విండోసీట్ కావాలని విసిగించిన ప్రయాణికుడికి బొమ్మ చూపించింది...

విమానంలో విండోసీట్ కావాలని ఎయిర్ హోస్టెస్‌ను విసిగించిన ప్రయాణికుడు... ఫ్లైట్ అసిస్టెంట్ ఇచ్చిన స్వీట్ పంచ్‌కు సోషల్ మీడియా ఫిదా... ఫోటోలు వైరల్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: November 16, 2018, 4:46 PM IST
విండోసీట్ కావాలని విసిగించిన ప్రయాణికుడికి బొమ్మ చూపించింది...
నమూనా చిత్రం
  • Share this:
బస్సులో ప్రయాణించేటప్పుడు విండోసీట్ కావాలని కోరుకుంటున్నారు చాలామంది ప్రయాణికులు. పిల్లలైతే విండో సీట్ కోసం కొట్టుకుంటుంటారు కూడా. అయితే విమానంలో వెళ్తున్నప్పుడు కూడా విండో సీట్ కావాలని విసిగించిన ఓ ప్రయాణికుడికి బొమ్మ చూపించి, దిమ్మ తిరిగేలా చేసిందో ఏయిర్ హోస్టెస్. జపాన్‌లో జరిగిన ఈ విచిత్ర సంఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో లీకై, తెగ వైరల్ అయ్యాయి. జపాన్ నుంచి వేరే దేశానికి వెళ్తున్న విమానంలో భూమికి 35000 అడుగుల ఎత్తున జరిగిన తతంగం ఇది.

‘నాకు విండో సీటు కావాలి... విండో నుంచి బయటి ప్రపంచాన్ని చూడాలి...’ అంటూ ఓ ఎయిర్ హోస్టెస్‌ను తెగ విసిగించాడో ప్రయాణికుడు. అయితే ఆ విమానంలో విండో సీట్ అందుబాటులో లేదు... ఆ విషయాన్ని అతనికి ఎలా చెప్పినా, ఎన్నిసార్లు వివరించినా మనోడు వినిపించుకోలేదు. విండో సీట్లలో కూర్చొన్నవారిని లేపి... తనకా సీటు ఇప్పించాలని నానా రచ్చ చేశాడు. దాంతో చిర్రెత్తుకొచ్చిన ఎయిర్ హోస్టెస్ ఓ పేపర్‌పై విండో బొమ్మను గీసి, అతని సీటు పక్కన అతికించింది. దాంతో ఏం చేయాలో తెలియక మనోడు సైలెంటుగా కళ్లు మూసుకుని పడుకున్నాడు. ఎయిర్ హోస్టెస్ ఇచ్చిన పంచ్‌కు విమానం దిగే దాకా నోరు మెదపకుండా అలా స్తంభించి ఉండిపోయాడు. ఈ దృశ్యాలను అక్కడున్న మిగతా ప్రయాణికులు ఫోటోలు తీయడంతో అవి కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అన్ని సందర్భాల్లో కోపం పనికి రాదు, సమయస్ఫూర్తితో నిండిన చతురత ఉంటే ఎలాంటి సందర్భాన్నైనా నిరూపించిన ఆ ఎయిర్ హోస్టస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్‌కి అందరూ ఫిదా అయిపోయారు.

విండో సీట్, విమానం, విమానంలో విండో సీట్, ఎయిర్ హోస్టెస్, ఫ్లైట్స్, వైరల్ న్యూస్, వైరల్ వీడియోలు, Flight Attendant, Variety Passeenger, Window Seat, Facebook, Instagram
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విండో సీట్ బొమ్మFirst published: November 16, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>