నీళ్లలోని మొసలి(crocodile) నిగిడి ఏనుగును పట్టు.. బయట కుక్క చేత భంగపడును అని వేమన పద్యం అందరూ చదివే ఉంటారు. మొసలి నీటిలో కింగ్. దాన్ని ఓడించే మరో జంతువు ఎక్కువగా ఉండదు. భూమిపై కంటే నీటిలోనే మొసలికి బలం ఎక్కువగా ఉంటుంది. అయితే మొసలి వేటాడటం ఎలా ఉంటుంది అనే విషయాన్ని చూపించేలా ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు కూడా వైరల్(viral) గా మారిపోయాయి. మొసలి క్షణాల సమయంలో వేటాడే తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. అయితే ఈసారి కూడా కేవలం కనురెప్ప కాలం లో ముసలి వేటాడింది. కానీ వేటాడింది జంతువుల్ని కాదు మనిషి తయారుచేసిన డ్రోన్(Drone)ని. సాధారణంగా అడవుల్లో డ్రోన్ల సహాయంతో ఇక పక్షులు ఎలా ఎగురుతాయి.. పరిసరాలు ఎలా ఉన్నాయి అన్న విషయాన్ని చిత్రీకరించడం(shoot) చూస్తూ ఉంటాం. ఇక్కడ కొంత మంది ఇలాగే చిత్రీకరించాలని ప్రయత్నించారు. కానీ ఇక ఎగురుతున్న డ్రోన్ ను పక్షి అనుకున్న మొసలి(alligator) లటుక్కున నోట్లో పట్టేసింది. అయితే ఆ తర్వాత జరిగిన సంఘటన ఒల్లు గగుర్పుడిచేలా చేసింది. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్(viral in social media) అవుతోంది.
సుందర్ పిచాయ్ రీ ట్వీట్..
డ్రోన్ తినేసిన మొసలి నోట్లో నుంచి పొగలు కక్కుతోంది.. ఈ వీడియోను గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ (sunder Pichai) తన ట్విట్టర్(twitter) అకౌంట్లో షేర్ చేశారు. ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది. మొసలికి దగ్గరగా తక్కువ ఎత్తులో ఎగురుతున్న డ్రోన్‌ను అమాంతం ఒడిసిపట్టింది. నమిలి మింగేస్తుండగా.. మొసలి నోట్లో(mouth) నుంచి పొగలు కక్కడాన్ని వీడియోలో చూడొచ్చు. గూగుల్ బ్లాగ్ పోస్ట్‌లను షేర్ చేయడం.. కంపెనీ తాజా ప్రొడక్టుల గురించి అప్‌డేట్‌లు, పండుగలకు శుభాకాంక్షలు తెలుపుతుంటారు మన సుందర్ పిచాయ్.. ట్విటర్ లో యాక్టివ్ గా ఉంటూ తనకు కనిపించిన ఏదైనా ఆసక్తికరమైన స్టోరీలను వెంటనే ఆయన రీట్వీట్ చేస్తుంటారు.
ఫ్లోరిడాలో రికార్డు..
ఆ వీడియోను ఫ్లోరిడా(Florida)లో రికార్డు చేశారు. కాలిఫోర్నియాకు చెందిన డ్రోన్ కంపెనీ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ క్రిస్ ఆండర్సన్(chris Anderson) ఈ ఫుటేజీని ముందుగా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆ తర్వాత పిచాయ్ తన ట్విట్టర్ అకౌంట్లో ఈ వీడియోను రీట్వీట్ చేశారు. డ్రోన్ సాయంతో జార్జ్ (George) అనే మొసలిని దగ్గర నుంచి వీడియో(video) తీసేందుకు ప్రయత్నించారు కొంతమంది. మరి తన దగ్గర ఏదో తిరుగతుంటే మన మొసలి ఊరుకుంటుందా. తన నోటితో డ్రోన్‌ను గట్టిగా పట్టేసుకుంది. డ్రోన్ ను గట్టిగా కొరికివేయడంతో అందులో నుంచి పొగలు వచ్చాయి. మొసలి నోరు(mouth) తెరిచిందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని డ్రోన్ ఆపరేటర్ పోస్టులో చెప్పుకొచ్చాడు.
Alligator snatches drone out of the air and it promptly catches fire in its mouth https://t.co/vDfidrrhsz
— Chris Anderson (@chr1sa) September 1, 2021
అయితే ఈ వీడియో చూసి చాలా మంది ట్విట్టర్ యూజర్లు మండిపడ్డారు. జంతువుల విషయంలో డ్రోన్ల వాడకాన్ని కఠినంగా నియంత్రించాలని కోరారు. మరో నెటిజన్ స్పందిస్తూ.. ఈ చర్యను క్రూరమైనదని.. విచారకరమైనదని ధ్వజమెత్తాడు. ఇలాంటి చర్యలకు పాల్పడేవారికి జరిమానా విధించాలని మరో నెటిజన్ మండిపడ్డారు. సుందర్ పిచాయ్ క్లిప్‌ను రీ ట్వీట్ చేయడంతో సంతోషించానని మరో యూజర్ చెప్పాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Caught in fishing crocodile, Drones, Netizen, Sunder Pichai, Tweets, Viral Video