Viral News: చేప కడుపులో తాబేలు.. వైరల్‌గా మారిన ఫేస్‌బుక్ పోస్ట్.. అసలు ఎలా గుర్తించారో తెలుసా..?

Photo Credit: Facebook

కొన్ని వార్తలు వింటుంటే అవి నిజమేనా అని అనిపిస్తోంది. అలాంటి వింత వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  • Share this:
    కొన్ని వార్తలు వింటుంటే అవి నిజమేనా అని అనిపిస్తోంది. అలాంటి వింత వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్రతికున్న చేప కడుపులో ఓ తాబేలు జీవ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. పెద్ద నోరు ఉన్న చేప కడుపులో అసాధారణంగా ఓ తాబేలును గుర్తించిన బయోలజిస్టులు.. అది సజీవంగానే ఉన్నట్టుగా నిర్దారించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఫ్లోరిడాలోని FWC Fish and Wildlife Research Centre ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. ఈ ఆశ్చర్యకరమైన విషయాన్ని ఎలా గుర్తించామో కూడా చెప్పుకొచ్చింది. ఫిష్‌ అండ్‌ వైల్డ్‌ లైఫ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ బయోలజిస్టులు కొద్ది రోజుల క్రితం ఓ చెరువులో లార్జ్‌మౌత్‌ బాష్‌ చేపను పట్టుకున్నారు. అనంతరం దాన్ని ల్యాబ్‌కు తెచ్చి పరిశోధనలు ప్రారంభించారు.

    ఈ క్రమంలోనే బయోలజిస్టులు దాని లింగ నిర్ధారణ పరీక్షలు చేయాలనుకున్నారు. ఆ సమయంలో చేప కడుపులో ఏదో కదులుతున్నట్టుగా వారు గుర్తించారు. దీంతో చేప నోటిని తెరిచి చూడగా.. ఓ తాబేలు ఉన్నట్టుగా కనుగొన్నారు. ఆ తర్వాత దానిని అతి జాగ్రత్తగా బయటకు తీశారు. ఇలాంటి ఘటనలు సాధారణంగా జరగవని బయోలజిస్ట్‌లు అన్నారు.


    అనంతరం ఆ తాబేలును సమీపంలోని నీటి ప్రవాహం వద్ద విడిచి పెట్టారు. ఇప్పుడు ఈ పోస్ట్ కేవలం ఫేస్‌బుక్‌లోనే కాకుడా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కూడా వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇంకా ఆ తాబేలుకు భూమి మీద నూకలు ఉణ్నాయని పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు.
    Published by:Sumanth Kanukula
    First published: