Video : ఎయిర్‌పోర్టులో ఫ్లాష్‌మాబ్... జాతీయ జెండాలతో...

ఫ్లాష్ మాబ్ (Image : FB - Netaji Subhas Chandra Bose International Airport - Kolkata)

Independence Day 2019 : ఇప్పటివరకూ మనం ఎన్నో రకాల ఫ్లాష్‌మాబ్‌లు చూశాం. కోల్‌కతా ఎయిర్‌పోర్టులో జరిగింది మరో రకం. అక్షయ్ కుమార్ సినిమా కేసరిలోని... తేరీ మిట్టీ సాంగ్‌కి జాతీయ జెండాలతో ఫ్లాష్‌మాబ్ చెయ్యడం ప్రయాణికులకు సర్‌ప్రైజ్ కలిగించింది.

  • Share this:
73వ స్వాతంత్ర్య దినోత్సవం దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతోంది. ఒక్కో చోట ఒక్కో రకంగా నిర్వహించుకుంటున్నారు. అంతటా దేశభక్తి ఉప్పొంగుతోంది. ఈ సందర్భంగా కోల్‌కతా ఎయిర్‌పోర్టులో జరిగిన ఫ్లాష్‌మాబ్... ప్రయాణికులను చూపు తిప్పుకోనివ్వలేదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో కొందరు ప్రయాణికులు ఉన్నట్టుండి... జాతీయ జెండాలను తమ లగేజీ లోంచీ బయటకు తీశారు. అక్షయ్ కుమార్ సినిమా కేసరిలోని... తేరీ మిట్టీ సాంగ్‌ స్టార్ట్ చేశారు. అందరూ డాన్సర్లుగా మారి... ఫ్లాష్‌మాబ్ చేశారు. ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలో... జరిగిన ఈ డాన్స్ ప్రయాణికులకు ఎంతగానో నచ్చింది. ఇప్పుడీ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యింది. నెటిజన్లు ఇది చూసి సలాం కొడుతున్నారు.

2017లో కూడా ఇలాగే కోల్‌కతా ఎయిర్‌పోర్టులో... దుర్గా పూజ చేసి... ఫ్లాష్‌మాబ్ నిర్వహించారు. అప్పట్లో అది సెన్సేషన్ అయ్యింది.
Published by:Krishna Kumar N
First published: