దంతాలను పోలిన వింతైన చేప.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

ప్రతీకాత్మక చిత్రం(Image source-Youtube)

సాధారణంగా చేపల గురించి అవగాహన ఉన్నవారికి చాలా రకాల చేపల గురించి తెలిసే ఉంటుంది. కానీ, సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు కొన్ని అరుదైన చేపలు దొరుకుతుంటాయి.

  • Share this:
సాధారణంగా చేపల గురించి అవగాహన ఉన్నవారికి చాలా రకాల చేపల గురించి తెలిసే ఉంటుంది. కానీ, సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు కొన్ని అరుదైన చేపలు దొరుకుతుంటాయి. అలాంటి చేపల గురించి ఎక్కువ మందికి తెలిసి ఉండదు. వీటికి మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. అమెరికాలోని ఒక మత్స్యకారుడికి కూడా అలాంటి అరుదైన చేపే ఒకటి దొరికింది. ఇప్పుడు ఆ చేపకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని ఫ్లోరిడాకి చెందిన పాల్ అనే మత్స్యకారుడు ఒర్లాండో సమీపంలో గల సముద్రంలో వేటకు వెళ్లాడు. అతను సముద్రంలోకి వల వేయగా అతని గాలానికి ఒక వింతైన చేప చిక్కింది. ఆ చేపను పైకి లాగి చూస్తే ఒక్కసారిగా షాకయ్యాడు. ఎందుకంటే, ఆ చేప గొర్రెని పోలిన తల, మనిషిని పోలిన దంతాలను కలిగి ఉండటం విశేషం. దాని నోరు తెరిచి చూడగా దాని దంతాలు అచ్చం మనిషిని పోలిన విధంగా ఉండటంతో ఆశ్చర్యపోయాడు.అంతేకాక, ఆ చేప శరీరంపై జీబ్రా మాదిరి గీతలను కలిగి ఉండటంతో ఒక్కసారిగా భయానికి లోనయ్యాడు.

ఈ వింత అనుభవం గురించి పాల్ మాట్లాడుతూ "మానవ దంతాలను పోలి ఉన్న చేపను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. దాని దంతాలు మరింతగా పరిశీలించగా అనేక విషయాలు తెలిసోచ్చాయి. దాని దంతాల వరుసలు షార్క్ లాగా ఉన్నాయి. ఆ దంతాలు చాలా వరకు రెండు మూడు వరుసలతో ఉన్నాయి. అంతేకాక, దాని దంతాలు చాలా బలమైన కాటు వేసే శక్తిని కలిగి ఉన్నాయి. ఇలాంటి వింతైన చేప రూపాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. నేను చూసిన విచిత్రమైన చేపలలో ఒకటి. ఈ చేపలు వాటి దంతాలను బార్నాకిల్స్, ఆల్చిప్పలు, పీతల శరీరంలోని గట్టి భాగాలను విచ్ఛిన్నం చేయడానికి ఉపయోగిస్తాయి. ఈ చేపలు ప్రధానంగా క్రస్టేసియన్లను తింటుంటాయి. కాబట్టి, వాటిని తెరవడానికి ఈ రకమైన దంతాలు చాలా అవసరం." అని పాల్ వివరించారు.

ఇటువంటి చేపలు సర్వసాధారణం..
కాగా, ఇటువంటి వింతైన చేపలు కన్పించడం ఇది మొదటిసారేమీ కాదు. అమెరికా, గల్ఫ్, అట్లాంటిక్ తీరాల్లో ఈ చేపలు దొరకడం సర్వ సాధారణం. గత సంవత్సరం, మలేషియాలో ఇటువంటి అరుదైన చేపే ఒకటి దొరికింది. 'మనిషి లాంటి' లక్షణాలతో ఉన్న ఈ చేప ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ చేప దంతాలు, పెదవులు అచ్చం మనిషిని పోలిన విధంగా ఉండటం నెటిజన్లను ఆశ్చర్యపర్చింది. అయితే, ఈ చేప ఫోటోలు నకిలీవని ఒక పర్యావరణ శాస్త్రవేత్త అభిప్రాయపడ్డారు. ఏదేమైనప్పటికీ, మనిషి దంతాలను పోలిన చేప నెటిజన్లను తెగ ఆకర్షించింది.
Published by:Sumanth Kanukula
First published: