Flight Door Opened Mid Air : గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో విమానం డోర్(FLIGHT DOOR) సడెన్ గా తెరుచుకుంది. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో విమానంలో ప్రయాణికులందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏమైందోనని కంగారు పడ్డారు. వెంటే ఇద్దరు ప్యాసింజర్లు ఆ డోరు పూర్తిగా తెరుచుకోకుండా లాగి పట్టుకున్నరు. ఫ్లైట్ ల్యాండ్ అయ్యేదాకా దాదాపు 20 నిమిషాల పాటు అలాగే నిలబడ్డారు. ప్యాసింజర్లు(PASSENGERS) డోరును పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బ్రెజిల్(BRAZIL)లోని జోర్డావో నుంచి అదే దేశంలోని రియో బ్రాంకోకు ప్యాసింజర్లతో ఓ విమానం బయలుదేరింది. విమానంలోని ప్యాసింజర్లందరూ హాయిగా రిలాక్స్ అయ్యారు. అయితే ఇంతలో ఉన్నట్లుండి సడెన్ గా ఫ్లైట్ డోరుకు ఉన్న హ్యాండిల్ ఊడిపోవడంతో తలుపు దానంతటదే తెరుచుకుంది. డోరు నుంచి ఊడిపోయిన హ్యాండిల్.. ఫ్లైట్ కు లెఫ్ట్ సైడ్ ఉన్న ఇంజన్ రెక్కలకు తాకింది. సపోర్ట్ కేబుల్స్ తెగిపోవడంతో డోర్ తెరుచుకుంది. దీంతో అందరూ భయపడిపోయారు. ఏం జరుగుతోంది అంటూ తెగ టెన్షన్ పడ్డారు. ఓరి భగవంతుడా మేం అసలు సేష్ గా ల్యాండ్ అవుతామా లేదా అని గుండెలు చేతుల్లో పట్టుకొని సీట్లకు అతక్కపోయారు.
అయితే ఇద్దరు ప్రయాణికులు మాత్రం వెంటనే తమ సీట్లలో నుంచి లేచి ఆ డోరు పూర్తిగా తెరుచుకోకుండా లాగి పట్టుకున్నరు. ఫ్లైట్ ల్యాండ్ అయ్యేదాకా దాదాపు 20 నిమిషాల పాటు అలాగే నిలబడ్డారు. ప్యాసెంజర్లు డోరును పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఏప్రిల్-14న జరగగా ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.