హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video: ఢిల్లీలో పేక మేడలా కూలిన ఐదు అంతస్తుల బిల్డింగ్.. వీడియో ఇదిగో..

Viral Video: ఢిల్లీలో పేక మేడలా కూలిన ఐదు అంతస్తుల బిల్డింగ్.. వీడియో ఇదిగో..

BUILDINIG COLLAPS

BUILDINIG COLLAPS

Viral Video:హోలీ పండుగ రోజు మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఐదంతస్తుల భవనం అందరూ చూస్తుండగానే పేక మేడలా కూలిపోయింది. భవనం కూలిపోయే కొద్ది సేపటి ముందు వరకు అందులో జనం ఉన్నారు. అయితే భవనం రోడ్డుపై కూలి పడుతున్న సమయంలో జనం ప్రాణభయంతో పరుగులుపెట్టారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

హోలీ (Holi)పండుగ రోజు మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో ఓ ఐదంతస్తుల భవనం(Five storied Building) అందరూ చూస్తుండగానే పేక మేడలా కూలిపోయింది. భవనం కూలిపోయే కొద్ది సేపటి ముందు వరకు అందులో జనం ఉన్నారు. అయితే భవనం రోడ్డుపై కూలి పడుతున్న సమయంలో జనం ప్రాణభయంతో పరుగులుపెట్టారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది స్పాట్‌కు చేరుకొని సహాయకచర్యలను ముమ్మరం చేశారు.

కుప్పకూలిన బిల్డింగ్..

ఢిల్లీలో హోలీ పండుగ రోజున ప్రమాదం జరిగింది. విజయ్‌ పార్క్ సమీపంలోని భజన్‌పూరా ప్రాంతంలో ఐదు అంతస్తుల భవనం మధ్యాహ్నం 3.05గంటల సమయంలో కూలిపోయింది. రోడ్డు పక్కనే ఉన్న బిల్డింగ్ ముందుకు పడిపోవడంతో పెద్ద శబ్ధం వచ్చింది. భవనం శిథిలాల కింద పడకుండా జాగ్రత్త పడేందుకు స్థానికులు, కూలిన బిల్డింగ్‌ చుట్టు పక్కల వాళ్లు పెద్దగా అరుపులు చేస్తూ పరుగులు పెట్టారు. రెప్పపాటులో ఐదంతస్తుల బిల్డింగ్ పూర్తిగా ధ్వంసమైంది. భవనం పడిపోయే కొద్ది సమయం ముందు వరకు బిల్డింగ్‌లో , దాని ముందు జనం తిరుగుతూ ఉన్నారు. పడిపోయిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.

తప్పిన ప్రాణనష్టం..

స్థానికులు వెంటనే విషయాన్ని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు చేరవేశారు. ఘటన స్తలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు సహాయకచర్యలు ముమ్మరం చేశాయి. అయితే భవనం కూలిపోవడానికి గల కారణాలను నిర్ధారించినట్లుగా తెలుస్తోంది. ఉదయం నుంచి ఇళ్లలో నివాసముంటున్న ప్రజలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. బుధవారం భజన్‌పూర ప్రాంతంలో ఐదంతస్తుల భవనం కూలినట్లుగానే మార్చి 1వ తేదిన నార్త్ ఢిల్లీలోని రోషనారా రోడ్డులో నాలుగు అంతస్తుల భవనం కూడా ఇదే విధంగా నేలమట్టమైంది. ఆ ప్రమాదంలో కూడా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు ఈసందర్బంగా వెల్లడించారు.

Building Collaps
(Building Collaps)

నష్టం ఏమేరకో..

ఈప్రమాదంలో ఎంత మేరకు ఆస్తినష్టం జరిగింది. ఎవరైనా గాయపడ్డారా లేదా అనే విషయాలపై ఆరా తీస్తున్నారు అధికారులు. అలాగే కూలిన బిల్డింగ్‌లో ఏవైనా విలువైన వస్తువులు, నగలు ఉన్నాయనే ఆలోచనతో అక్కడ సెక్యురిటీ ఏర్పాటు చేశారు.

First published:

Tags: Building Collapse, Delhi news

ఉత్తమ కథలు