కల్తీ మద్యం తాగి చనిపోయిన వాళ్లను చూశాం. ఫుడ్ పాయిజన్(Food poisoning) కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లుగా వార్తలు విన్నాం. కాని మొట్ట మొదటి సారిగా ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో టీ తాగి ఐదుగురు చనిపోయారు. ఇందులో ఇంకా గమ్మైత్తైన విషయం ఏమిటంటే మృతులు తాగిన హోటల్(Hotel)లో తయారు చేసింది కాదు.. ఇంట్లో తయారు చేసిన టీ (Tea)తాగడం వల్లే ఐదుగురు చనిపోయారు. ఇందులో నలుగురు కుటుంబ సభ్యులు ఉండగా..ఒకరు మాత్రం పక్కింటికి చెందిన వ్యక్తి ఉన్నాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుతున్న పోలీసులు(Police)అసలు టీ తాగితే చనిపోవడం ఏమిటని ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. ఐదుగురు ప్రాణాలు పోవడానికి కారణం ఏమిటో..ఎవరో తెలిసి పోలీసులు ఆశ్చర్యపోయారు. కేసు కూడా నమోదు చేశారు.
టీ తాగి ఐదుగురు మృతి..
ఉత్తరప్రదేశ్‌లో టీ తాగి ఐదుగురు మృతి చెందిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. మెయిన్‌పురిలోని నాగ్లా గన్హె గ్రామానికి చెందిన శివానందన్ అనే వ్యక్తితో పాటు అతని కుమారులు శివాంగ్, దివ్యాన్ష్ అనే ఇద్దరు ఆరేళ్ల పిల్లలు అతని తండ్రి రవీంద్రసింగ్‌తో పాటు పొరుగు ఇంట్లో ఉంటున్న సోబ్రాన్ అనే వ్యక్తి టీ తాగి అస్వస్థతకు గురయ్యారు. ఉదయం లేవగానే రోజు ఇచ్చినట్లుగానే శివానందన్‌తో పాటు కుటుంబ సభ్యులకు అతని భార్య టీ తీసుకొచ్చి ఇచ్చింది. అది తాగిన వెంటనే ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు.
టీ కాదు కాలకూట విషం..
టీ తాగిన తర్వాత అందరూ అపస్మారకస్తితిలోకి జారుకోవడంతో కంగారుపడిన మహిళ..చుట్టు పక్కల వాళ్లు ఐదుగుర్ని వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శివానంద్ తండ్రి 55ఏళ్ల రవీంద్ర సింగ్, ఆరు సంవత్సరాల వయసున్న దివ్యాన్ష్, శివాంగ్ చనిపోయినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. శివానంద్, పొరుగింటికి చెందిన వ్యక్తి సోబ్రాన్ పరిస్థితి విషమంగా ఉండటంతో సైఫాయి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వాళ్లిద్దరూ కూడా ప్రాణాలు విడిచారు.
ఒకే ఫ్యామిలీలో నలుగురు..
ఐదుగురు తాగిన టీలో పురుగుల మందు కలపడం వల్లే చనిపోయారని గుర్తించారు డాక్టర్లు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్‌కి చేరుకున్నారు.కేసు నమోదు చేసుకొని టీ కలిపి ఇచ్చిన శివానంద్ భార్యను విచారించడంతో అసలు విషయం బయటపడింది. పాలల్లో టీ పొడికి బదులుగా వరి చేనులో కలిపేందుకు ఇంట్లో ఉంచిన పొడిని కలిపిందని తేల్చారు. ఐదుగు మృతదేహాల్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Trending news, Uttar pradesh, VIRAL NEWS